breaking news
worshipper
-
మసీదులో ప్రార్థన చేస్తుండగా దారుణం
కసాల(సూడాన్) : మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న వారిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అగంతకుడి కత్తి దాడిలో ముగ్గురు మృత్యువాత పడగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన సూడాన్‌లోని కసాల నగరంలో మంగళవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కసాల నగరంలోని ఓ మసీదులో సాయంకాల ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మసీదులోకి ప్రవేశించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఎవ్వరూ తనకు బదులు చెప్పకపోవడంతో ఆగ్రహించిన దుండగుడు వెంట తెచ్చుకున్న కత్తితో ప్రార్థన చేస్తున్న వారిపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొంత సమయం తర్వాత తేరుకున్న అక్కడి వారు ఆ దుండగుడిపై దాడిచేసి చంపేశారు. గాయాలైన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కసాల రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని, వందల మంది సూడాన్ సైనికులు నగరాన్ని మోహరించినా ఇలాంటివి జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. -
మైకులు, కర్రలు, పెప్పర్ స్ప్రేతో మహిళా భక్తుల ఫైట్
కాలిఫోర్నియా: అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గురుద్వార ఒక్కసారి మినీ రణరంగ క్షేత్రంగా మారింది. ప్రశాంతంగా కళ్లుమూసుకుని తమకు ఇష్టమైన దైవాన్ని తలుచుకున్న వారంతా ఒకరినొకరు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా చేతికి ఏది దొరికితే దాన్నే తీసుకొని కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. కాలిఫోర్నియాలోని ఓ గురుద్వారలో వీకెండ్ సందర్భంగా ఒక చోట చేరిన సిక్కులంతా ప్రార్ధన చేశారు. అనంతరం అందులోని ఓ సిక్కు మహిళ, గురుద్వార పెద్దలతో ఏదో మాట్లాడుతూ ఆ వెంటనే వారి ముందున్న మైకులను విరిచివేసింది. ఆమెను అడ్డుకునేందుకు ఇంకో మహిళరాగా తోపులాట జరిగింది. ఆ వెంటనే అక్కడ ఉన్న మైకులను, కర్రలను తీసుకొని కొట్టుకోవడమే కాకుండా కొందరు పెప్పర్ స్ప్రేతో కూడా దాడికి దిగినట్లు ఆ వీడియో పేర్కొంది. గురుద్వారాను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో చర్చించుకున్నవారు.. అభిప్రాయభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా చీలి వెంటనే గొడవకు దిగారని పోలీసులు చెప్తున్నారు. ఈ సమయంలో మొత్తం 100మంది ఉన్నట్లు చెప్పారు.