tomato crop
-
భారీగా పతనమైన టమోటా ధర..
-
టీడీపీ నేతల దౌర్జన్యం.. కుటుంబమంతా రాత్రి అడవిలోనే..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకానికి భయపడి ఓ కుటుంబం రాత్రంతా అడవిలో తలదాచుకుంది. రాత్రివేళలో క్రూర మృగాలు, పాములు, ఇతర విష పురుగుల మధ్య అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ప్రజాస్వామ్య దేశ చరిత్రలో ఇంతటి అరాచకం ఎప్పుడైనా కన్నామా? విన్నామా?.. కానీ ఇది పచ్చి నిజం. సోమల మండలం కమ్మపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం దీనగాథ ఇది. శుక్రవారం టీడీపీ గూండాలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటిపై దాడి చేశారు. సుబ్రమణ్యంరెడ్డిని బయటకు ఈడ్చుకు వచ్చి తీవ్రంగా కొట్టారు. రకరకాలుగా హింసించారు. ఆయన ఇటుకల బట్టీలోని ఇటుకలన్నింటినీ తరలించుకుపోయారు. బట్టీ మొత్తాన్ని ధ్వంసం చేశారు. సుబ్రమణ్యంరెడ్డి పొలంలో పండించిన టమాటా కోతకొచ్చింది. ఈ పంటను మార్కెట్‌కు తరలించకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయన పశువులకు గడ్డి కూడా వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు తెలిపినా స్పందన లేకపోవడంతో సుబ్రమణ్యం రెడ్డి కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సమీపంలోని అడవిలోకి పారిపోయింది. శుక్రవారం రాత్రంతా అడవిలోనే గడిపింది. శనివారం కొందరు వ్యక్తులు వారి వద్దకు వెళ్లి ఆ కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి వేరే ప్రాంతంలో ఉంచారు. ఆయన తమను శరణుకోరి.. టీడీపీలో చేరితే క్షమించి వదిలేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. లేదంటే విడిచిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. టీడీపీ నేతల తీరుపై పుంగనూరు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో ఎవరికి నచ్చిన పార్టీలో వారు పనిచేసే వారని, ఇటువంటి అరాచకం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిత్తూరు జిల్లావ్యాప్తంగా దాడులుటీడీపీ నేతలు వారిపై కేసులు రాకుండా బెంగళూరు నుంచి గూండాలను తెచ్చి దాడులు చేయిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలో ఎవరెవరు వైఎస్సార్సీపీకి పనిచేశారో గుర్తించి మరీ దాడులు చేయిస్తున్నారు. కొద్ది రోజులుగా టీడీపీ నేతలు, వారి గూండాల దౌర్జన్యాలు, దాడులతో చిత్తూరు జిల్లా అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పుంగనూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు ఊర్లొదిలి వేరే ప్రాంతాల్లో తలదాచుకొంటున్నారు. ఇప్పటివరకు 55 కుటుంబాలు స్వగ్రామాలను వీడి వెళ్లాయి. శ్రీకాళహస్తి రూరల్ మండలం ఈశ్వరయ్యకాలనీ, వాగివేడు, నారాయణపురం గ్రామాల నుంచి 75 కుటుంబాలను టీడీపీ నేతలు వెళ్లగొట్టారు. వీరంతా తమను శరణు కోరి, టీడీపీలో చేరితేనే వారిని, వారి ఆస్తులను వదిలేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.రక్షణ కోరినా స్పందించని పోలీసులుటీడీపీ కూటమి దాడులు, దౌర్జన్యాలపై అనేకమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు పోలీసులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన సమయంలో ఇరువురి మధ్య సంభాషణలను బాధితులు రికార్డు చేసుకున్నారు. ఆ రికార్డులను వింటే.. రక్షణ కల్పించాల్సిన పోలీసులేనా అలా మాట్లాడేది అనిపించకమానదు. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల దౌర్జన్యాలు, దాడులు ఆగకపోవడం, పోలీసులు స్పందించకపోవడంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు. -
టమాటా సాగుతో కోటీశ్వరులు.. 45 రోజుల్లో రూ. 3 కోట్ల ఆదాయం
గతంలో ఎన్నడూ లేనంతగా టమాటా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. గత నెల రోజులుగా కొండెక్కి కూర్చున్న టమాటాధరలు.. ఎంతకీ దిగిరావడం లేదు. పోనూ పోనూ ఇంకా ప్రియంగా మారుతూ.. సామాన్యుడికి భారంగా మారింది. ప్రస్తుతం కేజీ టమాటా ధర రూ.200 చేరి కొత్త రికార్డులు సృష్టిస్తుంది. అయితే పెరిగిన టమాటా ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతుంటే.. వీటిని పండించిన రైతుల ఇంట మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కనివినీ ఎరగని రీతిలో కొంతమంది రైతులు ధనవంతులు అవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రైతు కుటుంబం టమాటా పంటతో జాక్‌పాట్ కొట్టింది. 22 ఎకరాల్లో టమాటాసాగు చేసి.. 45 రోజుల్లో ఏకంగా మూడుకోట్లు సంపాదించారు. భూదేవిని నమ్ముకున్న రైతులు ఏ రోజుకైనా రాజులవుతారని నిరూపించారు రైతులు చంద్రమౌళి, మురళి. చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమందకు చెందిన రైతు కుటుంబంలోని అన్నదమ్ములు చంద్రమౌళి, అతని తమ్ముడు మురళి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. స్వగ్రామమైన కరకమంద సమీపంలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపు వారి పల్లెలో 10 ఎకరాల పొలంలో 23 సంవత్సరాలుగా టమాటను సాగు చేస్తున్నారు. చదవండి: టమాటా లారీ బోల్తా..! క్షణాల్లోనే ఊడ్చుకెళ్లారు..!! 22 ఎకరాల్లో టమాటా సాగు తన వంగడాలు, మార్కెట్ స్థితిగతుల గురించి బాగా అవగాహన పెంచుకున్న చంద్రమౌళి.. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సంవత్సరం అరుదైన సాహు రకానికి చెందిన టమాటా మొక్కలను 22 ఎకరాలలో సాగు చేశారు. త్వరగా దిగుబడి పొందడానికి మల్చింగ్, మైక్రో ఇరిగేషన్ పద్ధతుల వంటి అధునాతన పద్ధతులను అనుసారించాడు. దాదాపుగా 70 లక్షల వరకు పంటపై ఖర్చు చేయగా.. జూన్ చివరి వారంలో దిగుబడి ప్రారంభమైంది. రూ. 