breaking news
Werewolf Syndrome
-
వెక్కిరింపులను లెక్క చేయలే.... కానీ కొట్టాడు వరల్డ్ రికార్డ్!
లావుగా ఉన్నవాళ్లు సన్నగా రివటలా మారాలని ఆరాట పడుతూ ఉంటారు. అలాగే సన్నగా ఉన్నవాళ్లు కాస్తంత బొద్దుగా ఉంటే బావుండు అని నిట్టూరుస్తూ ఉంటారు. ఇక రింగు, రింగులు జుట్టు ఉన్నవాళ్లలో కొంతమంది స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ చూసి మురిసిపోతుంటారు. నాకూ అలా ఉంటే బావుండు అని అనుకుంటూ ఉంటారు. ఇది సహజమే కానీ అసహజమైన, వింత సిండ్రోమ్‌తో బాధపడుతున్న భారతీయ బాలుడు తన పరిస్థితి గురించి బాధపడ లేదు..ఆత్మవిశ్వాసంతో గిన్నిస్ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. ఎవరా బాలుడు? అతనికున్న సిండ్రోమ్ ఏంటి? తెలుసుకుందాం.మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన లలిత్ పాటిదార్ తనకున్న విపరీతమైన జుట్టుతో బాధపడేవాడు. అవమానపడేవాడు. కానీ దైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఇపుడు అతని జుట్టే అతడికి రికార్డు తెచ్చి పెట్టింది. చదరపు సెంటీమీటర్‌కు 201.72 వెంట్రుకలతో రికార్డు సృష్టించాడు. హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితి కారణంగా అతని ముఖంలో 95 శాతానికి పైగా వెంట్రులున్నాయి.మధ్య యుగాల నుండి ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 50 కేసుల్లో పాటిదార్ కూడా ఒకడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.అయితే మొదట్లో తాను సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆ తరువాత అందరూ తనను అర్తం చేసుకున్నారని అన్నాడు. ఇపుడు చాలా మంది దయతో ఉంటారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎవరైనా వెంట్రుకలను తొలగించుకోవాలని సూచించే వారికి ఇది మామూలే..దీని గురించి పెద్దగా పట్టించుకోను అని చెబుతాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ ‘నేను ఎలా ఉన్నానో అలాగే ఉండటం నాకిష్టం...నా రూపాన్ని మార్చుకోవాలనుకోవడం లేదని’ చెప్పాడు."నాకు మాటలు రావడం లేదు, ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు" అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన లలిత్ పాటిదార్ పుట్టినప్పటి నుండి అరుదైన ''వేర్వోల్ఫ్ సిండ్రోమ్'తో బాధపడుతున్నాడు. 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్' లేదా హైపర్ట్రికోసిస్ తల నుండి కాలి వరకు జుట్టు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి చాలా అరుదుగా ఉండటం వల్ల మధ్య యుగాల నుండి కేవలం 50 మందికి మాత్రమే ఇది సోకిందట. లలిత్ శరీరం మొత్తం పూర్తిగా జుట్టుతో కప్పబడి ఉంది. లలిత్ పాటిదార్‌ను ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. స్కూల్లో పిల్లలు ఎగతాళి చేశారు. మంకీ బాయ్ అంటూ మరికొంతమంది ఏడిపించేవారు. "కొరుకుతాడేమో" అని భయపడేవారు. రాళ్ళు విసిరేవారు. మరికొంతమంది హనుమంతుడి అవతారంగా భావించేవారు. లలిత్ తండ్రి రైతు , అతని తల్లి గృహిణి. ప్రస్తుతం, ముఖం 95 శాతానికి పైగా వెంట్రుకలతో నిండిపోయి ఉన్న లలిత్‌కు తల్లితండ్రులు తొలుత గుండు చేయించారు. కానీ పరిస్థితిలో మార్పు లేదు. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. దీన్ని హైపర్ట్రైకోసిస్ అంటారని, ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదని వైద్యులు చెప్పారు. అయితే వయసు పెరిగిన తరువాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని చెప్పారు.లలిత్‌కు ఇన్స్టాగ్రామ్, తన యూట్యూబ్ ఛానెల్లో ఫాలోయింగ్‌కు కూడా బాగానే ఉంది. ఇన్‌స్టాలో 2 లక్షల 65 వేలు, యూట్యూబ్‌లో లక్షకు పైగా ఫాలోయర్లున్నారు. ఇటీవల ఇటలీలోని మిలన్ టెలివిజన్ షో లో కనిపించాడు. కుటుంబం ఇస్తున్న మద్దతు, ప్రోత్సాహతో ప్రపంచాన్ని చుట్టి రావాలని భావిస్తున్నాడు. విభిన్న సంస్కృతులను అన్వేషించాలనే కల సాకారం దిశగా సాగుతున్నాడు లలిత్. -
తోడేళ్లుగా మారిన వారి ముఖాలు
న్యూఢిల్లీ : స్పెయిన్‌లో ‘అలోపేసియా (జుట్టు సహా శరీరంపై ఎక్కడ వెంట్రుకలున్నా రాలిపోవడం)’ వ్యాధితో బాధ పడుతున్న కొంత మంది యువకులు అందుకు విరుగుడు మందులు వాడడంతో అనూహ్యంగా వారి ముఖాలే మారిపోయాయి. ఒక జుట్టుపైనే కాకుండా ముఖం నిండా వెంట్రుకలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వారి ముఖాలు తోడేలు ముఖాల్లా తయారయ్యాయి. అందుకే దీన్ని ‘వర్‌ఫూల్ఫ్ సిండ్రోమ్’ అని పిలుస్తారని, వైద్య పరిభాషలో ‘హైపర్ట్రికోసిస్’గా వ్యవహరిస్తారని స్పెయిన్ వైద్యాధికారులు తెలిపారు. మందు కల్తీ అవడం వల్ల ఇలా జరిగిందని, ఈ మందును తయారు చేసిన ‘ఫార్మా క్విమికా’ లైసెన్స్‌ను రద్దు చేశామని, ఆ బ్యాచ్ సరకును మొత్తం మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకున్నామని వైద్యాధికారులు చెప్పారు. 16 మంది యువకులు ఈ వ్యాధి బారిన పడినట్లు తమ దృష్టికి వచ్చిందని, ముఖాన భారీగా వెంట్రుకలు వస్తుండడంతో వారు మందులు మానేశారని, అప్పటి నుంచి వెంట్రుకలు అవాంఛిత చోట రావడం ఆగిపోయిందని వైద్యాధికారులు వివరించారు. ఫార్మా క్విమికా కంపెనీ భారత్‌కు కూడా ఔషధాలను విక్రయిస్తుందని అక్కడి మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ విషయం భారతీయ వైద్యాధికారుల దృష్టికి వచ్చిందా లేదా? అన్నది స్పష్టం కావడం లేదని అక్కడి మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. అలోపేసియా అంటే శరీరంలో ఎక్కడ పడితే అక్కడ అవసరమైన దానికంటే ఎక్కువగా వెంట్రుకలు పెరగడం. దీనికి ఒక మందు అంటూ లేదు. వెంట్రుకలు ఏ ప్రాంతంలో పెరుగుతున్నాయి? అవి ఏ స్థాయిలో పెరుగుతున్నాయి? అన్న అంశంపై ఆధారపడి ఉంటుందట. ఇది ఎక్కువ మందికి పుట్టుకతో రాగా, కొందరిలో యుక్త వయస్సులో వస్తుందట. పురుషుల్లో మేల్ హార్మోన్సు అధికంగా ఉండడం వల్ల ఇలా అవాంఛిత వెంట్రుకలు వస్తాయట.