breaking news
Tango Dance
-
లెట్స్ డూ ట్యాంగో
కత్తి యుద్ధం నేర్చుకోవాలా? గుర్రపు స్వారీ నేర్చుకోవాలా? బస్తీ మే సవాల్.. నేర్చేసుకుంటా అంటూ ‘బాహుబలి’ సినిమా కోసం తమన్నా ఆ రెంటిలో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు మరో చాలెంజ్‌కి రెడీ అయ్యారు. అయితే ఈసారి ఫైట్ కోసం కాదండి. సాంగ్ కోసం. తమన్నా ఓ కొత్త డాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ తెగ శ్రమిస్తున్నారట. చిన్న చిన్న గాయాలు కూడా చేసుకున్నారట. తమన్నాను ఇంతలా ఇబ్బంది పెడుతున్న డాన్స్ పేరేంటంటే ‘ట్యాంగో’. ఈ ట్యాంగో డాన్స్ ఏంటా అనుకుంటున్నారా? పార్టనర్స్‌తో కలిసి చేసే డ్యాన్స్‌ను ట్యాంగో డాన్స్ అంటారు. కొంచెం జిమ్నాస్టిక్స్ టచ్ డ్యాన్స్‌లో కనిపిస్తుంది. అమెరికన్, యూరోపియన్ కంట్రీస్‌లో ఈ డాన్స్ బాగా ఫేమస్. ఏ సినిమా కోసం తమ్మూ నేర్చుకుంటున్నారంటే.. కల్యాణ్ రామ్ హీరోగా ‘180’ ఫేమ్ జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నా నువ్వే’. ఈ సినిమా కోసమే ట్యాంగో డాన్స్ నేర్చుకుంటున్నారు తమన్నా. సినిమాలో వచ్చే ఓ ప్రత్యేకమైన సాంగ్ కోసం నృత్య దర్శకురాలు బృంద ఆధ్వర్యంలో తమన్నా ప్రాక్టీస్ చేస్తున్నారట. ‘‘ట్యాంగో డాన్స్‌ను తొలిసారి ప్రయత్నిస్తున్నాను. అనుకున్నంత సులువుగా ఏం లేదు. ప్రాక్టీస్‌లో చిన్న చిన్న గాయాలు కూడా చేసుకున్నాను. కానీ బృందా మాస్టర్ హెల్ప్ వల్ల ఈ డ్యాన్స్ స్టైల్‌ను నేర్చుకోగలిగాను’’ అని తమన్నా పేర్కొన్నారు. -
ఒబామా టాంగో డ్యాన్స్ అదుర్స్!
అర్జెంటీనాలో పర్యటన బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ఒబామా దంపతులు జోరుగా హుషారుగా డాన్సులతో అదరగొట్టారు. పాశ్యాత్య నృత్యాల్లో సూపర్ డాన్స్‌గా పేరున్న టాంగో డ్యాన్స్‌తో ఒబామా, మిషెల్‌లు అక్కడి టాంగో కళాకారులతో స్టెప్పులు వేస్తూ హుషారెత్తించారు. అర్జెంటీనా డ్యాన్సర్ మోరా గాడోయ్తో కలసి ఒబామా నృత్యం చేశారు. ఈ డ్యాన్స్‌కు అర్జెంటీనా ప్రతిని ధులు ఫిదా అయిపోయారు. అర్జెంటీనా సంప్రదాయ పానీయమైన ‘మేట్’ తాను తొలిసారిగా రుచిచూశానని, అర్జెం టీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని కలుసుకునేందుకు యత్నిస్తున్నానని ఆయన చమత్కరించారు. జార్జ్ లూయిస్ బోర్జెస్, జూలియో కొర్టాజర్ వంటి అర్జెంటీనా రచయితల పుస్తకాల్ని చదివానన్నారు. ఆ దేశ ప్రతినిధులు ఇచ్చిన విందులో ఒబామా పాల్గొన్నారు. అంతకుముందు అర్జెంటీనాలో పర్యటనలో భాగంగా ఒబామా ‘డర్టీవార్’పై ప్రసంగింస్తూ తన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. అర్జెంటీనాలో అమెరికా మద్దతుతో జరిగిన ‘డర్టీవార్’లో చనిపోయిన వారి జ్ఞాపకార్థం నిర్మించిన బ్యూనస్ఎయిర్స్ సమీపంలోని ‘పరాగ్వే డె లా’ను బుధవారం ఒబామా సందర్శించారు. ఈ సందర్భంగా ‘డర్టీవార్’లో అమెరికా పోషించిన పాత్ర గురించి ఆయన మాట్లాడారు. 1976-1983 మధ్యకాలంలో జరిగిన డర్టీవార్లో అర్జెంటీనాకు చెందిన 30 వేలమంది కనిపించకుండా పోయారు. ‘డర్టీవార్’ఘటనల పట్ల సామరస్యాన్ని పాటించాలని.. ఇరుదేశాలమధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని కాంక్షించారు. డర్టీవార్కు సంబంధించిన రహ స్య నివేదికల్ని వెల్లడించేందుకు ఒబామా అంగీకరించారు. ఈ సందర్భంగా అర్జెంటీనా అధ్యక్షుడు మార్షియో మాక్రి ‘మేమంతా డర్టీవార్ వెనుక ఉన్నటువంటి అసలు నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా’మన్నారు.