breaking news
World handicaps Day
-
'అనందంలో'.. ఫిన్‌ల్యాండ్ మొదటి స్థానం! మరి ఇండియా..??
"అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.." అని ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం సముద్రాల రామానుజాచార్య ఓ పాట రాశారు. ఆ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచి, ఆలపించారు ఘంటసాల. ఇది 1973లో వచ్చిన 'బతుకుతెరువు' సినిమాలోనిది. పాట చివర్లో "జీవితమే ఒక నాటకరంగం" అంటారు. నాటకం వంటి జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒకరోజు తెరపడుతుంది. అది తప్పదు. పుట్టినప్పటి నుంచి పోయేంత వరకూ సాగే బతుకు నడుమ ఆనందాన్ని పోగుచేసుకొని అనుభవిస్తేనే ఆనందం. లేకపోతే, అంతా అయోమయం, విషాదం. ఈ జీవనసారాన్ని మన మహర్షులు, మహర్షుల వంటి మహాకవులు, మహనీయులు, మాననీయ మూర్తులు తెలుసుకున్నారు, మనసారా అనుభవించారు, ఆచరించండని మనకు అనేక రూపాల్లో, మార్గాల్లో చెప్పారు. మార్చి, 20 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం'. మనుషులంతా సంతోషంగా ఉండండి, అది అందరికీ పంచండి, అది ఎక్కుడుందో వెతికి పట్టుకోండి, పట్టుకొని వదలకండి.. అంటూ ఐక్యరాజ్య సమితి అంటోంది. సుమారు ఓ పుష్కరం క్రితం (2013) తొలిసారిగా, సమితిలోని సభ్యదేశాలన్నీ ఈ వేడుకను జరుపుకున్నాయి. అప్పటి నుంచి ప్రతి ఏడూ జరుపుకుంటున్నాయి. బుధవారం నాడు అందరం జరుపుకున్నాం. కానీ, అందరికీ ఈ ఉత్సవం గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ స్థాయిలో ప్రచారం జరుగలేదు. మనదేశంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో.. మనం ఈ ఆనంద సంబరాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోయాం. ఈ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడూ కొన్ని నివేదికలు అందుతూ వుంటాయి. ఏ ఏ దేశాలలో సంతోష, ఆనందాల స్థాయి ఎట్లా వుందని కొలుస్తారు. ఆ కొలతలకు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఈ నియమాల ప్రకారం నివేదిక ద్వారా మనకు అర్థమవుతున్నదేంటంటే? అనందంలో మనదేశం 126 వ స్థానంలో వుంది. మనకంటే ఎంతో పేద దేశాలు ముందు వరుసలో వున్నాయి. మన పొరుగు దేశాలైన చైనా, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్ మనకంటే ఆనందంగా వున్నాయి. మొత్తం దేశాలలో ఫిన్ ల్యాండ్ అందరికంటే ఆనందమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు ఏడేళ్ల నుంచి ఫిన్ ల్యాండ్ తన అగ్రతను కాపాడుకుంటూ వస్తోంది. 60 వ ర్యాంక్ తో మనకంటే చైనా చాలా ఆనందంగా ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది. క్షేత్రస్థాయిలో, నిజజీవితంలో వాస్తవాలు మనకు పూర్తిగా తెలియదు కానీ, ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపిన సంస్థ చెప్పే నివేదికలో మాత్రం విషయాలు అలాగే వున్నాయి. ప్రపంచ మానవాళికి శాంతిని, ఆనందమయ జీవితాన్ని చాటి చెప్పామని చెప్పుకుంటున్న మన దేశం ఈ సూచీలో వెనుకబడి పోవడం వివిధ ఆలోచనలను రేకెత్తిస్తోంది. అంతర్ముఖంగా మళ్ళీ అలోచించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. ఏది ఆలోచిస్తే, ఏది చేస్తే, ఏది చూస్తే ఆనందం కలుగుతుందో? అవన్నీ మన మహర్షులు మనకు ఎన్నడో