4 కోట్ల ఆదాయం.. ఖర్చులు పోనూ! ఈ పంటను తమ ప్రాంతానికి దగ్గరల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రం కోలార్ మార్కెట్లో విక్రయించారు. అక్కడ 15 కేజీల బాక్స్ ధర వెయ్యి రూపాయల నుంచి 1500 మధ్య పలికింది. గత 45 రోజుల్లో సుమారుగా 40 వేల పెట్టెలు విక్రయించాడు. తనకొచ్చిన లాభంపై రైతు చంద్రమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. తన అనుభవాన్ని పంచుకుంటూ..ఇప్పటి వరకు పండించిన పంట ద్వారా రూ. 4 కోట్ల ఆదాయం వచ్చిందన్నాడు. మొత్తంగా 22 ఎకరాల్లో పంట కోసం అన్నీ ఖర్చులు కలిపి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టగా... రూ. 3 కోట్ల లాభం వచ్చిందని తెలిపారు. రికార్డు స్థాయిలో ధరలు మరోవైపు భారత్‌లోనే అతిపెద్ద టమటా మార్కెట్లలో ఒకటిగా ఉన్న మదనపల్లెలో టమాట ధర విపరీతంగా పెరుగుతోంది. మొదటి గ్రేడ్ టమోటా కిలో ధర శుక్రవారం రూ. 200 రూపాయలు పలికింది. రెండు వారాల క్రితం కిలో టమాటారూ.120 ఉండగా.. 25 కిలోల డబ్బాను రూ.3 వేలకు విక్రయించారు. అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో టమాటకు డిమాండ్ పెరగడంతో కిలో ధర రూ.200కి చేరింది. ఆగస్టు నెలాఖరు వరకు టమాటా ధరలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. చదవండి: సముద్రంలో పడవ బోల్తా.. రుషికొండ బీచ్‌లో తప్పిన ప్రమాదం -
కొండెక్కిన ధరలు.. తోట నుంచి రూ. 2.5 లక్షల టమాట చోరీ
మార్కెట్లో కూరగాయాల ధరలు ప్రజలను ఠారేత్తిస్తున్నాయి. ఏకంగా సామాన్యులు కొనలేని స్థాయికి ఎగబాకాయి ధరలు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాట రూ.120 పైనే పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరలు ఇంకా ఎక్కువే ఉన్నాయి. అడ్డగోలు ధరలతో టమాట దొంగతనాలకు పాల్పడుతున్నారు దుండగులు. మార్కెట్లో, దుకాణాల్లో నిల్వ చేసిన వాటితోపాటు ఏకంగా తోటలో నుంచి సైతం టమాటలను సైతం చోరీ అవుతున్నాయి. టమాటా తోటకు ఓ రైతు ఏకంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. ఓ రైతు చేనులో నుంచి రూ. 2.5 లక్షల విలువైన టమాలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ ఘటన హసన్ జిల్లాలోని సోమనహళ్లి గ్రామం మంగళవారం జరిగింది. చదవండి: 12 పెళ్లిచూపులు..కట్నం ఇవ్వనందుకు సంబంధం క్యాన్సిల్ అప్పు తీసుకొని మరీ తనకున్న రెండు ఎకరాల భూమిలో టమాట పంట సాగు చేస్తున్నట్లు మహిళా రైతు ధరణి తెలిపింది. ప్రస్తుతం టమాట ధర బెంగుళూరులో కిలో రూ.120 పలుకుతుండటంతో టమాట పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని అనుకున్నట్లు చెప్పింది. కానీ మంగళవారం రాత్రే టమాట తోటలో దొంగలు పడ్డారని, 50-60 బ్యాగుల టమాటాను దొంగిలించారని వాపోయింది. ఈ టమాటా విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక మిగిలిన పంటనుకూడా దొంగలు ధ్వంసం చేశారని ఆమె పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హలబీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. Karnataka | Farmer alleges tomatoes worth Rs 2.5 lakhs were stolen from her farm in the Hassan district on the night of July 4. A woman farmer, Dharani who grew tomatoes on 2 acres of land said that they were planning to cut the crop and transport it to market as the price… pic.twitter.com/fTxcZIlcTr — ANI (@ANI) July 6, 2023 కాగా గడిచిన నెలలో ఎండల తీవ్రతోపాటు అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో టమాట దిగుబడి తగ్గిపోయింది పోయింది. ఇతరప్రాంతాల నుంచి రవాణా తగ్గిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరలు ఎగబాకుతుండటంతో రైతులకు గిట్టుబాటు అవుతుండగా.. వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో టమాట ధర 129 రూపాయలు ఉండగా ఉత్తరప్రదేశ్‌లోని మోరదాబాద్‌లో రూ. 150కు చేరింది. పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీకి అందించాలని కోరుతున్నారు. -
టమాట ధర పైపైకి
మదనపల్లె : వేసవిలో ఎండలు పెరుగుతున్నట్లుగా మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు మెల్లమెల్లగా పైకి ఎగబాకుతున్నాయి. ఎండ దెబ్బకు కూరగాయల పంటలు వాడిపోవడంతో పాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా టమాటా పంటపై ఎండ తీవ్ర ప్రభావం చూపుతుండటంతో డిమాండ్‌కు సరిపడా సరుకు లభ్యత లేకపోవడంతో మెల్లమెల్లగా ధరలు పెరుగుతున్నాయి. వారంరోజుల క్రితం మొదటిరకం టమాటా కిలో రూ.30 ఉంటే గురువారం ఏకంగా రూ.44కు చేరుకుంది. నెలరోజుల క్రితం పరిస్థితిని పరిశీలిస్తే మార్చి 28న మొదటిరకం కిలో టమాటా రూ.9.20 ఉంది. ఈ లెక్కన వారంరోజుల వ్యవధిలో కిలోకు రూ.14, నెలరోజుల వ్యవధిలో రూ.35 పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో టమాటాకు పెట్టుబడి ఖర్చులు అధికం కావడం, ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్ష వరకు ఖర్చుచేయాల్సి రావడం, ఆశించిన స్థాయిలో «మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు సాగుపై ఆసక్తి కనబరచలేదు. మార్చి రెండోవారం నుంచి మార్కెట్లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఆశలు చిగురించిన రైతులు నర్సరీల నుంచి నారును కొనుగోలు చేసి ఎక్కువ విస్తీర్ణంలో సాగును ఆరంభించారు. పంట చేతికి వచ్చేందుకు 45–50 రోజుల సమయం ఉండటంతో దిగుబడులు పెరిగేందుకు మరో నెలరోజులు పట్టే అవకాశం ఉంది. పెరిగిన ఎండలతో టమాటా దిగుబడులు తగ్గడం.. మరోవైపు పొరుగు జిల్లాల నుంచి టమాటాలు మార్కెట్‌కు రాకపోవడంతో ఒక్కసారిగా మార్కెట్లో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. రెండునెలల పాటు టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
అయ్యో.. రూ.75 వేల టమాటా చెత్త కుప్పల్లో...
