breaking news
yadagirirkonda
-
ఘనంగా తిరునక్షత్రోత్సవం
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో శ్రావణ శుద్ధ శుక్రవారం ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవం (పుట్టినరోజు) సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో సువర్ణ పుష్పార్చన, ప్రత్యేక సుదర్శన నారసింహా యాగం, నారసింహ అష్టోత్తర పూజ, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఇందుకోసం ఆలయంలో పారాయణం చేయడానికి ప్రత్యేకంగా ఐదుగురు ప్రత్యేక రుత్విక్కులను ఆహ్వానించారు. ఆలయాన్ని, స్వామి అమ్మవార్లను అందంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంరపింతి ప్రత్యేక గజ వాహన సేవలో ఊరేగించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మెన్ బి. నరసింహామూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు నల్లంతీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు సురేంద్రాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, అధికారులు చంద్రశేఖర్, దోర్భల భాస్కరశర్మ, గోపాల్, వేముల వెంకటేశ్ పాల్గొన్నారు. -
యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానానికి ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో బోనాల పండుగ సందర్భంగా భక్తుల రద్దీ పూర్తిగా తగ్గు ముఖం పట్టింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైలన్నీ భక్తులు లేక వెలవెలబోయాయి. కేవలం అరగంటలో స్వామి, అమ్మవార్ల దర్శనం జరిగినట్లు భక్తులు తెలిపారు. ఆదివారం సుమారు 5 వేల మంది భక్తులు వచ్చినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.