breaking news
Union Health Minister JP nadda
-
‘తల్లిపాల’కు అంబాసిడర్‌గా మాధురీ
న్యూఢిల్లీ: తల్లిపాల ఆవశ్యకతను తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మా (ఎంఏఏ-మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్) కార్యక్రమాన్ని సినీనటి మాధురీ దీక్షిత్, కేంద్ర వైద్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ప్రారంభించారు. యునిసెఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మా’ కార్యక్రమానికి మాధురీ దీక్షిత్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ‘తల్లిపాలు పిల్లలకు చాలా ముఖ్యం. ఓ తల్లిగా ఈ ప్రచారంలో పాల్గొనటం ఆనందంగా ఉంది’ అని మాధురీ తెలిపారు. -
చికిత్సకు ముందే 40 వేలు కట్టాలన్నారు
యశోద ఆసుపత్రిపై ఎంపీ ఎం.ఎ.ఖాన్ ఫిర్యాదు సాక్షి, న్యూఢిల్లీ: డయేరియాతో బాధపడుతున్న తన భార్యను యశోద ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స ప్రారంభించకుండానే రూ.40 వేలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేసినట్లు రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు, రాజ్యసభ చైర్మన్‌కు, పిటిషన్ల కమిటీకి ఫిర్యాదు చేశారు. గత నెల 18న మలక్‌పేటలోని యశోదకి తన భార్య ఉన్నీసా బేగంను చికిత్స కోసం తీసుకె ళ్లానని, చికిత్సకు ముందే రూ.40 వేలు డిపాజిట్ చేయాలంటూ పట్టుపట్టారని పేర్కొన్నారు. ‘‘ఆ రోజు ఉదయం ఢిల్లీలో విరేచనాలకు మందులు తీసుకున్న లతీఫ్ ఉన్నీసాతో సహా అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నాం. సాయంత్రం కూడా తగ్గకపోవడంతో ఆసుపత్రికి వెళ్లాం. అప్పటికి వారం క్రితమే చేయించుకున్న అన్ని వైద్య పరీక్షలనూ చూపించాం. బాగా నీరసించినందున ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించాలని కోరాం. డిపాజిట్‌గా రూ.40 వేలు చెల్లించాలన్నారు. నేను రాజ్యసభ సభ్యుడినని, నాకు, నా భార్యకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) కార్డు కూడా ఉందన్నా వినలేదు. కొంత నగదు చెల్లించాకే వారు వైద్యం ప్రారంభించారు. మొత్తానికి కనీసం ఒకరోజు కూడా పూర్తి కాకుండానే రూ.25,016 బిల్లును చెల్లించాక డిశ్చార్జి చేశారు. ఎంపీకే ఈ పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈ ఆసుపత్రిపై కఠిన చర్య తీసుకోవాలి’’ అని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.