breaking news
wall paper tv
-
ఫ్లోర్‌కూ వాల్ పేపర్..!
పువ్వులు, లతలు, బీచ్ తీరాలు, కొలనులు వంటి ఆకర్షణీయమైన ప్రకృతి హంగులన్నీ మన కాలి కింద కొలువుదీరితే, చూడటానికి ఎంత అందంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. త్రీడీ ఫ్లోర్ వాల్‌పేపర్ ఆ హంగులన్నీ మన గదుల్లోకి తీసుకు వస్తుంది. గది వైశాల్యం, రంగు, డిజైన్‌కు తగిన వాటిని ఎంచుకోవడంలో శ్రద్ధ పెడితే చాలు. ప్రకృతి దృశ్యాలన్నీ మన కళ్ల ముందే నిలిచి ఉంటాయి.గది థీమ్‌ను మార్చేసేలా..సముద్ర తీరాలు, స్కై లైన్ వంటివి గది థీమ్‌నే మార్చేస్తాయి. ఆధునిక లివింగ్ రూమ్ కోసం రేఖాగణిత నమూనాలను ఎంచుకోవచ్చు. పెద్ద, బోల్డ్ డిజైన్లు విశాలమైన గదులకు, చిన్న డిజైన్లు తక్కువ స్థలం ఉన్న చోటుకు బాగా సరిపోతాయి.రంగు.. స్థలంఫర్నిచర్, గది గోడల రంగులను ఎలివేట్ చేసేలా ఫ్లోర్ డిజైన్ వాల్ పేపర్ల ఎంపిక ఉండాలి. గోడల రంగు ప్లెయిన్‌గా, లైట్ కలర్లో ఉండే ఫ్లోర్ డిజైన్ బోల్డ్ డిజైన్స్ ఎంపిక చేసుకోవచ్చు. గోడల రంగు గాఢత ఎక్కువ ఉంటే సాదా సీదా ఫ్లోర్ డిజైన్స్‌ను ఎంచుకోవచ్చు. ఫ్లోర్ వాల్ పేపర్స్ కొనుగోలుకు ముందు మీ గదుల వాస్తవ స్థలం ఎంత ఉందో చూసుకోవాలి. ఆ డిజైన్స్ ఎంత కాలం వరకు ఉంటే బాగుంటుందో ముందే నిర్ణయించుకొని, దాన్నిబట్టి ఎంపిక చేసుకోవడం మంచిది. ప్రయోజనాలుత్రీడీ ఫ్లోర్ వాల్పేపర్లు ప్రత్యేకమైన, అద్భుతమైన దృశ్య అనుభవాన్ని సృష్టిస్తాయి.త్రీడీ ఫ్లోర్ వాల్‌పేపర్ మన్నిక ఎక్కువ. దీర్ఘకాలం ఉంటుంది.చాలా త్రీడీ వాల్పేపర్లను శుభ్రం చేయడం సులభం. తడి క్లాత్‌తో తుడవడం చాలా సులువు. ఎప్పుడూ తాజాగా కనిపిస్తుంది. .ఇన్స్టాలేషన్ సులువు. నచ్చకపోతే తొలగించి, మరొక వాల్పేపర్ని అతికించవచ్చు. డిజైన్ల ఎంపిక కోసం, ఎలాంటి లోపాలు లేని త్రీడీ వాల్ పేపర్‌ను నిపుణుల సాయంతో ఎంపిక చేసుకోవడం తెలివైన ఎంపిక. గది వైశాల్యాన్ని బట్టి త్రీడీ వాల్ పేపర్ల ధరలు ఉంటాయి. (చదవండి: రోబో కుందేళ్ల పాముల వేట!) -
అతికించేద్దాం.. చూసేద్దాం..
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి గోడకు ఏదో పేపర్ అతికిస్తోంది అనుకుంటున్నారా? కాదు ఈ అమ్మడు అతికిస్తున్నది టీవీని! టీవీ ఏంటి గోడకు అతికించడమేంటి అనేగా మీ సందేహం! ఈ టీవీ పేరు ‘వాల్‌పేపర్ టీవీ'. ఈ సరికొత్త టీవీని తయారుచేసిన ఎల్జీ కంపెనీ కొరియాలో ప్రదర్శించింది. 55 అంగుళాలుండే ఈ ఓఎల్ఈడీ టీవీ కేవలం ఒక్క మిల్లీమీటర్ కన్నా తక్కువ మందం, 1.9 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. దీన్ని అయస్కాంతం సహాయంతో గోడకు అతికించుకోవచ్చు. అంతేకాదు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేసి పేపర్లా మడిచి భద్రపరుచుకోవచ్చు కూడా. వీటి తయారీలో పాలీఇమైడ్ ఫిల్మ్‌లను ఉపయోగించడం వల్ల టీవీని వంచవచ్చు.