సాక్షి,అశ్వాపురం(ఖమ్మం): అశ్వాపురానికి చెందిన ఓరుగంటి భిక్షమయ్య రెండు ఎకరాల్లో టమాటా తోట సాగు చేయగా.. ఇటీవల వర్షాలతో కాయలకు నీటి బుడగలు వచ్చి పూర్తిగా పాడయ్యాయి. దీంతో చేసేదేం లేక మంగళవారం కూలీలను పెట్టి కోయించి 200 బాక్సుల టమాటాలు చెత్త కుప్పలో పారబోయించారు. ఈ టమాటాలు మంచిగా ఉండి మార్కెట్‌కు తరలిస్తే రూ.75 వేల ఆదాయం వచ్చేదని భిక్షమయ్య వెల్లడించారు. రెండు ఎకరాల్లో సాగుకు సుమారు రూ.70 వేల వరకు ఖర్చు చేయగా.. తోటలో కాత మంచిగా ఉన్న సమయాన వర్షాలు కురిసి తీరని నష్టం వచ్చిందని వాపోయాడు. ఇంకా 100 బాక్సుల టమాటాలు పాడైపోయి ఉన్నాయని... సుమారు 100 బాక్సులు మాత్రమే మంచి టమాటా లభించే అవకాశముందని తెలిపాడు. మొత్తంగా రెండు ఎకరాల పేరిట రూ.50 వేల ఆదాయం కూడా అవకాశం లేదని... తనలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భిక్షమయ్య కోరాడు. చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి.. రాబోయే రోజుల్లో నాలుగు వరుసలుగా.. -
టమాటాకు రక్షణ బంతి
తెల్లదోమ టమాటా పంటకు తీవ్రనష్టం కలిగిస్తుంటుంది. ఈ తెల్లదోమ ద్వారా వైరస్లు, మోల్డ్ వంటి తెగుళ్లు టమాటాకు సోకి తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి. అయితే, టొమాటా మొక్కల పక్కన బంతి మొక్కలు పెంచితే చాలు తెల్లదోమ బెడద తీరిపోతుందని పెద్దలు చెబుతుంటారు. బంతి మొక్క ఆకులు, పూల ద్వారా వెలువరించే వాసనలు తెల్లదోమను పారదోలుతుంటాయని కూడా మనకు తెలుసు. ఇంతకీ బంతి చెట్లు వెలువరించే వాసనల్లో ఏ రసాయనం ఉంది? అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. దీనిపై గతంలో పెద్దగా అధ్యయనాలు జరగలేదు. ఇటీవల ఇంగ్లండ్‌లోని న్యూక్యాజిల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ నేచురల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో అధ్యయనం జరిగింది. లిమొనెనె అనే రసాయనాన్ని బంతి మొక్కలు గాలిలోకి వదులుతూ ఉంటాయని, ఈ వాసన తెల్లదోమకు నచ్చక దూరంగా వెళ్లిపోతాయని తేలింది. ఈ వాసన పీల్చిన తెల్లదోమలు చనిపోవు. దీని వల్ల టమాటాల నాణ్యత కూడా ఏ మాత్రం తగ్గడం లేదని గుర్తించారు. రసాయనిక పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఇదే తరహాలో తెల్లదోమను పారదోలే స్ప్రేను తయారు చేయడానికి అవకాశం ఉందా అన్న అంశంపై అధ్యయనానికి సారధ్యం వహించిన డా. కొలిన్ టోష్, నియల్ కాన్బాయ్ దృష్టి సారిస్తున్నారు. బత్తాయి, నారింజ, నిమ్మ పండ్ల తొక్కల్లో కూడా లిమొనెనె పుష్కలంగా ఉంటుందట. ఉద్యాన తోటల్లో బంతి మొక్కలు వేసుకుంటే తేనెటీగలు కూడా వస్తాయి. ఉద్యాన తోటల సాగులో ఒకే రకం పంటను సాగు చేయడానికి బదులు.. కలిసి పెరుగుతూ పరస్పరం చీడపీడల నుంచి రక్షించుకునే రకరకాల పంటలను పక్క పక్కన నాటుకోవడం మేలన్న విషయాన్ని ఈ అధ్యయనం తేల్చిచెప్పడం విశేషం. -
టమాటకు ఎండదెబ్బ
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది టమాటరైతుల పరిస్థితి. నిన్నమొన్నటి వరకు పంటకు ధర లేక తీవ్రంగానష్టపోయారు. ఇప్పుడిప్పుడే కొంత మెరుగుపడుతుందిఅనుకుంటుండగా ఎండ రూపంలో వారిని మరోభూతంవెంటాడుతోంది. ఎండల కారణంగా కాయలు పగిలిపోవడం,పూతాపిందె రాలిపోతుండడంతో లబోదిబోమంటున్నారు. చిత్తూరు, మదనపల్లె సిటీ: ఒకవైపు మండుతున్న ఎండలు, మరో వైపు అకాల వర్షం టమాట రైతును దెబ్బతీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల కారణంగా టమాట కాయలు రంగుమారి, పగిలిపోతున్నాయి. ఈ కారణంగా వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా రైతులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. మదనపల్లె డివిజన్లో ప్రస్తుతం సుమారు 12వేల హెక్టార్లలో టమాట సాగు చేస్తున్నారు. వర్షాభావంతో చెరువులు, కుంటలు ఎండిపోయినా అరకొర భూగర్భ జలాలపై ఆధారపడి రైతులు పంట సాగు చేస్తున్నారు. సుమారు రూ.12 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. మార్చి నుంచి ఎండలు అధికమయ్యాయి. మదనపల్లెలో గతంలో ఎన్నడూ లేని విధంగా సగటును 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు వడగండ్ల వానకు పంటకు నష్టం వాటిల్లుతోంది. పూత, చెట్లలోని కాయలు రాలిపోవడంతో నష్టం జరుగుతోంది. దీనికితోడు ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. 30 కేజీల క్రేట్ సగటున రూ.100–150 వరకు పలుకుతున్నాయి. 10 క్రేట్లకు రెండు క్రేట్లు కాయలు దెబ్బతింటున్నాయి. సుమారు రూ.2 కోట్ల వరకు రైతులు నష్టపోయారు. పంటపై ఉష్ణోగ్రతల ప్రభావం.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. కాయలు పగిలిపోవడం వల్ల తక్కువ ధర పలుకుతున్నాయి. చాలామంది వ్యాపారులు గోనె సంచులు నీటితో తడిపి కాయలపై ఆరబెడుతున్నారు. రైతులు పొలం చుట్టూ చీరలు కడుతున్నారు. సాధారణంగా టమాట మొక్కలు 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు తట్టుకోగలగుతాయి. ఆపైన అధిక ఉష్ణోగ్రతలు ఉంటే పంట దెబ్బతింటుంది. దీనికి అనుగుణంగా పంటకు నీరు అధికంగా పెట్టాలి. ఈ కారణంగా పంటకు తెగుళ్లు సోకుతున్నాయి. ప్రస్తుతం పూత, పిందె దశల్లో ఉన్నాయి. ఎండవేడిమి, తెగుళ్లు విజృంభిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
టమాటాతో బహుళ ప్రయోజనాలు
కూరల్లో వాడుకునేందుకు ఒప్పులు, పొడి తయారీ – కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : ధరలు బాగా తగ్గినపుడు టమాటను వృథాగా పారబోయకుండా కూరల్లో వాడుకునేలా ఒప్పులు, పొడిని తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి తెలిపారు. నర్సరీల్లో ఎక్కువ అమ్ముడుబోయే నారుకు సంబంధించి పంట వేసుకోకపోవడం ఉత్తమమన్నారు. ఒకరిని చూసి మరొకరు గుడ్డిగా అధికవిస్తీర్ణంలో సాగు చేయడం వల్ల అందరికీ నష్టం వాటిల్లుతుందని తెలిపారు. జూదంలా మారిన టమోటా : టమాటా 'అనంత' రైతుల పాలిట జూదంగా పరిణమించింది. ధరలు ఎపుడు పలుకుతాయో ఎపుడు పతనమవుతాయో తెలియకపోవడంతో చాలా సందర్భాల్లో రైతులు దారుణంగా నష్టపోతున్నారు. టమాటా ధరలకు స్థిరత్వం అనేది లేకపోవడంతో పలికితే కిలో రూ.40 నుంచి 60 లేదంటే రూ.4 నుంచి రూ.6కు పడిపోవడం జరుగుతోంది. మరికొన్ని సందర్భాల్లో కిలో రూ.ఒకటి రూ.2 ప్రకారం గిట్టుబాటు కాని పరిస్థితి. పంటకు పెట్టుబడులు అటుంచితే కనీసం పంట కోత, రవాణా చార్జీలు గిట్టుబాటు కాక తోటలు వదిలేసుకునే దుస్థితి నెలకొంది. గిట్టుబాటు కాక మార్కెట్లు, రోడ్డు పక్కన పడేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో జిల్లా రైతులు రూ.కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఎక్కువ పంట విస్తీర్ణం : అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు, సరిహద్దు కర్ణాటక ప్రాంతాల్లో టమాటా పంట ఎక్కువగా సాగు చేయడం, పంట దిగుబడి కూడా గణనీయంగా వచ్చింది. అయితే మార్కెట్లో ధరలు పతనమై రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ధరల్లో వ్యత్యాసం నియంత్రించేందుకు కృషివిజ్ఞాన కేంద్రం, రెడ్డిపల్లి గృహ విజ్ఞాన విభాగం ఆధ్వర్యంలో టమాటా ఒరుగులు (ఎండు ఒప్పులు), పొడిని (నిల్వ పదార్థాలు) తయారు చేస్తూనే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఒరుగులు, పొడి తయారీ : టమాటా ఎండు ఒరుగులు, పొడి తయారు చేయడానికి నాణ్యమైన పండిన టమాటాలు సేకరించి, నీటిలో బాగా కడిగి శుభ్రం చేయాలి. ఒక్కో టమాటా నాలుగు నుంచి 8 ముక్కలుగా కోసి ప్లాస్టిక్ షీట్ మీద వేసి ఎండ బాగా ఉన్నపుడు వారం రోజుల వరకూ ఎండబెట్టాలి. పూర్తిగా ఎండబెట్టిన టమోట ఒరుగులను కొంత పొడి చేసి మరి కొన్ని అలాగే ఒరుగులుగా నిల్వ చేసుకోవచ్చు. గాలి బాగా ప్రసరించే ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి. ఒక కేజీ తాజా టమాటాల నుంచి 60 గ్రాముల ఒరుగులు తయారవుతాయి. ఇప్పుడున్న వాతావరణానికి అనుగుణంగా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఎండబెట్టుకోవాలి. అలా బాగా ఎండేవరకు చేసుకోవాలి. వినియోగం : నిల్వ చేసిన ఎండు ఒరుగులను నీటిలో 4 నుంచి 6 గంటల వరకూ నానబెట్టుకోవాలి. బాగా నానిన వాటిని టమాటా తరహాలోనే తయారవుతాయి. అనంతరం వాటిని కూరల్లో వినియోగించుకోవచ్చు. టమాటా పొడిని నేరుగా కూరలోనూ, రసంలోనూ వేసుకోవచ్చు. ఒరుగులతో తయారు చేసిన వంట పదార్థాలు తాజా టమాటాలతో సమానంగా ఉన్నాయని ప్రయోగాత్మకంగా రుజువైంది. నాలుగైదు నెలల పాటు నిల్వ చేసుకుని వినియోగించుకోవచ్చు. తాజా టామాటాల పోషక విలువలు, ఎండబెట్టిన టమాటాల పోషక విలువలు సమానంగా వచ్చాయి. ముఖ్యంగా సూక్ష్మజీవుల ప్రక్రియలు హాని కలిగించే స్థాయి కంటే తక్కువుగా ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా ఉండదని తేలింది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. -
టమాఠా కిలో రూ.1.90 పైసలే..
జిన్నారం : రైతు కాయకష్టం పశువుల పాలైంది. చేతికొచ్చిన టమాటా పంట పొలానికే పరిమితమైంది. తెంపితే కూలీల ఖర్చులు మీదపడతాయని అలాగే వదిలేశారు.. మార్కెట్లో ధర లేకపోవడంతో ఎందుకూ పనికిరాకుండా కుళ్లిపోతోంది. ఈ దుస్థితిని చూసి రైతన్న కంటనీరు పెడుతున్నాడు. జిన్నారం మండలం గుమ్మడిదల, కానుకుంట, కొత్తపల్లి, నల్లవల్లి, అనంతారం, సోలక్పల్లి, జిన్నారం తదితర గ్రామాల్లో రైతులు సుమా రు 400 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఆరు నెలల క్రితం పంటకు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో రైతులు టమాటా సాగుకు మొగ్గు చూపారు. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ఎకరా టమాటా సాగుకు రూ.20 నుంచి రూ.25 వేల వరకు వెచ్చించారు. ఖర్చులన్నీ పోనూ రైతుకు ఏటా రూ.10 నుంచి రూ.20 వేలు మిగిలేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 26 కిలోల టమాటా బాక్సు ప్రస్తుతం మార్కెట్లో రూ.50 పలుకుతుంది. అంటే కిలో ధర రూ.1.90 పైసలన్నమాట. రైతులు చేనులోంచి మార్కెట్‌కు 26 కిలోల టమాటా బాక్సును తరలించేందుకు రూ.100 ఖర్చవుతుంది. అంటే ఒక్క బాక్సుపై రూ.50 నష్టం వస్తుంది. పంటను సాగు చేస్తే దిగుబడులు రావాలి.. కాని అదనంగా ఖర్చవుతుందని భావించిన రైతులు టమాటాను తెంపేందుకు కూడా ఇష్టపడటం లేదు. దీంతో మండల వ్యాప్తంగా 400 ఎకరాల్లో రైతులు పంటను చేనులోనే వదిలేశారు. ఈ పంట లాభాల మాట అటుంచి కూలి ఖర్చులుకూడా గిట్టుబాటు కాక చేనులోనే వదిలేసి చేతులు దులుపుకొన్నారు. ప్రస్తు తం పంట పశువులకు మేతగా మారింది. రూ. 25 వేల వరకు ఖర్చు చేసిన పంట చేతికి రాకపోవటంతో రైతులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. -
ట‘మోత’
సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్లో టమాట ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఇటీవల ధర తగ్గినట్టేతగ్గి మళ్లీ పైపైకి ఎగబాకుతోంది. వారం కిందట కిలో రూ. 12-15 ఉన్న టమాట ధర ఒక్కసారిగా రూ. 30 లకు పెరిగింది. ఇళ్లవద్దకు వచ్చే తోపుడు బండ్ల వారైతే కేజీ రూ. 35కు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతుండడంతో ఆ ప్రభావం పంట దిగుబడిపై పడిందని, ఈ కారణంగానే ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. స్థానికంగా సాగవుతున్న టమాట పంట కూడా చివరి దశకు చేరడం నగరంలో కొరతకు ఓ కారణంగా నిలిచింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి దిగుమతి అయ్యే టమాటపైనే నగరం ఆధార పడాల్సి వస్తోంది. నగర డిమాండ్‌కు తగ్గట్టు సరుకు సరఫరా కాకపోవడంతో ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. నిజానికి హోల్ సేల్ మార్కెట్లో ఆదివారం కిలో రూ. 20లు ధర పలికింది. దీనికి రూ. 3లు అదనంగా వేసి రైతుబజార్లలో ధర నిర్ణయించడంతో అక్కడ కిలో రూ.23లకు విక్రయించారు. ఇదే సరుకు బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి కిలో రూ. 30-35 ప్రకారం వసూలు చేస్తున్నారు. ఘాటెక్కిన మిర్చి హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.26లున్న పచ్చిమిర్చి ధర రిటైల్ మార్కెట్లో కేజీ రూ.40లకు చేరింది. నగర అవసరాలకు నిత్యం 100-150 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. ప్రస్తుతం 100 టన్నుల లోపే మిర్చి దిగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం లోకల్‌గా మిర్చి సరఫరా తగ్గిపోవడంతో గుంటూరు, విజయవాడ, అనంతపురం, బెంగళూరుల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. బెండ, దొండ, బీర, కాకర, దోస తదితరాల ధరలు కేజీ రూ.40లకు చేరువయ్యాయి. ఇక క్యారెట్, చిక్కుడు, గోకర, ఫ్రెంచ్ బీన్స్ ధరలైతే సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. -
టమాట రైతుకు రుణ విముక్తి ఏదీ?
