breaking news
Xavier Bettel
-
ప్రధాని 'గే' వివాహం
లక్సెంబర్గ్: లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బిటెల్ (42) 'గే' (స్వలింగ) వివాహాం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక నగరంలోని టౌన్ హాల్లో తన సహచరుడు, ఆర్కిటెక్ట్ అయిన గౌతియర్ డెస్టెనేను ఆయన సంప్రదాయబద్ధంగా పెళ్లాడారు. 28 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్‌లో స్వలింగ వివాహం చేసుకున్న తొలి ప్రధాని బిటెల్ కావటం విశేషం. ఈ వివాహ వేడుకకు బెల్జియం ప్రధాని చార్లెస్ మైకేల్‌తో పాటు సుమారు 500మంది అతిథులు హాజరయ్యారు. 2010లో ఐస్లాండ్ ప్రధాని జోహనా సిగుర్డార్డోటిర్ కూడా తన సహచరిణిని పెళ్లాడింది. ఆ తర్వాత ప్రపంచ దేశాధినేతల్లో స్వలింగ వివాహం చేసుకున్న రెండో నాయకుడు బిటెల్. 2013 డిసెంబర్లో జేవియర్ బిటెల్ లక్సెంబర్గ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతకు మూడేళ్ల ముందు నుంచే ఆయన గోతియర్తో సహజీవనం చేస్తున్నారు. -
సహచరుడ్ని పెళ్లాడనున్న ప్రధాని
ప్రశాంత జీవనానికి చిరునామా లాంటి పశ్చిమ యూరప్ దేశం లక్సెంబర్గ్.. మరో అరుదైన వేడుకకు వేదిక కానుంది. ఆ దేశ ప్రధానమంత్రి జేవియర్ బెటెల్.. తన సహచరుడు గోథియర్ను వచ్చే నెలలో పెళ్లాడనున్నట్లు అధికారిక వర్గాలు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపాయి. స్వలింగ సంపర్కుడయిన జేవియర్.. 2013 డిసెంబర్లో లక్సెంబర్గ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతకు మూడేళ్ల ముందునుంచే ఆయన గోథియర్తో సహజీవనం చేస్తున్నారు. ప్రధాని హోదాలో ఒక గే పెళ్లిచేసుకోనుండటం ఇదే ప్రధమం కావడంతో ఈ వేడుకపై సర్వత్రా ఆసక్తినెలకొంది. ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు కొన్ని పెళ్లి వేడుకను ప్రత్యేకంగా ప్రచురించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. కానీ వివాహం తన వ్యక్తిగత విషయమని, ప్రచారం అవసరంలేదని ప్రధాని జేవియర్ సున్నితంగా తిర్కరించారు. లక్సెంబర్గ్ నగరంలోని రోమన్ క్యాథలిక్ డచీ చర్చీలో వీరి వివాహం జరగనుంది. ఎన్నికల్లో భారీ మెజారితో గెలిచిన జేవియర్.. లక్సెంబర్గ్‌లో ఎల్జీబీటీ (లెస్బియాన్, గే, బైసెక్పువల్స్, ట్రాన్స్‌జెండర్స్) హక్కుల పరిరక్షణకోసం చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే రెండు నెలల కిందటే గే మ్యారేజ్‌ను చట్టబద్ధం చేశారు.