breaking news
Time Out
-
పొట్టి క్రికెట్లో అసాధారణ ఘటన.. చరిత్రలో తొలిసారి ఇలా..!
పొట్టి క్రికెట్లో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఫార్మాట్ చరిత్రలో తొలిసారి ఓ బ్యాటర్ టైమ్డ్ ఔట్‌గా (Timed Out) ప్రకటించబడ్డాడు. కేరళ క్రికెట్ లీగ్-2025లో భాగంగా ఇది జరిగింది.నిన్న (సెప్టెంబర్ 5) కాలికట్ గ్లోబ్స్టార్స్తో జరిగిన మ్యాచ్‌లో (రెండో సెమీఫైనల్) కొచ్చి బ్లూ టైగర్స్ ఆటగాడు అల్ఫీ ఫ్రాన్సిస్ జాన్ టైమ్డ్ ఔట్ అయ్యాడు. నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు ఔటయ్యాక 90 సెకెన్లలోపు మరో ఆటగాడు క్రీజ్‌లోకి రావాల్సి ఉంటుంది.అయితే ఈ ఘటనలో అల్ఫీ నిర్దేశిత సమయాన్ని దాటాక క్రీజ్‌లోకి వచ్చాడు. ఇది గమనించిన కాలికట్ బౌలర్లు ఫీల్డ్ అంపైర్‌కు అప్పీల్ చేశారు. పలు మార్లు పరిశీలించిన అనంతరం అంపైర్ అల్ఫీని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అల్ఫీ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే క్షణాల్లో తిరిగి పెవిలియన్‌కు చేరాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఓ బ్యాటర్ టైమ్డ్ ఔట్ ద్వారా ఔట్ కావడం ఇదే మొదటిసారి.ఇలాంటి ఘటన ఇటీవల ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఐసీసీ వరల్డ్ కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔటయ్యాడు. బంగ్లా ఆటగాడు షకీబ్ అల్ హసన్ అప్పీల్ మేరకు అంపైర్లు మాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్‌గా ప్రకటించారు. ఈ ఉదంతం తర్వాత షకీబ్ విమర్శలు ఎదుర్కొన్నాడు. క్రీడాస్పూర్తిని మరిచి ప్రవర్తించాడని మాటలు పడ్డాడు. ఏది ఏమైనా నిబంధనల ప్రకారం మాథ్యూస్ టైమ్డ్ ఔట్ కరెక్టేనని మరికొందరు షకీబ్‌కు మద్దతుగా మాట్లాడారు.క్రికెట్ చరిత్రలో టైమ్డ్ ఔట్ నిబంధన ఉల్లంఘించి ఇప్పటివరకు ఏడుగురు ఔటైనట్లు తెలుస్తుంది. తొలిసారి ఈ నిబంధన ఉల్లంఘణకు బలైన ఆటగాడు హెరాల్డ్ హేగేట్ (సర్రే). 1919 కౌంటీ సీజన్లో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో హెరాల్డ్ నిర్దేశిత సమయంలోపు క్రీజ్‌లోకి రాలేదు. దీంతో అంపైర్లు అతన్ని ఔట్‌గా ప్రకటించారు.ప్రస్తుతం టీ20 క్రికెట్ జరుగుతున్న తీరు ప్రకారం టైమ్డ్ ఔట్ అన్నది అసాధారణం. ఎందుకంటే, ఆటగాళ్లు క్రీజ్‌కు అతి సమీపంలో డగౌట్లలో ఉంటారు. ఓ ఆటగాడు ఔటయ్యాక మరో ఆటగాడు క్షణాల్లో క్రీజ్‌లో వాలిపోవచ్చు. అలాంటిది తాజా ఉదంతంలో అల్ఫీ 90 సెకెన్లు దాటినా క్రీజ్‌లోకి రాకపోవడమనేది అసాధారణమనే అని చెప్పాలి.మ్యాచ్ విషయానికొస్తే.. అల్ఫీ టైమ్డ్ ఔట్ ఉదంతం తర్వాత కూడా తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి జట్టు భారీ స్కోర్ చేసింది. నికిల్ (64 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీతో, ఆఖర్లో ఆషిక్ (31) సుడిగాలి వేగంతో పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో కాలికట్ తడబడింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అఖిల్ స్కారియా (72 నాటౌట్) కాలికట్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపుతో కొచ్చి టైగర్స్ ఫైనల్స్‌కు చేరింది. ఈ సీజన్లో కొచ్చి ఫైనల్స్‌కు చేరడంలో టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ కీలకపాత్ర పోషించాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఇరగదీసి కొచ్చిని సెమీస్ వరకు తీసుకొచ్చాడు. ఆసియా కప్ కోసం సంజూ దుబాయ్‌కు వెళ్లడంతో సెమీస్ ఆడలేదు. -
‘మహువా’ పై వేటు క్రికెట్లో ఆ రూల్ లాంటిదే: కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.మహిళా ఎంపీపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆసక్తికరంగా స్పందించారు. మహువాను బహిష్కరించడాన్ని క్రికెట్లో టైమ్ అవుట్ పద్ధతితో పోల్చారు. ‘మహువాపై ఒక ఫిర్యాదు వచ్చింది.దీనిపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. ఆమెను సభ నుంచి బహిష్కరించాలని కమిటీ నివేదిక ఇచ్చింది. అనంతరం ఆమెను బహిష్కరించారు. ఇదంతా చూస్తుంటే విచారణ ఏదో కంటి తుడుపు చర్యలా కనిపిస్తోంది’ అని కార్తీ వ్యాఖ్యానించారు. ‘రెండువారాల క్రితం వరల్డ్ కప్ జరిగింది.అందులో ఒక మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మ్యాథ్యూస్‌ను బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ టైమ్ అవుట్ చేశాడు.ఇది ఆట నిబంధనల్లో భాగమే కావచ్చు. కాని దీనిని క్రికెట్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. ఆట స్ఫూర్తికి విరుద్ధమని వారంతా అభిప్రాయపడ్డారు. మహువా విషయంలోనూ ఇదే జరిగింది. ఒక ఒంటరి మహిళను అవమానించారు. ఇది ప్రజలు ఒప్పుకోరు. ఆమెను మళ్లీ భారీ మెజారిటీతో లోక్‌సభకు పంపిస్తారు’అని కార్తీ చెప్పారు. కాగా, పార్లమెంట్లో అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువా నగదు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఏకంగా తన పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను హీరానందానికి ఇచ్చారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మహువాపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పీకర్ ఆమెపై విచారణకు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. విచారణజరిపిన ఎథిక్స్ కమిటీ మహువానున లోక్‌సభ నుంచి బహిష్కరించాలని నివేదిక ఇచ్చింది.ఈ సిఫారసును లోక్‌సభ శుక్రవారం వాయిస్ ఓట్‌తో ఆమోదించడంతో మహువా సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇదీచదవండి..ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం -
టైమ్డ్ ఔట్ కాకుండా మరో విచిత్ర పద్దతిలో ఔట్.. అది కూడా ఈ ఏడాదిలోనే..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా ఔటైన ఆటగాడు మాథ్యూసే కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా ఎక్కువగా ప్రచారం లేని మరో విధానంలో ఓ బ్యాటర్ ఇదే ఏడాది ఔటయ్యాడు. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనల ప్రకారం బ్యాటర్లు మొత్తం పది విధాలుగా ఔట్‌గా ప్రకటించబడతారు. వాటిలో క్యాచ్ ఔట్, బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్,స్టంపౌట్ అతి సాధారణంగా ప్రకటించబడే ఔట్లు కాగా.. హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం) వంటివి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. WATCH the only Hitting The Ball Twice dismissal in international cricket --- when Malta's Fanyan Mughal got out against Romania in the 2023 Men's Continental Cup on 20 August 2023 pic.twitter.com/PFerZJOM4u — Dhaarmik (@DhaarmikAi) November 6, 2023 అయితే పది విధానాల్లో మిగిలిన రెండు విధాల ఔట్లను మాత్రం క్రికెట్ ప్రపంచం ఈ ఏడాదికి ముందు చూసి ఎరుగదు. ఆ రెండు విధాల ఔట్లు ఏవంటే.. టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం). ఈ రెంటిలో టైమ్డ్ ఔట్‌ను నిన్నటి వరల్డ్‌కప్ మ్యాచ్‌లో తొలిసారిగా చూశాం. ఇందులో రెండోదైన హిట్ ట్వైస్ ఔట్ ఘటన కూడా ఇదే ఏడాది తొలిసారి జరిగిందన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. పురుషుల కాంటినెంటల్ కప్‌లో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్ 20న రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో మాల్టా ఆటగాడు ఫన్యాన్ ముఘల్ ఓసారి బంతిని స్ట్రయిక్ చేసిన అనంతరం ఫీల్డర్ పట్టుకోకముందే మరోసారి బ్యాట్‌తో కొట్టి హిట్ ట్వైస్గా ఔటయ్యాడు. మాథ్యూస్ టైమ్డ్ ఔట్ విషయం వైరలైన నేపథ్యంలో హిట్ ట్వైస్కు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియో సైతం ప్రస్తుతం వైరలవుతుంది. ఏ ఆటగాడు, ఎప్పుడు తొలిసారి ఔట్‌గా ప్రకటించబడ్డాడంటే.. క్యాచ్ ఔట్ (టామ్ హోరన్, 1877), బౌల్డ్ (నాట్ థామ్సన్, 1877), ఎల్బీడబ్ల్యూ (హ్యారీ జప్, 1877), రనౌట్ (డేవ్ గ్రెగరీ, 1877), స్టంపౌట్ (ఆల్ఫ్రెడ్ షా, 1877), హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం, జార్జ్ బొన్నర్, 1884), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం, రసెల్ ఎండీన్, 1957), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం, లెన్ హటన్, 1951), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం, ఫన్యాన్ ముఘల్, 2023), టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం, ఏంజెలో మాథ్యూస్, 2023) -
క్రికెట్లో ఔట్లు ఎన్ని విధంబులు అనిన...???
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్‌గా ప్రకటించబడిన నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. అసలు క్రికెట్లో ఓ బ్యాటర్ ఎన్ని రకాలుగా ఔట్‌గా ప్రకటించబడతారని అభిమానులు గూగుల్ చేయడం ప్రారంభించారు. దీనికి సమాధానం పది. ఇందులో క్యాచ్ ఔట్, బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్,స్టంపౌట్ అతి సాధారణంగా ప్రకటించబడే ఔట్లు కాగా.. హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం), టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం) వంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. వీటిలో బ్యాటర్లు దాదాపు అన్ని విధాల్లో ఒకటి అంత కంటే ఎక్కువసార్లు ఔట్ కాగా.. నిన్నటి మ్యాచ్‌లో (శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్) ఓ బ్యాటర్ (ఏంజెలో మాథ్యూస్) తొలిసారి టైమ్డ్ ఔట్‌గా ప్రకటించబడ్డాడు. మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించే విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఏదిఏమైనా రూల్ కాబట్టి, అంతిమంగా ఫలితం అతనికి అనుకూలంగానే వచ్చింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ జట్టు ఇదివరకే ప్రపంచకప్ నుంచి ఎలిమినేట్ (సెమీస్‌కు అర్హత సాధించలేదు) అయ్యింది. తాజా ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌తో పాటు ఎలిమినేషన్‌కు గురైంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్ కూడా ఇదివరకే ఎలిమినేట్ కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నడుస్తుంది. చదవండి: మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్ -
'బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది'!: అరవింద్ కేజ్రీవాల్
జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసుల ప్రవర్తన దిగ్బ్రాంతి చెందేలా ఉంది. లైంగిక వేధింపులతో మానసికంగా నలిగిపోయిన వారు నేరస్తులు కాదని, ఛాంపియన్ ప్లేయర్ల పట్ల ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇది చాలా అమానుషం, విచారకరం, సిగ్గుచేటు అంటూ అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఈ వ్యక్తులు (బీజేపీ) మొత్తం వ్యవస్థను గుండాయిజంతో నడపాలని కోరుకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇకపై బీజేపీ గుండాయిజాన్ని సహించవద్దని, బీజేపీని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు, ఢిల్లీ పోలీసుల మధ్య వాగ్వాదం తలెత్తిన సంగతి తెలిసిందే. చంపాలనుకుంటే చంపేయండి..! ఈ నేపథ్యంలో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఉద్వేగభరితంగా మీడియా ముందు.. 'మమ్మల్ని చంపాలనుకుంటే చంపేయండి' అంటూ మాట్లాడారు. ఈ రోజులు చూసేందుకేనా మేము పతకాలు గెలిచింది అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రతి మగవాడికి ఆడవాళ్లను తిట్టే హక్కు ఉందా!.. అని నిలదీశారు. తుపాకులు పట్టుకుని మమ్మల్ని చంపేయండి అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీకి చేరుకున్న డీసీడబ్ల్యూ చీఫ్: కాగా, ఈ మేరకు జంతర్‌మంతర్ వద్దకు వచ్చిన ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ తనను నిరసన ప్రదేశంలోకి అనుమతించడం లేదని ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు చేశారు. రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి, మాలిక్ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తాగి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మాకు చెప్పారని అన్నారు. వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయినా ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌కు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారు? ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ఢిల్లీ పోలీసులపై పైర్ అయ్యారు స్వాతి మలివాల్ . (చదవండి: శరద్ పవార్ ఆత్మకథ పుస్తకంలో ఆసక్తికర అంశం..మోదీకి అప్పుడే స్పష్టం చేశా!) -
‘టైమ్ అవుట్’ను ప్రారంభించిన యువరాజ్
సాక్షి, బెంగళూరు:ప్రముఖ క్రీడా పరికరాల తయారీ సంస్థ ‘స్పోర్ట్స్ 365’ టైమ్ అవుట్ పేరిట ప్రత్యేక ఆరోగ్య శిక్షణా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారమిక్కడ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఇదే కార్యక్రమంలో భాగంగా స్పోర్ట్స్ 365 సంస్థ పారా ఒలంపిక్ అథ్లెట్లు శరత్గైక్వాడ్, నిరంజన్ ముకుందన్లను ఘనంగా సత్కరించారు. క్రికెటర్ యువరాజ్‌సింగ్ వీరికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.