breaking news
telangana sakatam
-
మేడారం జాతర.. బతుకమ్మ పండుగ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు తెలంగాణ శకటం ఎంపికైంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ శకటంపై గురువారం ఇక్కడ రక్షణ శాఖ నిర్వహించిన తుది ఎంపిక సమావేశంలో అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, సమాచార శాఖ అధికారులు, ఆర్టిస్టులు పాల్గొన్నారు. అయితే ఎంపికపై రక్షణ శాఖ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే బతుకమ్మ పండుగ, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర, వేయి స్తంభాల గుడి థీమ్‌తో ఈ శకటం ఆకట్టుకుంటోంది. -
రిపబ్లిక్ వేడుకలకు తెలంగాణ శకటం
న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకలకు తెలంగాణ శకట ప్రదర్శనకు రక్షణ శాఖ అనుమతి లభించింది. ఈ మేరకు రక్షణ శాఖ... రాష్ట్రప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శకటం తొలిసారిగా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొననుంది. ఏటా రిపబ్లిక్ దినోత్సవాల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేకతలను శకటాల రూపంలో ప్రదర్శించడం ఆనవాయితీ. బతుకమ్మ, తెలంగాణ బోనం, గోల్కొండ కోట ప్రతిబింబించేలా తెలంగాణ శకటం ఉండనుంది. ఈ తరహాలోనే ఈ సంవత్సరం తెలంగాణ తరఫున సమాచారశాఖ నుంచి ఓ అధికారి, ఓ ఆర్టిస్టు ఢిల్లీలో జరిగిన రెండు సమావేశాల్లో పాల్గొని డిజైన్‌పై వివరాలు ఇచ్చారు. దానికి రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ఎంపీ జితేందర్ రెడ్డి...కృతజ్ఞతలు తెలిపారు.