
సాక్షి,ఆదిలాబాద్: కోట్ల రూపాయలు దండుకోవాల నే భారీ స్కెచ్ పటాపంచలైంది. భూముల పత్రాల కు సంబంధించి లోపాలను సవరించుకోవాలంటూ మావల తహసీల్దార్ కార్యాలయం నుంచి ఓ భారీ కుతంత్రం జరిగిందనే ప్రచారం సాగుతోంది. భూ యజమానులకు నోటీసులు జారీ చేయడం, దానికి అనుగుణంగా ఎవరైనా సరిచేసుకునేందుకు ముందుకు వస్తే ముందుగా రూపొందించిన అక్రమ ప్ర ణాళిక అమలుపర్చడం ఇందులో భాగం. సుమారు 80 మందికి ఇలాంటి నోటీసులు జారీ చేశారనే ప్రచారం ఉంది. అయితే ఈ ప్రక్రియ అధికారికంగా జరిగిందా.. అనధికారికంగా జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు. రెవెన్యూ శాఖలో ఇలాంటి వ్యవహారాల్లో ఆరితేరిన వారిని ముందుంచి ఎవరైనా రాజకీయ నాయకుడు వెనుకుండి వ్యవహారం నడిపారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. మ ధ్యలో పేరు మార్పునకు సంబంధించి పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి తహసీల్దార్, ఆర్‌ఐను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం సంచలనం కలిగిస్తుంది.
కోట్ల విలువైన భూములు..
మావలలో ఎవరికై న ఒక ఎకరం భూమి ఉందంటే అతన్ని కోటీశ్వరుడు అంటారు. ఎందుకంటే ఆది లాబాద్ శివారులో ఉన్న ఈ మండలంలో ఎకరం భూమి విలువ రూ.2 కోట్ల నుంచి రూ.3కోట్లకు పై గా పలుకుతోంది. అయితే ఈ మండలంలో ప్రభు త్వ, అసైన్డ్ భూములు అనేక సర్వేనంబర్లలో ఉన్నా యి. ప్రైవేట్ భూములకు ఆనుకొని ఉన్న ఈ అసైన్డ్ భూములను పలువురు ఆక్రమించుకున్నారు. అంతే కాకుండా గతంలో అసైన్డ్‌దారుల నుంచి పలువురు ఈ భూములను కొనుగోలు చేశారు. ఇవి రియల్ వెంచర్లుగా తయారయ్యాయి. అయితే ఈ వెంచర్లలోని లోపాలపై అవగాహన ఉన్న రెవెన్యూ అధికా రులు ఈ భారీ ప్రణాళికకు స్కెచ్ వేశారనే ప్రచారం సాగుతోంది. దానికి అనుగుణంగా నోటీసులు జారీ చేయడం, భూ యజమానులు సవరణతో ముందుకొస్తే విస్తీర్ణానికి అనుగుణంగా పెద్ద ఎత్తున డబ్బుల డిమాండ్ సాగిందని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి నోటీసులకు సంబంధించి ఎన్నింటి కి సవరణలు చేశారనే విషయం బయటకు రాలేదు.
స్పష్టత కరువు..
సాధారణంగా ధరణి పోర్టల్ తెలంగాణ మాడ్యుల్ (టీఎం) 30లో భూములకు సంబంధించి ఏమైనా పొరపాట్లు ఉంటే భూ యజమానులు దరఖాస్తు చేసుకున్న పక్షంలోనే శాఖాపరంగా అధికారికంగా నోటీసులు జారీ చేయడం ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కాగా మావలలో జరి గిన నోటీసుల వ్యవహారం అధికారికంగా జరిగిందా.. అనధికారికంగా జరిగిందా అనే దానిపై ఉన్నతాధికారుల వద్ద స్పష్టత లేదు. ఇదిలా ఉంటే.. ఏసీబీ దాడి కేసులో బాధితులు నేరుగా తమ భూ ములకు సంబంధించి పేర్ల సవరణ కోసం రెవె న్యూ అధికారులను ఆశ్రయించినట్లు ఏసీబీ అధికా రులు చెబుతున్నారు.
అనధికారికంగా నోటీసుల జారీపై స్పష్టత లేదు
మావల తహసీల్దార్ కార్యాలయం నుంచి భూ యజమానులకు అనధికారికంగా నోటీసులు జారీ చేశారా అనే విషయంపై స్పష్టత లేదు. సాధారణంగా టీఎం మాడ్యుల్‌లో దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించి నోటీసులు జారీ చేసి సవరించడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ.
– స్రవంతి, ఆర్డీవో, ఆదిలాబాద్