breaking news
stolen credit card
-
క్రెడిట్ కార్డ్ చోరీకి గురైందా? నష్టానికి బాధ్యులెవరు?
షాపింగ్, చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్ వినియోగం ఎంతగా పెరిగిందో.. అదే స్థాయిలో సైబర్ నేరాలు, కార్డుల దుర్వినియోగం సవాళ్లుగా మారుతున్నాయి. క్రెడిట్ కార్డ్ పోయినా లేదా చోరీకి గురై దాని ద్వారా మోసగాళ్లు లావాదేవీలు నిర్వహిస్తే ఆ ఆర్థిక నష్టాన్ని ఎవరు భరించాలి? వినియోగదారుడికి ఆ సొమ్ము తిరిగి వస్తుందా? దీనిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టమైన మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది.సమయమే ప్రధానంఆర్బీఐ నిబంధనల ప్రకారం, అనధికారిక లావాదేవీ జరిగినప్పుడు మీరు ఎంత వేగంగా నివేదిస్తారనే దానిపైనే మీ ఆర్థిక రక్షణ ఆధారపడి ఉంటుంది. సమాచారం అందుకున్న మూడు పనిదినాల్లోపు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే వినియోగదారుడిపై ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. మొత్తం నష్టాన్ని బ్యాంకే భరిస్తుంది. బ్యాంకు లోపం లేదా థర్డ్ పార్టీ వ్యవస్థల్లో భద్రతా వైఫల్యం వల్ల జరిగే మోసాలకు కూడా ఇది వర్తిస్తుంది.ఫిర్యాదు చేయడంలో నాలుగు నుంచి 7 పనిదినాల ఆలస్యమైతే రూ.5,000 నుంచి రూ.25,000 వరకు (కార్డ్ పరిమితి ఆధారంగా) వినియోగదారుడే భరించాల్సి రావచ్చు.ఏడు రోజులు దాటిన తర్వాత ఫిర్యాదు చేస్తే సదరు బ్యాంకు బోర్డు ఆమోదించిన నిబంధనల ప్రకారమే నిర్ణయం ఉంటుంది. అలాగే, పిన్ లేదా ఓటీపీ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల మోసం జరిగితే ఫిర్యాదు చేసేవరకు జరిగిన నష్టానికి కార్డ్హోల్డరే పూర్తి బాధ్యత వహించాలి.10 రోజుల్లో డబ్బులు వెనక్కివినియోగదారుడు అనధికార లావాదేవీపై అధికారికంగా ఫిర్యాదు చేసిన పది పనిదినాల్లోపు సదరు మొత్తాన్ని (ప్రొవిజనల్ క్రెడిట్) తాత్కాలికంగా ఖాతాలో జమ చేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది.వెంటనే చేయాల్సిన పనులుకార్డ్ పోయినట్లు గుర్తించిన వెంటనే బ్యాంక్ యాప్ లేదా కస్టమర్ కేర్ ద్వారా కార్డ్‌ను బ్లాక్ చేయాలి. ఫిర్యాదు సమయం సక్రమంగా నమోదయ్యేలా ఈమెయిల్ లేదా రాతపూర్వక కంప్లైంట్ ఇచ్చి ట్రాకింగ్ నంబర్‌ను భద్రపరుచుకోవాలి. సమయస్ఫూర్తితో స్పందిస్తేనే క్రెడిట్ కార్డ్ మోసాల వల్ల కలిగే ఆర్థిక నష్టం నుంచి కాపాడుకోవచ్చు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
కార్డు కాజేశారు... క్యాష్ డ్రా చేశారు...
రణస్థలం : ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడంలో సహాయం చేసినట్లు నటించి ఏటీఎం కార్డు తస్కరించిన ఓ ఆగంతకుడు సదరు వ్యక్తి ఖాతా నుంచి రూ.1.89 లక్షలు విత్‌డ్రా చేశాడు. విషయం తెలిసి బాధితుడు లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకి వెళితే... లావేరు మండలం లింగాలవలసకి చెందిన లుకలాపు అప్పలనాయుడికి రణస్థలంలోని ఎస్బీఐలో 32033222913 నంబరుతో ఖాతా ఉంది. సంకిలి సుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేయడంతో ఆ సంస్థ యాజమాన్యం అప్పలనాయుడు ఖాతాలో ఈ నెల 3న రూ.2 లక్షలు జమచేసింది. అదేరోజున అప్పలనాయుడు డబ్బులు తీసుకోడానికి రణస్థలంలోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లాడు. ఏటీఎంలో కార్డు పెట్టినా డబ్బులు రాకపోవడంతో పక్కనే ఉన్న గుర్తుతెలియని వ్యక్తి సహాయం తీసుకున్నాడు. మూడు విడతలుగా రూ.35 వేలు తీసుకున్న తర్వాత ఆగంతుకుడు అప్పలనాయుడుకు వేరొకరి ఏటీఎం కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిని అప్పలనాయుడు కూడా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బలు అవసరమై ఏటీఎంకు వెళ్లగా డబ్బులు రాకపోవడంతో అప్పలనాయుడు బ్యాంకు అధికారులను సంప్రదించగా కార్డు టిబిక్రమ్ ప్రధాన్‌ది అని చెప్పడంతో మోసపోయానని గుర్తించాడు. ఖాతాలో నిల్వ ఎంత ఉన్నదీ వాకబుచేయగా రూ. 2 లక్షలకు 71 మాత్రమే ఉండడంతో విస్తుపోయిన అప్పలనాయుడు శుక్రవారం రణస్థలం పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్పై ఎల్.సన్యాసినాయుడు బ్యాంకుకు వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్‌లో ఆగంతుకుడి ఆనవాళ్లు గమనించారు. అప్పలనాయుడి నుంచి ఏటీఎం కార్డు తస్కరించిన వ్యక్తి 3వ తేదీన కోస్టలోని ఏటీఎం నుంచి రూ.5 వేలు తీసుకోవడమేకాకుండా మహాబీర్ ప్రధాన్ అనే వ్యక్తి ఖాతాకి రూ.20 వేలు బదిలీ చేశాడు. 4వ తేదీన ఒడిశా రాష్ట్రం జైపూర్‌లోని హోటల్ ప్రిన్స్ ఏటీఎం నుంచి రూ.40 వేలు, 5న కోరియా బైపాస్ దికానా ఏటీఎం నుంచి మూడు విడతల్లో రూ.35 వేలు డ్రా చేశాడు. అలాగే మహాబీర్ ప్రధాన్ ఖాతాకి మరోకసారి రూ.20 వేలు బదిలీ చేశాడు. 6న చండోల్ ఏటీఎం నుంచి రూ.30 వేలు, 7న జైపూర్ ఏటీఎం నుంచి రూ.3 వేలు డ్రా చేశాడు. మొత్తంమీద 3వ తేదీ నంచి 7వ తేదీ వరకూ అప్పలనాయుడి ఖాతా నుంచి రూ.1.89 లక్షలు డ్రాచేశాడు. ఒకే ఖాతాకు రెండుసార్లు నగదు బదిలీ చేసినందుకు నిందితుడు దొరికిపోతాడని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.


