breaking news
Sriram vegaraju
-
సాలూరి వారసుడి...సోషియో ఫ్యాంటసీ
ఆ యువకుడు మంచి సంపాదనపరుడు. చీకూ చింతా లేని అతని జీవితం చిక్కుల్లో పడుతుంది. తన సమస్యలతో పాటు ఇతరుల సమస్యలను పరిష్కరిస్తాడు.ఆ యువకుడు ఎందుకు సమస్యల్లో పడతాడు? ఆ సమస్యలేంటి? అనే అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘ఓరి దేవుడోయ్’. ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు మనుమడు, సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరు కథానాయకునిగా శ్రీరామ్ వేగరాజు దర్శకత్వంలో ఛేజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్.వి నిర్మించారు. మదిరాక్షి, మోనికా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఇప్పటివరకూ రాని కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొం దించాం. యువతలో సృజనాత్మకత మెండుగా ఉందనీ, వారు అనుకుంటే ఏ స్థాయికి అయినా చేరుకోగలరని చెప్పే చిత్రం ఇది. రాజీవ్ అద్భుతంగా నటిం చాడు. కోటిగారు స్వరపరచిన పాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలు స్తాయి. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు. సుమన్, తనికెళ్ల భరణి, సీనియర్ నరేశ్, ఎల్బీ శ్రీరామ్, కొండవలస తదితరలు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రతాప్ కుమార్, మాటలు: చేబియ్యం శ్రీనివాసన్ , సహనిర్మాత: మాధురి వేగరాజు. -
ఓరి దేవుడో మూవీ స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్
-
'ఓరి దేవుడోయ్' మూవీ స్టిల్స్ మరియు పోస్టర్స్
-
'ఓరి దేవుడోయ్' మూవీ పోస్టర్స్