breaking news
vakati narayanareddy
-
నెల్లూరులో వాకాటి గెలుపు
నెల్లూరు : నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్‌పై 87 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం 851 ఓట్లు పోలవగా... టీడీపీ అభ్యర్ధికి 462, వైఎస్సార్సీపీ అభ్యర్ధికి 378 ఓట్లు వచ్చాయి. ఇందులో రెండు ఓట్లు చెల్లనివి కాగా...మరో 10 ఓట్లు తేలలేదు. కాగా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆధిక్యం ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థిని నిలబెట్టింది. అధికారంతో పాటు ప్రలోభాల పర్వానికి తెర తీసి ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. మంత్రి నారాయణ అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్హాజరై... వాకటి గెలుపుకు దగ్గర ఉండి చక్రం తిప్పారు. -
కాంగ్రెస్ జాబితా ఖరారు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆదివారం రాత్రి ప్రకటించారు. జిల్లాలోని యర్రగొండపాలెం మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒంగోలు, బాపట్ల, నెల్లూరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఒంగోలు లోక్‌సభ స్థానాన్ని దర్శి పవన్‌కుమార్‌కు, బాపట్లను పనబాక లక్ష్మికి, నెల్లూరును వాకాటి నారాయణరెడ్డికి కేటాయించారు. అసెంబ్లీ అభ్యర్థులు వీరే... ఒంగోలుకు ఎద్దు శశికాంత్‌భూషణ్, సంతనూతలపాడుకు నూతలపాటి తిరుమలరావు, కొండపికి గుర్రాల రాజ్‌విమల్, కందుకూరుకు రాచగొర్ల వెంకట్రావు యాదవ్, కనిగిరికి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మార్కాపురానికి ఏలూరి రామచంద్రారెడ్డి, గిద్దలూరుకు కందుల గౌతంరెడ్డి, దర్శికి కే జ్వాలారావు, అద్దంకికి గాలం లక్ష్మీయాదవ్, పర్చూరుకు మోదుగుల కృష్ణారెడ్డి, చీరాలకు మెండు నిషాంత్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు.