breaking news
WATER TRANSPORTATION
-
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరు మారుస్తాం: మోదీ
అహ్మదాబాద్: నౌకాయాన శాఖను విస్తరించి దాన్ని రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖగా పేరు మారుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్లో రో–పాక్స్ ఫెర్రీ (నౌక) సర్వీసును ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇది 370 కి.మీ దూరాన్ని ఇది 90 కిలోమీటర్లకు (సముద్ర మార్గం) తగ్గిస్తుంది. ‘ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా షిప్పింగ్ శాఖ పేరును మారుస్తున్నామని చెప్పారు. నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సముద్ర రవాణాను బలోపేతం చేయాల న్నారు. నోట్ల రద్దు దేశంలో నల్లధనాన్ని తగ్గించేందుకు, పన్ను వ్యవహారాల్లో క్లిష్టత తొలగిపోవడానికి, పారదర్శకతను పెంపొందించేందుకు దోహద పడిందని మోదీ చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. పన్నుల వ్యవహారాలు మెరుగుపడేందుకు, మెరుగైన పన్ను, జీడీపీ నిష్పత్తికి నోట్ల రద్దు ఎలా దోహదపడిందో తెలిపే గ్రాఫిక్‌ను షేర్ చేశారు. -
వడివడి అడుగులు
తాడేపల్లిగూడెం : జిల్లాలోని ఏలూరు ప్రధాన కాలువ మీదుగా జల రవాణాను పునరుద్ధరించే ప్రక్రియ ఊపందుకుంటోంది. ఈ కాలువను విస్తరించేందుకు ఏ మేరకు భూములు అవసరమవుతాయనే దానిపై ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తి చేసిన కేంద్ర జల రవాణా విభాగం భూసేకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఏలూరు కాలువ వెంబడి ఎక్కడెక్కడ ఎంత భూమిని సేకరించాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చింది. భూసేకరణకు సంబంధించి శనివారం నుంచి సర్వే చేపట్టబోతోంది. 8 మండలాలు.. 37 గ్రామాల్లో.. ఏలూరు ప్రధాన కాలువను జల రవాణాకు వీలుగా వెడల్పు చేసేందుకు జిల్లాలో 8 మండలాల పరిధిలోని 37 గ్రామాల్లో 2,547.13 ఎకరాల భూమి వడివడి అడుగులు అవసరమవుతుందని నిర్థారించారు. రైతుల నుంచి ఆయా భూములను సేకరించనున్నారు. విజయవాడలోని జల రవాణా కార్యాలయ అధికారులు, సర్వే పనులు చేపట్టే ఎక్సెల్ కంపెనీ ప్రతినిధులు సర్వే కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులతో సమావేశమై కాలువకు సంబంధించిన వివరాలు, భూముల పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. ముందస్తుగా సమాచారం సేకరించి సర్వే అధికారులకు అప్పగించనున్నారు. సర్వేలో పాల్గొనేందుకు తహసీల్దార్లు, సర్వేయర్లను అందుబాటులో ఉండాలని ఇప్పటికే కోరారు. గ్రామాల వారీగా సేకరించే భూములిలా కొవ్వూరు మండలం : మద్దూరులో 104.94 ఎకరాలు నిడదవోలు మండలం : విజ్జేశ్వరంలో 52.83, గోపవరంలో 49.28, నిడదవోలులో 210.34, ఆట్లపాడులో 26.18, శెట్టిపేటలో 131.93 ఎకరాలు (మొత్తం 470.57 ఎకరాలు) తాడేపల్లిగూడెం మండలం : నందమూరులో 80.79, ఆరుళ్లలో 89.04, నవాబ్‌పాలెంలో 101.21, ఆరుగొలనులో 34.43, కుంచనపల్లిలో 0.11, తాడేపల్లిగూడెం పట్టణంలో 47.69, కడకట్లలో 60.15, తాడేపల్లిలో 54.57 ఎకరాలు (మొత్తం 467.98 ఎకరాలు) పెంటపాడు మండలం : ప్రత్తిపాడులో 102.28, దర్శిపర్రులో 50.32 ఎకరాలు (మొత్తం 152.60 ఎకరాలు) ఉంగుటూరు మండలం : బాదంపూడిలో 88.40, వెల్లమిల్లిలో 32.23, ఉంగుటూరులో 129.06, చేబ్రోలులో 38.52, చేబ్రోలు ఖండ్రికలో 35.61, కైకరంలో 79.49 ఎకరాలు (మొత్తం 403.31 ఎకరాలు) భీమడోలు మండలం : కొండ్రుపాడులో 50.16, పూళ్లలో 55.11, అంబర్‌పేటలో 44.58, భీమడోలులో 192.16, సూరప్పగూడెంలో 63.13, గుండుగొలనులో 43.34 ఎకరాలు (మొత్తం 448.47 ఎకరాలు) దెందులూరు మండలం : సింగవరంలో 95.86, కొమిరిపల్లిలో 4.04, పోతునూరులో 40.10, కొవ్వలిలో 4.52, దెందులూరులో 204.67 ఎకరాలు (మొత్తం 349.19 ఎకరాలు) ఏలూరు మండలం : మల్కాపురంలో 115.09, కొమడవోలులో 34.96 ఎకరాలు (మొత్తం 150.15 ఎకరాలు)