breaking news
Ukraine PM
-
‘నాకేంటి! కరోనా ఏంటి!!’
కరోనా ప్రముఖులకే ఎక్కువగా వస్తోందా? ప్రముఖులకే ఎక్కువగా టెస్టులు జరుగుతుండ బట్టి వారికి కరోనా వచ్చినట్లు బయటపడుతోందా? ఏమైనా కట్టుదిట్టంగా, కాస్త దూరంగా మసలే అవకాశం ఉన్న దేశాధ్యక్షులు, దేశ ప్రధానులకు కూడా కరోనా వచ్చిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒలేనా జెలెన్స్కా కూడా ఇలాగే ఆశ్చర్యపోతున్నారు. ‘నాకేంటి! కరోనా ఏంటి!!’ అని ఆమె ఆశ్చర్యం. ఒలేనా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలోదిమిర్ జెలెన్స్కీ సతీమణి. ‘‘అస్సలు ఊహించలేదు. నేను, నా కుటుంబం ఎంత జాగ్రత్తగా ఉన్నాం! మాస్కులు పెట్టుకున్నాం. గ్లవుజులు వేసుకున్నాం. దూరం పాటించాం. అయినా నాకు కరోనా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు‘‘ అని ఫేస్బుక్ లో రాసుకున్నారు ఒలేనా. ఇప్పుడు ఆమె సంతోషం ఒక్కటే.. భర్తకు, పిల్లలకు కరోనా టెస్ట్‌లో నెగటివ్ అని వచ్చింది. -
ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా
కీవ్: ఉక్రెయిన్ ప్రధాని అర్సెనీ యట్సెనుక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్‌లో రాజకీయ అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఈ ప్రకటన చేశారు. మంగళవారం పార్లమెంట్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని తెలిపారు. యట్సెనుక్ ప్రభుత్వంపై ఇటీవల తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. గత ఫిబ్రవరిలోనే పదవి నుంచి వైదొలగాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో ఆయనకు సూచించారు.