breaking news
Society for Awareness and Vision on Environment
-
22న కాకినాడలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ
ప్రకృతి వ్యవసాయంపై లోతైన అవగాహన కలిగించే లక్ష్యంతో సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్(సేవ్) స్వచ్ఛంద సంస్థ ఈ నెల 22 (ఆదివారం)న కాకినాడలో రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? పెట్టుబడి, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు, రైతులు పంట దిగుబడులను మొత్తం నేరుగా అమ్ముకోకుండా కొంత మొత్తాన్ని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అమ్ముకోవడం, అధికాదాయం కోసం ప్రయత్నాలు, దేశీ విత్తనాల ఆవశ్యకత, దేశీ ఆవు విశిష్టత తదితర అంశాలపై సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు ముందుగా తమ పేర్లను ఫోన్ చేసి నమోదు చేసుకోవాలి. 86889 98047 94495 96039. వేదిక: చల్లా ఫంక్షన్ హాల్, వినాయకుని గుడి ఎదుట, విద్యుత్ నగర్, కాకినాడ. వ్యవసాయం–ప్రపంచీకరణపై 14న సదస్సు వ్యవసాయ రంగ సమస్యలు– ప్రపంచీకరణపై పునరాలోచన అనే అంశంపై ఈ నెల 14 (శనివారం) ఉ. 9 గంటల నుంచి సికింద్రాబాద్ తార్నాకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో సదస్సు అవేర్నెస్ ఇన్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో జరగనుంది. వ్యవసాయ వాణిజ్యంలో ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల ప్రభావం, సుంకాలు, ఆహార సబ్సిడీలు తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 72859 18294 -
ఆలోచింపజేసే రేపేంటి?
పర్యావరణాన్ని కాలుష్యం చేస్తే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? పాలిథిన్ కవర్ల బదులు పేవర్ కవర్లు వాడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మట్టితో చేసిన వినాయకులే ఎంతో మేలని.. ఇంకుడు గుంతలు ఉపయోగకరమని.. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆత్మహత్యలు ఉండవని అంటున్నారు సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్(సేవ్) సంస్థ ప్రతినిధులు. ప్రతి ఒక్కరూ నేల తల్లి పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు సేవ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్రాం. సేవ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన రేపేంటి? ఎంతో ఆలోచింపజేసింది. ప్రకృతి సేద్యం కోసంఅరకిలో వరి విత్తనాలు ఉచితంగా ఇవ్వనున్నామని, పేపరు బ్యాగులు, మట్టి వినాయకులు, సీడ్బాల్, ఇంటి పంటపై ఇందిరా పార్కు వద్ద శని, ఆదివారాల్లో కూడా ప్రదర్శన నిర్వహించడంతో పాటు ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తామని విజయ్రాం చెప్పారు. -దోమలగూడ