breaking news
Srinugadi Love Story
-
శీనుగాడి ప్రేమలో..!
తెలుగు తెరపై నయనతార కనిపించి సరిగ్గా ఏడాది అయ్యింది. ఈ మలయాళ మందారం నటించిన ‘అనామిక’ గత ఏడాది విడుదలైంది. ఆ చిత్రం తర్వాత నయనతార తెలుగులో సినిమాలు అంగీకరించలేదు. ప్రస్తుతం తమిళంలో నాలుగైదు చిత్రాలు చేస్తున్నారామె. అయినప్పటికీ ఇప్పుడు తెలుగు తెరపై కనిపించనున్నారు. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన ఆమె కథానాయికగా నటించిన ‘ఇదు కదిరవేలన్ కాదల్’ చిత్రం తెలుగులోకి అనువాదమైంది. భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘శీనుగాడి లవ్‌స్టోరి’ పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఎస్.ఆర్ ప్రభాకరన్ దర్శకుడు. ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమకథా చిత్రాలను ఆదరించే ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం అలరిస్తుంది. నయనతార అభిమానులకు ఈ చిత్రం ఓ పండగలా ఉంటుంది. సంతానం కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జయరాజ్, సమర్పణ: రెడ్ జైంట్. -
‘శీనుగాడి లవ్‌స్టోరీ’ మూవీ స్టిల్స్