రాష్ట్రంలోనే టమాట పంటకు మదనపల్లె పెట్టింది పేరు. ఇక్కడ 90 శాతం మంది రైతులు, వ్యాపారులు, కూలీలు ఇదే పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒకప్పుడు వీరి బతుకులు సాఫీగా సాగాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వర్షాభావం, కరెంటు కోతలు, గిట్టుబాటు ధరలులేక వారు కుమిలిపోతున్నారు. అప్పుచేసి పంట పెట్టినా ఫలితం లేకుండాపోతోంది. తీవ్ర దుర్భిక్షం టమాట బతుకును ఛిద్రం చేస్తోంది. చేసిన అప్పులు తీర్చాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు పంపుతున్నారు. లేకుంటే తాకట్టు పెట్టిన నగల్ని వేలం వేస్తామని హెచ్చరిస్తున్నారు. రుణ మాఫీ హామీ నీటిమీద రాతలా మారింది. దీనిపై ఎవరినడగాలో.. ఎక్కడ చెప్పుకోవాలో దిక్కుతోచడంలేదు. వీరి సమస్యలు తెలుసుకునేందుకు మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. మదనపల్లె టమాట మార్కెట్‌ను సందర్శించారు. స్థానిక కూలీలు, వ్యాపారులు సమస్యలను ఏకరువు పెట్టారు. రుణవిముక్తి కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ టమాట రైతుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రెజెంటేషన్: చిట్టెం సుధాకర్, మాడా చంద్రమోహన్ దేశాయ్ తిప్పారెడ్డి హామీలు మదనపల్లె టమాట మార్కెట్‌ను మోడ్రన్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతా. ఈ విషయంపై ఈనెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో చర్చకు తీసుకువస్తా. రూ.10 కోట్లతో మార్కెట్‌ను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. వేలం పాటలకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తాం. మార్కెటింగ్ మంత్రి పుల్లారావు, మార్కెటింగ్ కమిషనర్ వెంకటరామిరెడ్డితో స్వయంగా కలిసి సమస్యలు తెలియజేస్తాను. తాగునీటి కోసం ఆర్ఓఆర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తా. పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటాం. జాక్‌పాట్ నిర్వహించే మండీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రయత్నిస్తా. దేశాయ్ తిప్పారెడ్డి: నమస్తే అన్నా.. నా పేరు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి. మదనపల్లె ఎమ్మెల్యేని. టమాటాకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? ప్రభుత్వం సహకారం ఎలా ఉంది? ఆంజనేయులు(రైతు): టమాటా బాక్సులకు కమీషన్లు ఇవ్వాలి. గిట్టుబాటు కాలేదు. పంటను నమ్ముకున్నాం. చివరకు మందుల ధరలు పెరిగిపోయాయి. చెమడోచ్చి పం డించిన కాయలు మార్కెట్‌కు తెస్తే చివరకు చిల్లిగవ్వ కూడా మిగలేదు. ప్రభుత్వ సహకారం ఏమాత్రం అందడం లేదు. దేశాయ్ తిప్పారెడ్డి: టమటా పంటకు రుణమాఫీ వర్తింపజేయాలా? మీరు పంట రుణమాఫీ ఎలా కావాలని కోరుకుంటున్నారు? మల్లప్ప(రైతు): అన్ని పంటలతో పాటు టమాటా పంటకూ రుణమాఫీ అమలు చేయాలి. ఎంతోమంది రైతులు టమాటా పంట పెట్టి నష్టపోయారు. శెనగ పంట కంటే టమాటాకు మొదట రుణమాఫీ చేయాలి. ముఖ్యమంత్రి దీనిపై ఆశించిన సమాధానం ఇవ్వలేదు. దేశాయ్ తిప్పారెడ్డి: టమటాకు ఎంత రుణమాఫీ చేయాలనుకుంటున్నావు? సంగప్ప(రైతు): సార్, టమాట పంటకు ఎకరాకు రూ.1.5 లక్షలు ఇవ్వాలి. పంట పెట్టినప్పటినుంచి ఎంతో నష్టపోయాం. చివరకు శెనిగి చెట్లు కూడా వేయలేదు. రుణమాఫీ చేయకుంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. దేశాయ్ తిప్పారెడ్డి: టమాటాకు రుణమాఫీ చేయకపోతే మీరు ఏం చేస్తారు? సంగప్ప: రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తాం. తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి ఆందోళనలు చేస్తాం. దేశాయ్ తిప్పారెడ్డి: మద్దతు ధర ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మల్లికార్జున: సార్.. