breaking news
tadipari
-
‘తాడిపత్రిలోని పోలీసు స్టేషన్లకు జేసీ స్టేషన్లు అని పెట్టండి’
సాక్షి, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాడిపత్రి అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. తాడిపత్రిలోని పోలీసు స్టేషన్లకు జేసీ స్టేషన్లు అని పేరు పెట్టండి అంటూ నిప్పులు చెరిగారు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గోవా లిక్కర్ అక్రమ సరఫరాపై వైఎస్సార్సీపీ నేతలతో ఓ కమిటీ వేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు.. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్‌లతో ఓ కమిటీ వేయండి. తాడిపత్రిలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ మద్యం, గంజాయి, పేకాటపై విచారణ చేయాలి. తాడిపత్రి పోలీసు స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.. ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు?. తాడిపత్రిలోని పోలీసు స్టేషన్లకు జేసీ స్టేషన్లు అని పేరు పెట్టండి. అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో అన్నింటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు పెడితే సరిపోతుంది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డిని గ్యాంగ్ స్టర్లా తయారు చేశారు. 24 మంది వైఎస్సార్సీపీ నేతలను అంతం చేస్తామని అస్మిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. దీనిపై సాక్షాత్తూ ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తాడిపత్రిలో వివాహ వేడుకలకు హాజరుకావాలంటే జేసీ అనుమతి కావాలా?. తాడిపత్రిలో పోలీసుల ప్రేక్షక పాత్ర దేనికి సంకేతం?.ఇది కూడా చదవండి: వచ్చే మంగళవారం బాబు సర్కార్ మళ్లీ అప్పు.. గోవా లిక్కర్ కేసులో జేసీ తయారు చేసిన మార్ఫింగ్ ఫొటోలపై చర్యలు తీసుకోరా?. జేసీ అరాచకాలపై కలెక్టర్, ఎస్పీ ఎందుకు మౌనంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీకి వత్తాసు పలికిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. జేసీపై ఉన్న కేసులన్నీ జేసీ ట్రావెల్స్ చీటింగ్, క్రిమినల్ కేసులే. ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్క్రాప్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించిన ఘనుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
తాడిపత్రిలో టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేతలు రెచ్చిపోయి బరితెగింపు చర్యలకు దిగారు. ఇందులో భాగంగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కేసులో ఇరికించేందుకు మార్ఫింగ్ ఫొటోలను విడుదల చేశారు. ఓ కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని పెద్దారెడ్డి అనుచరుడిగా కుట్ర చేస్తూ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.వివరాల మేరకు.. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం తాడిపత్రిలో 400 బాటిళ్ల గోవా లిక్కర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పుట్లూరు మండలం చింతలపల్లికి చెందిన రామాంజినేయరెడ్డి అనుమానితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అనుమానితుడిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచురుడిగా చూపించేందుకు పచ్చ నేతలు కుట్రకు తెరలేపారు. నిందితుడు.. పెద్దారెడ్డి పక్కనే ఉన్నట్టుగా జేసీ వర్గీయులు ఫొటో క్రియేట్ చేశారు. అనంతరం, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.అయితే, పచ్చ నేతల కుట్రలకు వైఎస్సార్సీపీ చెక్ పెట్టింది. దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోను తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్త స్థానంలో మరో వ్యక్తి ఫోటో మార్ఫింగ్ చేసి.. పెద్దారెడ్డిపై దుష్ప్రచారం చేసినట్టు ఆధారాలు చూపించింది. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేతల మార్ఫింగ్ వ్యవహారంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
తాడిపత్రిలో సడలిన ఉద్రిక్తత
తాడిపత్రి: వినాయక నిమజ్జనం సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడలోని ప్రభోదానంద ఆశ్రమం వద్ద హింసాత్మక ఘటనలతో నెలకొన్న ఉద్రిక్తత సోమవారం అదుపులోకి వచ్చింది. శాంతిభద్రతల అదనపు డీజీ హరీష్‌కుమార్‌గుప్తా, ఐజీ రవిశంకర్ అయ్యర్, ఆక్టోపస్ డీఎస్పీ రాధతోపాటు ఆక్టోపస్ బృందాలు, ప్రత్యేక పోలీసు బలగాలు ఆదివారం అర్ధరాత్రి ఆశ్రమం వద్దకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఆశ్రమం వద్దకు వచ్చిన కలెక్టర్ వీరపాండియన్, అధికారుల బృందం ఆశ్రమంలోకి వెళ్లి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని కోరడంతో భక్తులు శాంతించారు. అనంతరం 20 బస్సుల్లో 500 మంది భక్తులను స్వస్థలాలకు తలించారు. శాంతిభద్రతల సమస్య అదుపులోకి వచ్చిందని కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక నిఘా తో పాటు ఆశ్రమానికి పారా మిలటరీ బలగాలతో గట్టి భద్రత కల్పిస్తామన్నారు. అంతకుముందు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. భక్తులను బలవంతంగా తరలించొద్దు: హైకోర్టు ప్రబోధాశ్రమంలో ఉన్న భక్తులను బలవంతంగా తరలించరాదని ఉమ్మడి హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆశ్రమంతోపాటు ఆశ్రమ నిర్వాహకులకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. చిన్నపొలమడ ఘటనలో సీఐ, ఎస్ఐ సస్పెన్షన్? చిన్నపొలమడలో చోటు చేసుకున్న ఘర్షణలకు బాధ్యులను చేస్తూ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, రూరల్ ఎస్ఐ రామకృష్ణారెడ్డిలను సస్పెండ్‌చేస్తూ సీమ రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిసింది. నిమజ్జనం సందర్భంగా వీఆర్‌లో ఉన్న సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి బందోబస్తు నిమిత్తం చిన్నపొలమడకు వెళ్లారు. గతంలో జరిగిన సంఘటలను అంచనా వేయలేక ఆశ్రమం ముందు ఊరేగింపునకు అనుమతివ్వడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో జేసీ అనుచరులు ఆశ్రమంపైకి రాళ్లు రువ్వుతున్నా నిలువరించలేకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమైందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆ ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
తాడిపత్రిరూరల్: పట్టణంలోని పుట్లూరు రోడ్డు రైల్వే గేటు సమీపంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి (58) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రూరల్ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు నల్లప్యాంటు, కలర్ అంగీ ధరించాడు. అనారోగ్యంతో మృతి చెందాడా.. లేక ఏమైన కారణాలు ఉన్నాయా.. అన్నది తెలియరాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


