breaking news
under 15
-
అదిరిపోయే ఫీచర్లున్న ఈ స్మార్ట్ఫోన్ల ధర రూ.15,000 లోపే..
భారత్‌లో రూ. 15,000 లోపు లభించే స్మార్ట్ ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. సామాన్యులకు అందుబాటు ధర కావడంతో చాలా మంది ఈ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా రూ. 15,000 లోపు ధరకు ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. మెరుగైన కెమెరాలు, వేగవంతమైన ప్రాసెసర్లు, మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అలాంటి కొన్ని ఫోన్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.. ఇదీ చదవండి: కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు! రియల్మీ 10 ధర: Rs.13,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G99 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.4 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యుయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ 9i ధర: రూ. 13,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 680 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh షావోమీ రెడ్మీ 11 Prime 5G ధర: రూ. 13,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఐక్యూ Z6 Lite 5G ధర: రూ. 13,793 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ నార్జో 50 ధర: రూ. 12,580 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G96 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ 9i 5G ధర: రూ. 14,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh వివో T1 44W ధర:రూ. 14,408 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 680 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.44 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh మోటో G40 ఫ్యూజన్ ధర: రూ. 13,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 732G ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.8 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ 6000 mAh షావోమీ రెడ్మీ 10 Prime ధర: రూ. 11,180 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G88 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.5 అంగుళాలు కెమెరా: 50 + 8 + 2 + 2 MP క్వాడ్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 6000 mAh మోటో G51 5G ధర: రూ. 14,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.8 అంగుళాలు కెమెరా: 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ 5000 mAh శాంసంగ్ గెలాక్సీ F41 128GB ధర: రూ. 14,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, Samsung Exynos 9 Octa 9611 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.4 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 5 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 32 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 6000 mAh శాంసంగ్ గెలాక్సీ F23 5G ధర: రూ. 14,640 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 750G ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh షావోమీ రెడ్మీ Note 11 SE ధర: రూ. 11,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G95 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.43 అంగుళాలు కెమెరా: 64 + 8 + 2 + 2 MP క్వాడ్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh లిటిల్ M4 ప్రో ధర: రూ. 12,990 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G96 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.43 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఐక్యూ Z6 5G ధర: రూ. 13,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 695 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh -
‘ఆసియా’ ఫైనల్లో తస్నిమ్, తార
సురబాయ (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల అండర్–15 సింగి ల్స్ విభాగంలో భారత్‌కు టైటిల్ లభించడం ఖాయమైంది. ఈ విభాగంలో ఫైనల్ చేరిన ఇద్దరు క్రీడాకారిణులు తస్నిమ్ మీర్, తారా షా భారత్‌కే చెందిన వారు కావడం విశేషం. శనివారం జరిగిన అండర్–15 బాలికల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో తస్నిమ్ 21–16, 21–11తో సోరా ఇషియోకా (జపాన్)పై... తారా షా 21–18, 21–14తో కజునె ఇవాటో (జపాన్)పై విజయం సాధించారు. చరిత్రకు విజయం దూరంలో... గ్వాంగ్జౌ (చైనా): మరో విజయం సాధిస్తే జపాన్ స్టార్ కెంటో మొమోటా... బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మొమోటా టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మొమోటా 21–17, 21–12తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలిచాడు. మరో సెమీఫైనల్లో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా) 21–15, 21–15తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో జిన్‌టింగ్‌తో మొమోటా తలపడతాడు. -
చెస్ విజేతలు ఆశిష్, సాహిత్య
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన హైదరాబాద్ జిల్లా అండర్-15 బాలబాలికల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆశిష్ రెడ్డి, సాహిత్య విజేతలుగా నిలిచారు. దోమలగూడలోని ఏవీ కాలేజిలో హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగారుు. అలాగే బాలుర విభాగంలో ఆర్ఎస్ ఆర్మోల్ రెండో స్థానంలో, తరుణ్, అఖిల్ కుమార్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో సారుుప్రియ, జి.చందన రెండు, మూడు స్థానాలు సాధించారు.