breaking news
St Anns Junior College
-
భవాన్స్ కాలేజీకి క్యారమ్ టైటిల్
ఓయూ ఇంటర్ కాలేజి మహిళల టోర్నీ ఎల్బీ స్టేడియం: ఓయూ ఇంటర్ కాలేజి మహిళల క్యారమ్ టోర్నీలో భవాన్స్ కాలేజి (సైనిక్‌పురి) జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. బర్కత్‌పురాలోని అవంతి కాలేజిలో జరిగిన ఫైనల్లో భవాన్స్ కాలేజి జట్టు 2-1 స్కోరుతో సెయింట్ ఆన్స్ కాలేజి (మెహిదీపట్నం) జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో వనిత కాలేజి 2-1తో వెస్లీ కాలేజి జట్టుపై గెలిచింది. సెమీఫైనల్లో భవాన్స్ జట్టు 2-1తో ఎస్ఎన్ వనిత డిగ్రీ కాలేజి జట్టుపై, సెయింట్ ఆన్స్ 2-0తో వెస్లీ కాలేజి జట్టుపై నెగ్గాయి. విజేతలకు ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ సెక్రటరీ లక్ష్మీకాంత్ రాథోడ్ ట్రోఫీలను అందజేశారు. -
సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి జయభేరి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఐఎంజీ రిలయన్స్ ఇంటర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో బాలికల లీగ్ పోటీల్లో సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి, సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి జట్లు విజయాలను సాధించాయి. బేగంపేట్‌లోని హెచ్‌పీఎస్ బాస్కెట్‌బాల్ కోర్టులో ఆదివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి జట్టు 30-22 పాయింట్ల తేడాతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) జట్టుపై విజయం సాధించింది. ప్రథమార్ధభాగం ముగిసే సమయానికి సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి జట్టు 16-12తో స్పల్ప ఆధిక్యాన్ని సాధించింది. సెయింట్ ఆన్స్ జట్టులో నిఖిత 18, శారద 10 పాయింట్లు చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు. హెచ్‌పీఎస్ జట్టులో రష్మిత 13, రమ్య 5 పాయింట్లు చేశారు. ఇతర లీగ్ మ్యాచ్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి 26-25తో సెయింట్ ఆన్స్ స్కూల్‌పై గెలిచింది. చిరెక్ పబ్లిక్ స్కూల్ 32-24తో హోలీ ప్యామిలీ స్కూల్‌పై, సెయింట్ పాయిస్ స్కూల్ 41-29తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై గెలిచాయి. బాలుర విభాగంలో హెచ్‌పీఎస్ 34-29తో డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై, సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ 32-16తో ఫ్యూచర్స్ కిడ్స్ స్కూల్ పై నెగ్గాయి.