breaking news
Transco CMD raghuma Reddy
-
ట్రాన్స్‌కో సీఎండీని కలిసిన బీజేపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధిక విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ బీజేపీ నేతలు ట్రాన్స్ కో సీఎండీ రఘమా రెడ్డిని బుధవారం కలిశారు. వీరిలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు. సీఎండీని కలిసిన అనంతరం మోత్కుపల్లి మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా ప్రజలెవ్వరూ మూడు నెలలుగా బయటకు రాలేదన్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు వేల రూపాయల కరెంట్ బిల్లులు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని కోరారు. కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ మొదట్లో ఒక మాట ఇప్పడు ఒక మాట మాట్లాడుతున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. కరోనా రోగులందరికి ప్రభుత్వమే చికిత్సనందించాలని డిమాండ్ చేశారు. (‘కోవిడ్’ కేసుల్లో చార్జ్‌షీట్స్! ) అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ, రావాల్సిన కరెంట్ బిల్లులకంటే రెండు రెట్లు అధికంగా కరెంట్ బిల్లు వచ్చిందన్నారు. కరెంట్ బిల్లులను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సముచితం కాదన్నారు. దీని గురించి ట్రాన్స్‌కో సీఎండీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. (వాహనాలను ఆ మార్గంలో అనుమతించడం లేదు) -
జీతాలు పెరిగాయ్...అవినీతిని తగ్గించండి
ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచింది. పీఆర్సీ 43 శాతం పెంపుతో ఉద్యోగుల జీతాలు రెట్టింపయ్యా యి. గతంలో కంటే మెరుగ్గా ఉద్యోగుల ఆదా యం పెరిగింది. విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అవినీతిని వదిలిపెట్టి బాధ్యత ఎరిగి పనిచేయండి అని ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి ఉద్బోధించారు. విద్యుత్ శాఖ నెల వారీ సమీక్షలో భాగంగా శుక్రవారం నల్లగొం డలోని విద్యుత్ శాఖ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశానికి ట్రాన్స్‌కో డైరక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భ ంగా సీఎండీ మాట్లాడుతూ...శాఖా పరం గా చోటుచేసుకుంటున్న అవినీతిని తగ్గించాలని ఆదేశించారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో రైతులకు ఇబ్బంది కలగకుండా అం దుబాటులో సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. మరమ్మతులకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్లను 24 గంటల్లో రిపేరు చేసి పంపాలని తెలిపారు. రబీలో చాలా చోట్ల పంటలు సాగుచేశారు కాబట్టి పంటలకు నష్టం కలగకుండా విద్యుత్ సరఫరాలో తగు జాగ్రత్తలు పాటించలన్నారు. వేసవి పరిస్థితి గురించి రై తులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కలి గించాలన్నారు. మున్సిపాలిటీల్లో విద్ద్యుద్ధీకరణ పను లు వేగవంతం చేయాలని, బిల్లుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ వసూళ్లు మరింత పెంచాలని సీఎండీ ఆదేశించారు. స్టోర్స్ అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని, స్థానిక పోలీసుల సహకారంతో కేసు విచారణ చేపట్టాలన్నారు. సమావేశంలో ట్రాన్స్ కో ఎస్ఈ బాలస్వామి, డైరక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, విజిలెన్స్ డీఎస్పీ రామచంద్రుడు పాల్గొన్నారు.