breaking news
tung
-
మొన్ననే పెళ్లి, తగాదా..నాలుక కొరికేసింది, తీవ్ర ఘర్షణ!
సంతోషంగా ‘‘నాకు నువ్వు, నీకు నేను’’ అన్నట్టుగా చాలా సరదాగా గడిపే జంటను చూస్తే నవ దంపతుల్లా ఎంత హాయిగా ఉన్నారు అనుకుంటాం. కదా. కానీ పెళ్లయ్యి ఏడాది కూడా అవ్వకుండా దంపతుల మధ్య వంట విషయంలో వచ్చిన స్వల్ప వివాదం, మాటల యుద్ధంగా, ఆ తరువాత తీవ్ర ఘర్షణగా మారిన ఘటన భర్త ఆస్పత్రి పాలైన ఘటన దిగ్భ్రాంతి రేపింది. విషయం ఏమిటంటే..గత ఏడాది మే 6న విపిన్, ఇషా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సోమవారం సాయంత్రం వంట విషయంలో చిన్న తగాదా మొదలయ్యింది. మాటా మాటా పెరిగి చినికి చినికి గాలివానలా మంగళవారం తెల్లవారిందాకా సాగింది. అది కాస్తా భౌతికరూపం దాల్చింది. తీవ్ర ఆగ్రహంతో భర్త నాలుకను కొరికిపారేసింది. దీని తాలూకు పరిణామాలు మరో ఘర్షణకు దారితీశాయి. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఇషా కుటుంబ సభ్యులు ఆమె అత్తమామల ఇంటికి వెళ్లారు. దీంతో రెండు కుటుంబాల మధ్య మరో పోరుకు తెరలేపింది. ఆడా, మగా ఇరు వర్గాలూ గొడవకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జోక్యంచేసుకుని, సంబంధిత వ్యక్తులందరినీ విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకెళ్లారు.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మోదినగర్లోని, సంజయ్ పూరిలో జరిగింది.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మోదినగర్) అమిత్ సక్సేనా అందించిన సమాచారం ప్రకారం ఈ గొడవ, హింసకు మూలం భార్యభర్తల కలహమే అని తేలింది. భార్య ఆగ్రహం భర్తవిపిన్ను ఆస్పత్రి పాలు చేసింది. అతనికి తీవ్ర గాయాలయ్యాయని, తొలుత ఘజియాబాద్‌లోని ఒ ఆసుపత్రిలో చేర్పించి, తదుపరి చికిత్స కోసం మీరట్‌లోని ఒక ప్రత్యేక హాస్పిటల్‌కు తరలించారు. వీరి వైవాహిక జీవితంలో కలహాలకు దారితీసిన అంతర్లీన కారణాల గురించి ఆరా తీస్తున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఊరగలసి మనుము... ఊని పనుల గనుము...
మన చుట్టుపక్కల ఉండేవారితో కలసి మెలసి ఉండాలి... మనంతట మనమే పూనుకుని పనులు చేయాలి... అని అర్థం. మనిషి సంఘజీవి. ఎప్పుడో ఒకప్పుడు సాటి మనిషితో అవసరం ఏర్పడుతుంది. అందువల్ల మన చుట్టుపక్కల వారితో విరోధం పెట్టుకోకుండా, కలసిమెలసి ఉండాలి. అలాగే ఏదైనా పని చేయవలసి వస్తే, ఎవరో వచ్చి చెప్పాలనుకోకుండా, మనంతటగా మనం పూనుకుని పని ప్రారంభించి పూర్తి చేయాలి. కట్టులేని నోరు... కట్ట తెగిన ఏరు... నోటికి వచ్చినట్లు అడ్డు అదుపు లేకుండా మాట్లాడ కూడదు... అలా మాట్లాడితే అది కట్ట తెగిన ఏరుతో సమానం అని అర్థం. ఆచితూచి మాట్లాడటం వలన మంచి జరుగుతుంది. అలాకాక నోటికి వచ్చినట్లు పరుషంగా, గర్వంగా మాట్లాడితే అనర్థాలు చోటుచేసుకుంటాయి. అందువల్ల నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఏరుకి కట్ట ఉన్నంత వరకు ఆ నీరు నిశ్చలంగా ప్రవహిస్తుంది. ఒకవేళ కట్ట తెగితే... గ్రామాన్నంతటినీ ముంచివేస్తుంది.