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. పంట పెట్టినప్పటి నుంచి మార్కెట్‌కు వచ్చే వరకు కష్టాలే. ధరలు తగ్గితే ఎవరూ పట్టించుకోరు. కనీసం కిలో రూ.15 ధర ప్రకటించాలి. దేశాయ్ తిప్పారెడ్డి: మీరు పెట్టిన పంటకు ఇన్సూరెన్సు లభిస్తుందా? ఆంజినేయులు(రైతు): ఏం చెప్పమంటారు సారు.. పెట్టిన పంటకు ఇన్సూరెన్సు ఇవ్వలేదు. పంట పెట్టి దేవుడిపై భారం వేస్తున్నాం. దేశాయ్ తిప్పారెడ్డి: మార్కెట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ప్రభాకర్‌రెడ్డి (రైతు): రాత్రి కాయలు తెస్తే మండీల బయటే పడుకోవాలి. దోమల బెడద, తాగేందుకు నీళ్లు దొరకవు. రాత్రంతా జాగరణ ఉండాల్సిందే. పొద్దునే వేలం పాట పాడే వరకు ఉండి డబ్బులు తీసుకుని పోతున్నాం. దేశాయ్ తిప్పారెడ్డి: మార్కెట్లో విశ్రాంత భవనం ఉంది కదా. ఎలా ఉపయోగపడుతోంది? రామప్ప(రైతు): సారు.. ఏం చెప్పమంటారు.. పేరుకు మాత్రం పెద్ద అచ్చరాలతో రైతు విశ్రాంతి భవనం అని రాశారు. ఎప్పుడు సూసినా మూసివేసివుంటారు. ఎవరినైనా అడిగితే వెళ్లవయ్యా..అంటూ కసరుకుంటారు. దేశాయ్ తిప్పారెడ్డి: అన్నా... మరుగుదొడ్లు ఉన్నాయా? రాంమోహన్ (రైతు): ఎక్కడున్నాయి సారు.. కట్టిన మరుగుదొడ్లు ఎప్పుడు చూసినా తాళాలు వేసివుంటారు. రాత్రయితే మార్కెట్ ఆవరణలోనే మలవిసర్జన చేయాల్సి వస్తోంది. దీంతో దుర్వాసన వస్తుంది. మరుగుదొడ్లు కట్టినా ప్రయోజనం లేదు. దేశాయ్ తిప్పారెడ్డి: మార్కెట్లో తాగేందుకు నీళ్లు ఉన్నాయా? శివన్న(రైతు): ప్యాకెట్ నీళ్లు తెచ్చుకుని తాగుతున్నాం. వాటికోసం కావాలంటే రోడ్డు దాటి పోవాలి. కొళాయిలున్నా నీళ్లు మాత్రం రావు. పడరాని పాట్లు పడుతున్నాం. దేశాయ్ తిప్పారెడ్డి: మీరు తెచ్చిన టమటాలకు సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్నారా? పెద్దిరెడ్డి(రైతు): సార్ నిజం చెప్పమంటారా.. వందకు 10 రూపాయలు కమీషన్, 100 బాక్సులు తెస్తే గ్రేడింగ్ పేరుతో 60 బాక్సులు రాస్తారు. చివరకు మాకు మిగిలేది గుండుసున్నే. దళారీలు రాజ్యమేలుతున్నారు. దేశాయ్ తిప్పారెడ్డి: ఏమ్మా.. మీకు కూలి గిట్టుబాటు లభిస్తుందా? ఏ సమస్యలు ఉన్నాయి? శాంతమ్మ(కూలీ): రోజంతా కాయలు ఏరితే వంద వస్తుంది. ఇంట్లో పిల్లాజల్లా ఉన్నాం. కనీసం గుర్తింపు కార్డులు లేవు. కార్మికులుగా గుర్తింపు లేదు. దేశాయ్ తిప్పారెడ్డి: డ్వాక్రాలో ఉన్నావా? రుణమాఫీ అవుతుందని అనుకుంటున్నావా? శాంతమ్మ: డ్వాక్రాలో ఉన్నాను. రుణమాఫీ అవుతుందని చెబుతున్నారే తప్ప ఇప్పటివరకు చేసిందేమి లేదు. వారిని(ప్రభుత్వం) నమ్ముకుంటే గంగలో దూకినట్లే. దేశాయ్ తిప్పారెడ్డి: అన్నా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? కె.వి.రమణ(మండీ యజమాని): రైతులు తెచ్చిన కాయలు రోడ్లపైనే వేలం వేయాల్సి వస్తోంది. టమటాలు పచ్చి పంట. ఎండకు, వానకు నానినే పనికి రావు. ధరలు సరిగా ఉండవు. రోడ్లపై వేలం వల్ల కాయలు దెబ్బతింటున్నాయి. పక్కనే ఉన్న వాల్మీకిపురం, చింతపర్తి, గుర్రం కొండలో షెడ్లు వేశారు. దేశాయ్ తిప్పారెడ్డి: అన్న.. మండీలో ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి? నాగయ్య(మండీ యజమాని): షెడ్లు అదనంగా నిర్మించాలి. విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయాలి. దీనిపై మార్కెట్ జేడీకి తెలియజేశాం. రోడ్డుపైనే వేలం వేయడం వల్ల పచ్చికాయలు చెడిపోయి ధరలు తగ్గిపోతాయి. రైతులు, వ్యాపారులు నష్టపోతున్నాం. దేశాయ్ తిప్పారెడ్డి: మార్కెట్లో పరిశుభ్రత ఎలా ఉంది? నరసింహులు(రైతు): మార్కెట్లో అడుగుపెడితే చాలు దుర్వాసన. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, కుళ్లిన టమాటాలు. వీటిని శుభ్రం చేయడం లేదు. ..అంతలోనే మార్కెట్ కమిటీ కార్యదర్శి జగదీష్ వచ్చారు. దేశాయ్ తిప్పారెడ్డి: సెక్రటరీ గారూ..మార్కెట్లో జాక్పాట్లు, తాగునీరు లేదని, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం అ ద్వానంగా ఉందని, రోడ్లుపైనే వేలం పాటలు వేస్తున్నారని రైతులు, కూలీలు తెలిపారు. దీనిపై మీ స్పందన ఏమిటి? జగదీష్ (మార్కెట్ కార్యదర్శి): టమాటా గిట్టుబాటు ధరల కోసం జాక్‌పాట్ చేసే మండీలకు నోటీసులు ఇచ్చాం. తాగునీటి సమస్య త్వరలో తీరుస్తాం. విశ్రాంతి భవనం ఏర్పాటు చేసేలా చూస్తాం. మార్కెట్లో పరిశుభ్రత పాటించే కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. మండీల ఎదుట పరిశుభ్రత ఉండేలా యజమానులకు తెలియజేశాం. డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి: మార్కెట్లో స్వచ్ఛ భారత్ నిర్వహించలేదా? జగదీష్ : మండీ యజమానులను భాగస్వాములను చేస్తున్నాం. వారి మండీల వద్ద చెత్తను ఒక చోట చేర్పించేలా చర్యలు చేపట్టాం. ఉదయం, సాయంత్రం చెత్తను ట్రాక్టర్లలో ఎత్తి వేస్తాం. తర్వలో స్వచ్ఛభారత్ నిర్వహిస్తాం. -
ఏడుగంటలు..ఉత్తమాటలే!
