breaking news
Special Cell of Delhi Police
-
దద్దరిల్లిన దక్షిణ ఢిల్లీ..
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ భేరీ ప్రాంతం శనివారం మధ్యాహ్నం కాల్పులతో దద్దరిల్లింది. కరుడుగట్టిన నేరస్థుడు రాజేష్ భార్తీ, అతని ముగ్గురు అనుచరులను ప్రత్యేక పోలీసు దళం కాల్చి చంపింది. ఢిల్లీ, చుట్టు పక్కల రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న రాజేష్ చత్తర్‌పూర్ ప్రాంతంలో మరో నేరం చేయబోతున్నాడనే సమాచారంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఫతేపూర్ భేరీ ప్రాంతంలో పాగా వేసింది. అయితే, తమ రాకను పసిగట్టిన రాజేష్ గ్యాంగ్ కాల్పులకు దిగిందని పోలీసులు తెలిపారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు చేయడంతో రాజేష్‌తో పాటు అతని ముగ్గురు అనుచరులు హతమయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, ఓ కేసులో హరియాణాలో అరెస్టయిన రాజేష్ ఇటీవలే పోలీసు కస్టడీ నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి తలపై గతంలో నగర పోలీసు కమిషనర్ లక్ష రూపాయల రివార్డు ప్రకటించడం విశేషం. -
12 మంది 'ఉగ్ర' అనుమానితుల అరెస్ట్
ఢిల్లీ: 12 మంది ఉగ్ర అనుమానితులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి జైషే ఈ మొహమ్మద్ తీవ్రవాద గ్రూపుతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలీజెన్స్ సమాచారం రావడంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ వెలుపల, నైరుతి ఢిల్లీలో జరిపిన ఈ దాడుల్లో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి దగ్గర నుంచి బాంబు తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. -
ఎవరీ గోపీ?
ఢిల్లీ డ్రగ్ ముఠా విచారణలో వెలుగులోకి హైదరాబాదీగా అక్కడి పోలీసుల అనుమానం దర్యాప్తు చేస్తున్న స్పెషల్ సెల్ అధికారులు సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సోమవారం గుట్టురట్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ కేసు దర్యాప్తులో దక్షిణాది కీలకంగా మారింది. ముఠాలో కీలక వ్యక్తిగా అనుమానిస్తున్న గోపి హైదరాబాదీగా అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద చర్యలకు అవసరమైన నిధుల సమీకరణకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ డ్రగ్స్ దందా ప్రారంభించింది. దుబాయ్‌లో ఉంటున్న అలీ దీన్ని నిర్వహిస్తున్నాడు. అతను ఆర్డర్ చేసిన మేరకు పాక్‌లోని అబోటాబాద్‌లో ఉంటున్న హిజ్బుల్ కమాండర్ ఫయాజ్ అలియాస్ తన్వీర్ అలియాస్ షంషేర్ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్ మీదుగా డ్రగ్స్ పంపుతున్నాడు. సరిహద్దులు దాటించడంలో జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగంలోని కానిస్టేబుల్ ఖుర్షీద్ ఆలం కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలా భారత్‌లోకి చేరుకున్న డ్రగ్స్‌ను ఇదే ముఠాకు చెందిన బి.గణేష్, ఎం.సెంథిల్ (తమిళనాడు వాసులు) దక్షిణాదికి తెస్తున్నారు. ఇక్కడ ఉండే గోపి ద్వారా విక్రయిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో వలసపన్నిన స్పెషల్ సెల్ పోలీసులు ఖుర్షీద్, గణేష్, సెంథిల్లను అరెస్టు చేసి రూ.35 కోట్ల విలువైన 10 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గోపి పేరు వెలుగులోకి వచ్చినా... అతను తరచు తమిళనాడుకు వచ్చి ‘మాల్’ తీసుకునే వాడని, వివరాలను గోప్యంగా ఉంచాడని వెల్లడైంది. ప్రాథమిక ఆధారాలతో పాటు మరికొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు.. గోపి హైదరాబాద్‌కు చెందిన వాడని అనుమానిస్తున్నారు. మరికొన్ని వివరాల సేకరణకు త్వరలోనే నగరానికి ప్రత్యేక బృందాన్ని పంపనున్నారు. సిటీలో గడిచిన మూడేళ్లుగా పట్టుబడిన డ్రగ్ రాకెట్లు, ప్రమేయం ఉన్న వ్యక్తులు, పరారీలో ఉన్న వారి వివరాలను ఇక్కడి పోలీసుల నుంచి సేకరించాలని ఢిల్లీ స్పెషల్ సెల్ నిర్ణయించిందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు.