breaking news
Tikka
-
సముద్రంలో పడవ బోల్తా.. జాలరి గల్లంతు
అచ్యుతాపురం (అనకాపల్లి): సముద్రంలో వేటకు వెళ్లిన పడవ బోల్తాపడటంతో ఓ జాలరి గల్లంతయ్యాడు. విశాఖ జిల్లా పూడిమడక తీరంలో శనివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఇంజన్ లేని బోటులో పూడిమడకకు చెందిన తిక్కల వెంకన్న, మరో ముగ్గురు జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లారు. కొంత దూరం వెళ్లాక బోటు బోల్తా పడింది. వీరిలో తిక్కల వెంకన్న (50) గల్లంతయ్యాడు. మిగిలిన ముగ్గురూ బోటును తిరగేసి వెంకన్న కోసం గాలించారు. అయినా జాడ కానరాకపోవడంతో ఒడ్డుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేటకు వెళ్లిన వారిలో వెంకన్నతో పాటు అతని కుమారుడు రాజు కూడా బోటులో ఉన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఉపేంద్ర చెప్పారు. -
ఆగస్టులో బాక్స్ ఆఫీస్ బిగ్ ఫైట్
-
అతనికి తిక్క రేగిందంటే...!
‘‘నాక్కొంచెం తిక్కుంది...కానీ దానికో లె క్కుంది’’అని ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో పవన్‌కల్యాణ్ అంటే... ఇప్పుడు ఆయన మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ తనకు తిక్క రేగితే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపిస్తానంటున్నారు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సునీల్ రెడ్డి దర్శక త్వంలో సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి జంటగా నటిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. నిర్మాత ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ వేడుకలో - రాజకీయ ప్రముఖులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, సినీ ప్రముఖులు నాగబాబు, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ- ‘‘ఇది నాకు నాలుగో సినిమా. ఏడాది క్రితం సునీల్రెడ్డిగారు ఈ కథ చెప్పారు. ఇందులో నా పేరు ఆదిత్య. హీరోయిన్ తో ఎంతో ఈజీగా ప్రేమలో పడతాను. కానీ అంతలోనే మా ఇద్దరికీ బ్రేకప్ అవుతుంది. దాంతో నాకు తిక్క రేగి మళ్లీ ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెల్చుకున్నానన్నదే ఈ సినిమా’’ అని తెలిపారు. సునీల్ రెడ్డి మాట్లాడుతూ- ‘‘ఎవరి లైఫ్‌కి వారే హీరో. కానీ ఈ సినిమాలో హీరో లైఫ్‌కి హీరోనే విలన్. అదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఫుల్ హిలేరియస్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాతగా తనకిది తొలి చిత్రమని, కథ విని ఎగ్టయిట్ అయ్యానని, ఈ నెల 10 నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని రోహిణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సహ నిర్మాత: ఆర్. కిరణ్.