వ్యవసాయానికి నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా సక్రమంగా లేదు నీళ్లందక బోరు బావుల కింద పంటలు ఎండుతుండటంతో తల్లడిల్లుతోన్న రైతన్నలు మూడు వేల ఎకరాల్లో ఎండిపోయిన టమాటా పంట 42 వేల ఎకరాల్లో ఇతర పంటలదీ అదే దుస్థితి కరెంట్ కోతలు ఇబ్బంది పెట్టింది ఒక్క మునెప్పనో.. ఒక్క వెంకటరెడ్డినో కాదు... 2,54,842 మంది రైతులను వేధిస్తున్నాయి. ఎన్నో కష్టాలకోర్చి వేలాది రూపాయలు వెచ్చించి సాగుచేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి/తంబళ్లపల్లె/ కుప్పం: రైతులపై వరుణుడే కాదు ప్రభుత్వమూ పగబట్టింది. వర్షాధార పంటలు వర్షాభావంతో ఎండిపోతుంటే రైతుల కళ్లలో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. బోరుబావుల కింద పంటలు సాగుచేసిన రైతులకూ కరెంట్ కోతలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చంద్రబాబుకే ఎరుక... కనీసం ఏడు గంటలైనా సక్రమంగా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,54,842 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నా యి. బోరు బావుల కింద 6.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నట్లు అంచనా. బోరుబావుల కింద పశ్చిమ మండలాల్లో టమాటా, వంకాయ, బెండ, మిర్చి వంటి కాయగూర పంటలతోపాటు వేరుశెనగ పంటనూ విస్తారంగా సాగుచేశారు. ఒక్క టమాటానే ఆరు వేల ఎకరాలకు పైగా సాగుచేశారు. వర్షాభావంతో కాయగూరల దిగుబడి కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో అరకొర దిగుబడి వచ్చినా మంచి ధర దక్కితే గట్టెక్కవచ్చునని రైతులు ఆశించారు. కానీ.. రైతుల ఆశలపై డిస్కమ్ అధికారులు నీళ్లు చల్లారు. నాలుగు గంటలే సరఫరా వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. జిల్లాలో రోజుకు 12.5 మిలియన్ యూనిట్లను సరఫరా చేస్తుండగా.. వినియోగం 14 మిలియన్ యూనిట్లు ఉంది. సరఫరాకూ వినియోగానికి అంతరం పెరిగిపోతుండటంతో వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్‌లో కోతలు విధిస్తున్నారు. కేవలం నా లుగు గంటలు మాత్రమే వ్యవసాయానికి సరఫరా చేస్తున్నారు. విద్యుత్ సరఫరా తగినంత లేకపోతే నాలుగు గంటలు కూడా సరఫరా చేయలేకపోతున్నామని అనధికారికంగా డిస్కమ్ అధికారులు అంగీకరిస్తున్నారు. తంబళ్లపల్లె మండలం యర్రమద్దువారిపల్లె లో వ్యవసాయానికి ఒకవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. మరో వారం మ ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఆరు గం టల వరకు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో వర్షాభావంతో భూగర్భ జలా లు అడుగంటి బోర్లలో వచ్చే ఆరకొర నీరు కేవలం అర ఎకరా మాత్రమే పారుతుంది. దీంతో పంటలు సగం ఎండుతున్నాయి. కుప్పం మండలం వెండుగంపల్లెలో వ్యవసాయానికి ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకూ.. రాత్రి 12 నుంచి రెండు గంటల వరకూ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. లోవోల్టేజీ కరెంట్ సరఫరా చేస్తుండటంతో మోటార్లు పనిచేయడం లేదు. దాంతో పొలానికి నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి. పుంగనూరు మండలం పట్రపల్లెలోనూ అదే పరిస్థితి. వ్యవసాయానికి నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో నీళ్లం దక వందలాది ఎకరాల్లో టమాటా, బెండ, వంకాయ తోటలు ఎండిపోయా యి. లోవోల్టేజీ కరెంట్ సరఫరా చేస్తుండటంతో రైతులు వ్యవసాయ మోటార్ల వద్ద అర్ధరాత్రి పూట పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు స్విచ్చాన్ చేస్తేనే మో టారు పనిచేస్తుంది.. లేదంటే పనిచేయదు. ఇప్పటికైనా పంటలకు 7 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు. కరంటు ఎప్పుడు వస్తుందో తెలీదు ఎకరా పొలంలో టమోటా పంటను సాగు చేసా. రూ.40 వేలు ఖర్చు అయ్యింది. పంటను కంటికి రెప్పలా కాపాడుకుందామనుకుంటే కరంటు సక్రమంగా వుండదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు పోతుందో తెలియదు. టమాటాకు మంచి ధరలు పలికే సమయంలో నీళ్లు పారక పంట ఎండుముఖం పట్టింది. కరంటు సక్రమంగా ఇచ్చి వుంటే మా కష్టాలన్నీ తీరేవి. మహానుభావుడు రాజశేఖర్‌రెడ్డి హయాంలో కరంటు బాగా ఉండేది. వర్షాలు సకాలంలో కురిసి రైతులంతా సుభిక్షంగా ఉండేవాళ్లు. -సాకల కోనప్ప, రైతు, పీటీఎం మండలం -
కుండపోత వర్షం
సాక్షి, తిరుపతి: జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. కలకడ మండల పరిధిలోని నడిమిచర్ల, కోన, గుడిబండ గ్రామాల్లో నాలుగు నివాస గృహాలు కూలిపోయాయి. 26 మేకలు, గొర్రెలు, రెండు పాడి ఆవులు, రెండు దూడ లు మృత్యువాత పడ్డాయి. అడవిలో రెడ్డికుంట చెరువు తెగిపోయింది. వడ్డికుంట, దేవళంమాను చెరువు, గుట్టచెరువు, నల్లగుట్టకుంట, కొత్తచెరువులు తెగిపోవడంతో సుమారు 350 ఎకరాల్లో వేరుశెనగ, టమాట, వరి పంట లు నీట మునిగాయి. గుర్రంకొండ మండలం నడింకండ్రిగ గ్రామ పరిధిలో మూడు కుంటలు, నాలుగు చెక్‌డ్యాంలు తెగిపోయాయి. గొర్రెలు, మేకలు మృతి చెందాయి. ప్రవహించిన ఆలేరు వాగు బి.కొత్తకోట మండల పరిధిలో మంగళవారం రాత్రి 10.30 నుంచి ఉదయం 3.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ఆలేరు వాగు ప్రవహించింది. 20 ఏళ్ల తర్వాత వాగు ప్రవహించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో రాత్రి నుంచి ఉద యం వరకు భారీ వర్షం కురిసింది. పలమనేరులో పట్టు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. టమాట పంట దెబ్బతింది. చంద్రగిరి పరిధిలోనూ భారీ వర్షం కురిసింది. శేషాచలం కొండల్లో నుంచి భారీగా వరద నీరు రావడం తో కల్లేటి వాగు ప్రవహించింది. పుత్తూరు, నగరి పరిధి లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలోకి నీరు చేరింది. నగరి పరిధిలోని మాంగాడు, గుం డ్రాజుకుప్పం, నగరి చెరువులకు నీరు చేరింది. మాం గాడు చెరువు కలుజు పారుతోంది. పుంగనూరులో కురి సిన భారీ వర్షానికి చిన్న చిన్న కుంటలన్నీ పొంగి ప్రవహించాయి. పూతలపట్టు పరిధిలోనూ భారీ వర్షం కురి సింది. కుంటలు, కాలువల్లో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. పెనుమూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, పాలసముద్రం మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటల కింద వేరుశెనగ, వరి, మామిడి, అరటి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కుప్పం పరిధిలో తేలికపాటి వర్షం కురిసింది. వేరుశెనగ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పడమటి మండలాల్లో కూరగాయల పంటలు దెబ్బతినే అవకాశముం దని వ్యవసాయాధికారులు వెల్లడించారు.