water bubble
-
గాలిబుడగ జీవితం.. బతుకు నిత్య పోరాటం!
కర్నూలు: చంకలో చిన్న పిల్లలు..చేతిలో నీటి బుడగల గన్స్.. ఒకవైపు పిల్లలను ఆడిస్తూ, ఓదారుస్తున్నారు. ఇదే సమయంలో చిరు వ్యాపారం చేస్తూ ఆత్మాభిమానం చాటుతున్నారు. రోజూ నగరంలో ఎంతో మంది అన్ని అవయవాలు బాగున్నా రోడ్లలో బిచ్చమెత్తుకుంటున్న దృశ్యాలు కోకొల్లలు. ఎలాగోలా బతికేస్తున్నామని కాకుండా, ఎంతోకొంత కష్టపడి సంపాదించిన సొమ్ముతో గంజినీళ్లు తాగినా ఆత్మసంతృప్తి ఉంటుందనేందుకు వీళ్లే ఉదాహరణ. రాజస్థాన్వాసులు కిలోమీటర్ల దూరం ప్రయాణించి నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాటర్ బబుల్ గన్స్ విక్రయిస్తున్నారు. పెద్ద దుకాణాల్లో జీఎస్టీలు చెల్లించి, నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తున్న వాళ్లలో సగం మందైనా ఇలాంటి వాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పిల్లలు సింహాన్ని భయపెట్టి పరుగెత్తించారు
-
పిల్లలు సింహాన్ని భయపెట్టి పరుగెత్తించారు
లండన్: ఒక విషయం గురించి తెలియనప్పుడు భయపడుతుంటాం. ఈ భయం జంతువులకు కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అందుకే జన సంచారంలో ఉండే జంతువులుతప్ప మిగితావి తమ ఆత్మరక్షణకోసం వెనుకాముందు చూడకుండా ప్రతిఘటించేందుకే ప్రయత్నిస్తుంటాయి. ఈ కోవలో సింహం మినహాయింపు కాదు. తొలుత కాస్తంత ఆగినట్లు కనిపించినా ఆ వెంటనే తన పంజా పవర్ ఏమిటో చూపిస్తుంది. కానీ, చిన్నపిల్లలు ఓ సింహాన్ని తోకముడిచేలా చేశారు. భయంతో పారిపోయేలా బెదిరించారు. అది కూడా ఓ నీటి బుడగతో. అదెలా అని అనుకుంటున్నారు. బ్రిటన్లోని పారాడైజ్ వైల్డ్ లైఫ్ పార్క్లో మోటో అనే ఒక తెల్ల సింహం ఉంది. దానిని చూస్తేనే ఒళ్లు గగుర్లు పొడుస్తుంది. అలాంటి సింహాన్ని చూసేందుకు వచ్చిన పిల్లలు ఆడుకుంటూ ఓ నీటి బుడగను వదిలారు. అది కాస్త సింహం ఉన్న బోనులోకి మెల్లగా జారిపడుతుండగా దానిని ఎంతో దగ్గరిగా ఆసక్తిగా చూసిన సింహం అది కిందపడి టప్మనే శబ్ధంతో పగిలిపోగానే భయంతో తోకముడిచింది. వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలి తన గుహలోకి పారిపోయింది. దీనిని చూస్తున్నవారంతా మృగరాజుకు కూడా ఎంత భయం అనుకుంటూ పడిపడి నవ్వుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో తెగ హల్చల్ చేస్తోంది.