breaking news
softball team elect
-
ఎస్కేయూ సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక
ఎస్కేయూ : ఆలిండియా ఇంటర్ వర్సిటీ, సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ సాఫ్ట్బాల్ టోర్నీలు చెన్నైలోని ఎంజీ యూనివర్సిటీలో ఈనెల 28 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఇందులో ప్రాతినిధ్యం వహించే ఎస్కేయూ సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేసినట్లు వర్సీటీ క్రీడా కార్యదర్శి డాక్టర్ బి.జెస్సీ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు : ఈ. మహేష్ , ఏ.శ్యాం, ఎం.చిరంజీవి, ఎం. మహేంద్ర (ఎస్కేయూ క్యాంపస్ కళాశాల), సి. నాగేంద్ర, టి. శివరాజు, ఎం. జగదీష్ (ఎస్ఎస్బీఎన్ కళాశాల), కే. కార్తీక్, కుళ్లాయి స్వామి, డి. అనిల్ కుమార్ (ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుంతకల్లు), బి.కార్తీక్ (ఆర్ఐఏఎస్ డిగ్రీ కళాశాల, అనంతపురం), వై.మల్లికార్జున, బి.రాజశేఖర్ ( ఆర్ట్స్ కళాశాల, అనంతపురం), కే.లోకేష్ (పీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెనుకొండ), టి.సుధీర్ కుమార్ రెడ్డి (పీఆర్ఆర్, గుత్తి ). -
23న జిల్లా సాఫ్ట్బాల్ జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 23న ఆర్డీటీ స్టేడియంలో జిల్లా సాఫ్ట్బాల్ పురుషుల, మహిళల జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు సాఫ్ట్బాల్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, వెంకటేశులు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు ఆర్డీటీ ఆధ్వర్యంలో కోచింగ్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. అనంతరం జిల్లా జట్లు గుంటూరు, మాచెర్ల జిల్లాలో జరుగు అంతర జిల్లాల పోటీలలో పాల్గోంటాయని పేర్కొన్నారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులను రాష్ట్ర సాఫ్ట్బాల్ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 3 నుంచి 8 వరకు అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని వెల్లడించారు.