breaking news
siddharth education
-
‘లోకేష్ కనుసన్నల్లోనే భారీ అవినీతి’
-
‘లోకేష్ కనుసన్నల్లోనే భారీ అవినీతి’
విజయవాడ: సుమారు రూ.1000 కోట్ల విలువ చేసే భూములను సిద్ధార్థ విద్యాసంస్థలకు అప్పగించడం వెనక భారీ అవినీతి జరుగుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గౌతంరెడ్డి విమర్శించారు. విజయవాడలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. లోకేష్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతోందని ఆరోపించారు. అతి తక్కువ ధరకు ఈ భూములను సిద్ధార్థ సంస్థలకు అప్పగించారన్నారు. ఏడాదికి కోటి రూపాయలు వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధపడిందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీడీపీ అక్రమ సొమ్ము దాచే డెన్గా సిద్ధార్ధ విద్యాసంస్థలు ఉపయోగపడ్డాయన్నారు. అందుకు కృతజ్ఞతగా దేవాదాయభూములను నామమాత్రపు లీజుకు ప్రభుత్వం ఇచ్చిందని విమర్శించారు.