breaking news
sports officers
-
యూపీఎస్సీ ఉద్యోగాలు.. ఆన్లైన్లో దరఖాస్తులు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 59 ► పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఇంజనీర్–12, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్–02, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్–09, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్–01, అసిస్టెంట్ సర్వే ఆఫీసర్–04, స్టోర్స్ ఆఫీసర్–01,అసిస్టెంట్ డైరెక్టర్–30. ► విభాగాలు: నావల్ క్వాలిటీ అష్యూరెన్స్, నేవీ, జియోలాజికల్ సర్వే, ఎకనమిక్ ఇన్వెస్టిగేషన్. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 30ఏళ్లు, 35ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 14.10.2021 ► వెబ్సైట్: upsconline.nic.in శాయ్లో 12 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్).. అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► అర్హత: 2019లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు అర్హులు. ► వయసు: 01.08.2019 నాటికి 32ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: యూపీఎస్సీ మార్కులు, క్రీడా విజయాలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.10.2021 ► వెబ్సైట్: sportsauthorityofindia.nic.in -
‘శాప్’ వేసవి శిక్షణ షురూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ హడావుడి ముగియడంతో స్పోర్ట్స్ అధికారులు ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరాలపై దృష్టిపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ, తదుపరి సామాగ్రి బట్వాడా కోసం నగరంలోని వివిధ స్టేడియాల్ని వినియోగించుకోవడంతో ఈ ఏడాది శిక్షణ శిబిరాలు కాస్త ఆలస్యమయ్యాయి. దీంతో ఓటింగ్ ముగిసిన మరుసటి రోజునే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) సికింద్రాబాద్లోని జింఖానా స్టేడియంలో గురువారం ఫుట్బాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది. అండర్-16 బాలబాలికలకు సీనియర్ కోచ్ అలీమ్ ఖాన్ నేతృత్వంలో శిక్షణ ఇస్తున్నారు. తొలి రోజు సుమారు 150 మంది బాలబాలికలు ఈ శిబిరంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాదాపు నెల రోజులకు పైగా జరిగే ఈ శిబిరంలో రాబోయే రోజుల్లో శిక్షణకు వచ్చే బాలబాలికల సంఖ్య పెరుగుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గత నెలలో ప్రారంభం కావాల్సిన వార్షిక వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు కూడా త్వరలోనే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.