చెప్పేశారు. భగవద్గీత నుంచి సంగీతం వరకూ, ధ్యానం నుంచి యోగాభ్యాసం వరకూ, మౌనం నుంచి ఆధ్యాత్మిక సాధన వరకూ, శాంతి నుంచి స్థితప్రజ్ఞత వరకూ మనకు బోధించారు. వాటిని కొందరు ఆచరించారు, కొందరు ఆచరించే ప్రయత్నం చేస్తూనే వున్నారు. కొందరు ఇవ్వేమీ తెలియకుండానే సహజంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎక్కువమంది ఆనందంగా లేరు. అసంతృప్తితో అలమటిస్తున్నారు, అయోమయంలో వున్నారు. ఐక్యరాజ్య సమితి పెట్టిన నియమాలను ఒకసారి వీక్షిద్దాం. ఆత్మతృప్తి, జీవనకాలం (లైఫ్ స్పాన్), సామాజిక మద్దతు, తలసరి ఆదాయం, దాతృత్వం, స్వేచ్ఛ, అవినీతి మొదలైన వాటిల్లో ఆయా దేశాలు, ఆయా దేశ ప్రజలు ఎలా వున్నారన్నది ప్రాతిపదికగా దేశాలకు ర్యాంకులను కేటాయించారు. అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ వంటి దేశాలలో కూడా సంతోషం సన్నగిల్లుతోందని ఈ నివేదిక చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్న దేశాలే ఎక్కువ ఆనందంగా వున్నాయి. "చిన్న కుటుంబం - చింతలులేని కుటుంబం " అన్న పాత సామెత గుర్తుకువస్తోంది. అనందాన్ని అనుభవించేవారి వయసుల్లోనూ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీరు నడుస్తోంది. పెద్ద వయస్సు వారికంటే చిన్నవాళ్లే ఆనందంగా ఉన్నారని నివేదికలు చెబుతున్నా, అన్నిచోట్లా అట్లా లేదు. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి దేశాల్లో యువత కంటే పెద్దలే ఎక్కువ ఆనందంగా వున్నారు. ఐరోపా వాసుల్లో ఆనందం కాస్త పెరుగుతున్నట్లు, పశ్చిమ యూరప్ లో అందరూ సమానమైన సంతోషకర వాతావరణంలో వున్నారని తెలుస్తోంది. ఒక్క ఐరోపా దేశాల్లో తప్ప మిగిలిన అన్ని దేశాలలోనూ ఆనందంలో అసమానతలు పెరిగిపోతూ ఉండడం బాధాకరం. అందులో మనదేశం కూడా వుండడం ఇంకా బాధాకరం. అందరి కంటే అత్యంత ఆనందంగా వున్న ఫిన్ ల్యాండ్ ప్రజలను గమనిస్తే వారి లక్షణాలు, ఆలోచనలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి, స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ప్రకృతితో ఎక్కువ మమేకమై ఉండడం, వృత్తిని - జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ, సమతుల్యత పాటిస్తూ సాగడం, విజయంపై స్పష్టమైన అవగాహన కలిగివుండడం, అవినీతి తక్కువగా ఉండడం, ప్రభుత్వాల పట్ల ఎక్కువ విశ్వాసం కలిగి వుండడం, ఆరోగ్యం, విద్య, సంరక్షణలో ప్రభుత్వం సక్రమంగా పరిపాలన, సేవలు అందించడం మొదలైనవి ఫిన్ ల్యాండ్ వారి ఆనందమయ జీవితానికి కారకాలుగా, ప్రేరకాలుగా కనిపిస్తున్నాయి. 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం' లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎజెండా పెట్టుకుంటున్నాం. "అనందానికి తిరిగి దగ్గర కావడం - స్థితప్రజ్ఞత కలిగే, పెరిగే సమాజాలు నిర్మించుకోవడం" ఈ 2024 సంవత్సరానికి పెట్టుకున్నాం. ఇది సాధించడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఆనందం ఎక్కడో లేదు, మనలోనే వుంది. మన ఆలోచనలలో వుంది, మన ఆచరణలో, నడవడికలో వుంది. రమణమహర్షి నుంచి రామానుజాచార్యులు (సముద్రాల) వరకూ, మహాత్మాగాంధీ నుంచి మార్క్ ట్వైన్ వరకూ, ఆదిశంకరాచార్యుల నుంచి అబ్రహం లింకన్ వరకూ, లియో టాల్ స్టాయ్ నుంచి జాన్ కీట్స్ వరకూ చెప్పింది ఒక్కటే! "ఆనందంగా ఉండండి, తోటివారిని అనందంగా ఉంచండి ". ఈ క్రమంలో, మనకు బోలెడు సారస్వతం వుంది, కళలు వున్నాయి, భగవద్గీత, మహాభారత రామాయణాది కావ్యాలు, ఇతిహాసాలు, వేదవేదాంగాలు అందించిన జ్ఞానభాండాగారం మన దేశానికి మెండుగా అండగా వుంది. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి నిద్రలోకి జారుకొనేంత వరకూ ఏమేమి చెయ్యాలో, ఏమేమి చెయ్యకూడదో ఆచార్యులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతూనే వున్నారు. ఆహారం, నిద్ర, వ్యాయామ నియమాలు, శాంతి, విశ్రాంతిని ఆచరించడం మన చేతుల్లోనే వుంది. ప్రతి మనిషి కోరుకొనేది ఒక్కటే.. ప్రతి క్షణం ఆనందంగా ఉండడం. అదే జీవిత మకరందం. ఈ ఆనంద సూచీలో మనం ఫిన్ ల్యాండ్ ను దాటి మొదటి స్థాయిని అందుకోవాలి. అందరూ అనందంగా ఉండాలని అనుకుందాం. — మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
10 నుంచి అర్హులందరికీ ‘ఆసరా’
ప్రగతినగర్ : జిల్లాలో అర్హులైనవారందరికీ ఈ నెల 10వ తేదీ నుంచి పింఛన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. అర్హులకు పింఛన్లు అందేలా జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోందన్నారు. పింఛన్లపై వికలాంగుల కు అనుమానాలు అవసరం లేదని, ఏ ఒక్కరికీ అ న్యాయం జరగకుండా చూస్తామన్నారు. అర్హులందరికీ ఆసరా కల్పిస్తామన్నారు. వికలాంగులు అనే పదాన్ని వాడకూడదని, వారికి ఆ పదం పదేపదే ఉచ్చరించి మనం తప్పుపని చేస్తున్నామన్నారు. వికలాంగులు అన్నప్పుడల్లా వారు మనోవేదనకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అం దువల్ల వారిని విభిన్న ప్రతిభావంతుల కింద లెక్కించాలని సూచించారు. ఆస రా పథకం కేవలం వికలాంగులకు కాస్త ఆసరా క ల్పించడానికి మాత్రమే అని, దానినే జీవితం అ నుకోకూడదన్నారు. వారు ఆత్మస్థైర్యంతో ధైర్యంగా అందరితో పాటు సమాజంలో ముందుకుసాగాలని కోరారు. వికలాంగుల్లో కూడా ఎంతోమంది చక్కని ప్ర తిభ కనబరుస్తున్నారన్నారు. జిల్లాలో ఎంతో మంది వికలాంగులు దేశ విదేశాల్లో తమ ప్రతి భను చాటి జిల్లాకు తలమానికంగా నిలిచారన్నా రు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సదరం శిబిరంపై ఆం దోళన చెందవద్దన్నారు. సదరం శి బిర మే వికలాంగుల వద్దకు వచ్చేవిధంగా చూస్తామన్నారు. వైకల్యం ఎవరిలో ఉండదు. - నగర మేయర్ ఆకుల సుజాత వైకల్యం అనేది ఏ ఒక్కరిలో ఉండదని నగర మేయర్ ఆకుల సుజాత అన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో తాను కూడా కాలు కోల్పోయానని, ప్రస్తుతం తన కాలులో రాడు ఉండి తాను కూడా వికలాంగురాలిగా ఉన్నానని అన్నారు. వికలాంగులు పడే బాధలు తనకు తెలుసునని, కానీ వారు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు. వికలాం గుల కోసం తాను శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. అనంతరం అదనపు జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం పలు రకాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోం దని, వాటిని ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. బహుమతుల ప్రదానం అనంతరం వికలాంగుల సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఎంతగానో ఆ కట్టుకున్నాయి. స్నేహ సొసైటీ , ఏపీ ఫోరం , ఆర్వీఎం విభిన్న ప్రతిభావంతులు నిర్వహించిన ప్రదర్శనకు గాను బహుమతులను అందజేశారు. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో కొత్తగా తీసుకువచ్చిన 70 ట్రై సైకిళ్లను , వీల్చైర్లను వికలాంగులకు కలెక్టర్ అందజేశారు. ఇటీవలే అంతర్జాతీ య స్థాయిలో రికార్డు సాధించిన వారిని కూడా శాలువతో సన్మానిం చా రు. ఇవే కాకుండా అవసరమైతే వికలాంగుల సంక్షేమ శాఖల ఇతర వికలాంగుల ప రికరాల కోసం ఆ శాఖ ఎండీతో మాట్లాడినట్లు, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వికలాంగ సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, డీఆర్డీఏ పీడీ వెంకటేశం, మెప్మా పీడీ సత్యనారాయణ, ఆర్వీఎం పీఓ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి ప్రత్యేక కార్యక్రమాలు
* వికలాంగుల దినోత్సవం సందర్భంగా.. మండల, జిల్లాస్థాయిలో పోటీలు * ప్రత్యేక అవసరాలుగల పిల్లలు, వారి తల్లిదండ్రులకు * సాధారణ పిల్లలతోపాటు ఉపాధ్యాయులకు కూడా.. చిలుకూరు : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రతి యేటా ప్రపంచ వికలాంగుల దినోత్పవం సందర్భంగా ప్రత్యేక అవసరాల పిల్లలకు మాత్రమే ఒక్క రోజు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసేవారు. కానీ ఈ ఏడాది నుంచి కార్యక్రమాల నిర్వహణలో మార్పులు చేశారు. వారం రోజుల పాటు ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు అలాగే సాధారణ పిల్లలు, ఉపాధ్యాయులకు కూడా మండల జిల్లా స్థాయిలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. నేడు ఉపాధ్యాయులకు.. మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శుక్రవారం వివిధ అంశాలలో పోటీలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు ‘ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలు’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు, సహిత విద్యలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై వకృ్తత్వ పోటీలు , ప్రత్యేక అవసరాల పిల్లల స్థితిగతులపై క్రియేటివ్ ఆర్ట్ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలలో గెలుపొందిన ఉపాధ్యాయులు వచ్చే నెల ఒకటవ తేదీన జిల్లా స్థాయిలో నల్లగొండలోని సర్వశిక్ష అభయాన్‌లో నిర్వహించే పోటీలలో పాల్గొనాలి. డిసెంబర్ 2వ తేదీన పిల్లలకు పోటీలు * వచ్చే నెల 2వ తేదీన ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటు సాధారణ పిల్లలను కలిపి ఆటల పోటీలు నిర్వహిస్తారు. * త్రోబాల్, రింగ్స్ వేయడం, బోర్డు గేమ్, బ్యాలెన్స్ వాక్, రంగోలి, డ్రాయింగ్, పెయింటింగ్, పాటల పోటీలు నిర్వహిస్తారు. బుట్టలో బంతి వేయడం, సరళమైన ఆటలు నిర్వహిస్తారు. 3న తల్లిదండ్రులకు కూడా.. వచ్చే నెల 3వ తేదీన ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు కూడా పలు రకాల ఆటలు పోటీలు నిర్వహిస్తారు . రన్నింగ్, రంగోలి, పాటలు, డ్యాన్స్‌ల పోటీలు నిర్వహిస్తారు. కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు మండలానికి ప్రత్యేకంగా రూ. 10 వేల చొప్పున కేటాయించారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఎంఈఓలకు పూర్తి స్థాయిలో సమాచారం అందించారు.