breaking news
sunkara
-
రాజ్ తరుణ్ కోసం నిరాహార దీక్ష
-
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడు అరెస్ట్
అనంతపురం: హైదరాబాద్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడును అరెస్ట్ చేశారు పోలీసులు. గుంతకల్లుకు చెందిన ఆకుల వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ కేసులో సుంకర ప్రసాద్ నాయుడుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడి నుంచి ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రసాద్ నాయుడితో పాటు మరో 15మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు పోలీసులు. వారికి చెందిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడినట్లు సుంకర ప్రసాద్ నాయుడు గ్యాంగ్‌పై కేసులు ఉన్నాయి. ఇటీవలే ఆకుల వ్యాపారి వెంకటేష్‌ను కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు ప్రసాద్ గ్యాంగ్. ఈ క్రిమినల్ గ్యాంగ్‌ను స్వయంగా విచారించారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప. ఇదీ చదవండి: డామిట్.. కథ అడ్డం తిరిగింది -
డా.సుంకరకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక న్యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా ఇచ్చే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఈ ఏడాది హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డా.సుంకర బాలపరమేశ్వరరావు ఎంపికయ్యారు. ఈ నెల 17వ తేదీ నుంచి హెచ్ఐసీసీలో జరిగే న్యూరో సర్జన్ల సదస్సులో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేయనున్నారు.