సహచరుడ్ని పెళ్లాడనున్న ప్రధాని | Luxembourg PM to marry gay partner | Sakshi
Sakshi News home page

సహచరుడ్ని పెళ్లాడనున్న ప్రధాని

May 13 2015 1:39 PM | Updated on Sep 3 2017 1:58 AM

సహచరుడు గోథియార్ (ఆరెండ్ టై) తో లక్సెంబర్గ్ ప్రధాని జేవియర్ (బ్లూ టై)

సహచరుడు గోథియార్ (ఆరెండ్ టై) తో లక్సెంబర్గ్ ప్రధాని జేవియర్ (బ్లూ టై)

స్వలింగ సంపర్కుడయిన జేవియర్.. 2013 డిసెంబర్లో లక్సెంబర్గ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతకు మూడేళ్ల ముందునుంచే ఆయన గోథియర్తో సహజీవనం చేస్తున్నారు.

ప్రశాంత జీవనానికి చిరునామా లాంటి పశ్చిమ యూరప్ దేశం లక్సెంబర్గ్.. మరో అరుదైన వేడుకకు వేదిక కానుంది. ఆ దేశ ప్రధానమంత్రి జేవియర్ బెటెల్.. తన సహచరుడు గోథియర్ను వచ్చే నెలలో పెళ్లాడనున్నట్లు అధికారిక వర్గాలు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపాయి.  స్వలింగ సంపర్కుడయిన జేవియర్.. 2013 డిసెంబర్లో  లక్సెంబర్గ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతకు మూడేళ్ల ముందునుంచే ఆయన గోథియర్తో సహజీవనం చేస్తున్నారు.

ప్రధాని హోదాలో ఒక గే  పెళ్లిచేసుకోనుండటం ఇదే ప్రధమం కావడంతో ఈ వేడుకపై సర్వత్రా ఆసక్తినెలకొంది. ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు కొన్ని పెళ్లి వేడుకను ప్రత్యేకంగా ప్రచురించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. కానీ వివాహం తన వ్యక్తిగత విషయమని, ప్రచారం అవసరంలేదని ప్రధాని జేవియర్ సున్నితంగా తిర్కరించారు.

లక్సెంబర్గ్ నగరంలోని రోమన్ క్యాథలిక్ డచీ చర్చీలో వీరి వివాహం జరగనుంది. ఎన్నికల్లో భారీ మెజారితో గెలిచిన జేవియర్.. లక్సెంబర్గ్లో ఎల్జీబీటీ (లెస్బియాన్, గే, బైసెక్పువల్స్, ట్రాన్స్జెండర్స్) హక్కుల పరిరక్షణకోసం చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే రెండు నెలల కిందటే గే మ్యారేజ్ను చట్టబద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement