breaking news
St.anns College
-
అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడవాలి
అనంతపురం రూరల్ : అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థీ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం రూరల్ మండల పరిధిలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో జిల్లా స్థాయి విద్య,వైజ్ఞానిక ప్రదర్శన–2016ను జిల్లా విద్యాధికారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సునీత మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా సైన్స్ ఫేర్– ఇన్స్పేర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేటి భవిష్యత్ మొత్తం సైన్స్ పైనే ఆధారపడి ఉందన్నారు. ప్రపంచ దేశాల మానవాళి అభివృద్ధికి ఉపయోగపడే నూతన నమూనాలను ఆవిష్కరించాలన్నారు. జాయింట్ కలెక్టర్–2 ఖాజామొహిద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే ప్రశ్నించే తత్వాన్ని ఆలవర్చుకోవాలన్నారు. అప్పుడే అన్ని రంగాల్లో రాణించే ఆవకాశం ఉందన్నారు. ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ సైన్స్ అంటే మార్కులు కాదన్నారు. ప్రయోగాలు లేని సైన్స్‌లో 100కి 99 మార్కులు వచ్చిన వ్యర్థమేనన్నారు. జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ పూర్వకాలంలోనే తమకు కావాల్సిన పరికరాలను వారే తయారు చేసుకుని వాడుకునే వారన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. జిల్లా విద్యాధికారి శామ్యూల్ మాట్లాడుతూ 2011 నుంచి ఇప్పటి వరకు సైన్స్ ఫేర్ కార్యక్రమాలు నిరవధికంగా కొనసాగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 652 ఎగ్జిబిట్లు సైన్స్ ఫేర్‌కు వచ్చాయన్నారు. విద్యార్థుల్లో దాగిన నైపుణ్యాలను గుర్తిస్తూ ఏటా సైన్స్ ఫేర్ ఆవార్డుల పేరుతో నగదు బహుమతులను ప్రభుత్వాలు అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోందన్నారు. విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొని, సైన్స్ ఫేర్‌ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్‌మొహిద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కంగ్రాట్స్ సింధు..! సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులు సంబరాలు
భారత ప్రభుత్వం క్రీడాకారులకు అందించే ప్రఖ్యాత పురస్కారమైన అర్జున అవార్డుకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు ఎంపిక కావడంతో ఆమె విద్యనభ్యసిస్తున్న మెహిదీపట్నంలోని సెయింట్‌ఆన్స్ కళాశాల అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. సంబరాల్లో మునిగితేలారు. మంగళవారం కళాశాలలోని నోటీస్‌బోర్డులో ఉన్న ఆమె పేపర్ క్లిప్పింగ్స్‌పై ‘కంగ్రాట్స్ సింధు..’, ‘గ్రేట్ సింధు..’, ‘వెల్డన్ సింధు..’ అంటూ రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమకు గర్వకారణంగా ఉందని వారివారి అభిప్రాయాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. - మెహిదీపట్నం, న్యూస్‌లైన్ రోల్ మోడల్... సింధు ఇన్ని ఘనతలు సాధించి మాలాంటి వారికి రోల్ మోడల్‌గా నిలిచింది. నా స్నేహితురాలే ఇన్ని ఘనతలు సాధించిందా అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. తన ప్రతిభకు భారత ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం సంతోషకరం. ఆమె నా స్నేహితురాలు కావడం గర్వంగా ఉంది. - సౌమ్య, సహ విద్యార్థి ప్రతిభకు చక్కటి గుర్తింపు... సింధు ప్రతిభకు భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో గుర్తింపునిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కళాశాలకు చెందిన విద్యార్థి కావడం మాకు గర్వకారణం. చిన్న వయసులో ఎంతో ఎత్తుకు ఎదిగిన సింధూ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తున్నా. మరిన్ని విజయాలు అందుకునేందుకు నా వంతు సహకారం అందిస్తా. - డాక్టర్, సిస్టర్ ఆంథోనమ్మ, ప్రిన్సిపాల్, సెయింట్ ఆన్స్ కళాశాల. క్రమశిక్షణతోనే... సింధు ఇటు చదువులో, అటు క్రీడల్లో ఎంతో క్రమశిక్షణతో మెలుగుతోంది. గర్వం లేకుండా అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ తన పని తాను చేసుకుంటుంది. నిన్న ప్రపంచ స్థాయిలో పతకం సాధించడం నేడు అర్జున అవార్డుకు ఎంపిక కావడంతో చాలా ఆనందంగా ఉంది. ఆమె మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. - విమలారెడ్డి, ఫిజికల్ డెరైక్టర్ ఫుల్ హ్యాపీ... సింధుతో నేను కళాశాలకు వచ్చిన ప్రతిసారీ బ్యాడ్మింటన్ ఆడుతా. బ్యాడ్మింటన్‌కు సంబంధించిన విషయాలు చర్చించడంతో పాటు సరదా కబుర్లు చెప్పుకుంటాం. ప్రపంచ ఛాంపియన్ టోర్నమెంట్‌కు వెళ్లేప్పుడు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పి పతకం కొట్టాలని కోరా. పతకం సాధించడంతో చాలా సంతోషించా. అంతేకాకుండా అర్జున అవార్డుకు ఎంపిక కావడం మరింత ఆనందం కలిగించింది. - ముకుంజోత్ కౌర్, సహ విద్యార్థి. సింధును అభినందించిన మంత్రి ..2013 అర్జున అవార్డుల జాబితాలో చోటు దక్కించుకున్న బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు రాష్ట్ర వుంత్రి వట్టి వసంత కువూర్ అభినందనలు తెలిపారు. దేశం గర్వించేలా భవిష్యత్తులో వురిన్ని విజయూలు సాధించాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వుంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయున కోరారు.