
విద్యార్థులను అభినందిస్తున్న పాఠశాల ప్రిన్సిపాల్
ఆదిలాబాద్‌టౌన్: జాతీయ స్థాయి ఐఎన్‌టీఎస్‌ఓ ఒలింపియాడ్ లెవల్–2 పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. పట్టణంలోని చైతన్య పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రథమ బహుమతి, 4, 5వ బహుమతులతో పాటు 31 మంది గోల్డ్‌మెడల్, 20 మంది మెరిట్ సర్టిఫికెట్‌ను పొందినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో నజీమ్, జెస్సిక, అజయ్, శ్రీవిద్య, శ్రీధర్, లక్ష్మణ్‌రావు, రాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.