breaking news
shivalingam
-
ఆద్యంతం.. ఆసక్తికరం ఈ ఆరు రోజుల టూర్..!
మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శనం. ప్రాచీన కోటల సందర్శనం. సాంచి బౌద్ధ స్థూపం వీక్షణం. ఇండోర్ లాల్బాగ్ ప్యాలెస్. ఉజ్జయిని మహాకాలేశ్వరుడు. భోపాల్ ఆదివాసీ ఆద్యకళల నిలయం. నర్మద తీరాన అహిల్యాబాయి కోట. ఇంకా... ఇంకా ఈ టూర్లో.1వ రోజుసంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (12707) సాయంత్రం నాలుగన్నరకు కాచిగూడ స్టేషన్లో బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.2వ రోజురైలు ఉదయం 08:15 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్, ఫ్రెష్ అప్ అయిన తర్వాత రోడ్డు మార్గాన సాంచి స్థూపానికి ప్రయాణం. ఆ తర్వాత భోజేశ్వర్ మహాదేవ్ ఆలయ దర్శనం చేసుకుని తిరిగి భోపాల్‌కు రావాలి. భోపాల్‌లోని ట్రైబల్ మ్యూజియం వీక్షణం. రాత్రికి హోటల్లో బస.అశోకుడి పెళ్లి మండపం!సాంచి స్థూపం బౌద్ధ క్షేత్రాల్లో ప్రధానమైనది. మన ప్రాచీన నిర్మాణ శాస్త్ర విజ్ఞానానికి ప్రతీక. యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరానికి 45 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నాటి నిర్మాణం. ఈ చారిత్రక నిర్మాణం మౌర్య, బౌద్ధ వాస్తుశైలిల సమ్మేళనం. బుద్ధుని అవశిష్టాన్ని ప్రతిష్ఠించి నిర్మించారు. స్థూపానికి దక్షిణ ముఖ ద్వారానికి దగ్గరగా సాంచి ఆర్కియలాజికల్ మ్యూజియం ఉంది. ఇందులో నాలుగు సింహాల అశోకుని రాజముద్ర, ధర్మచక్రం ఉన్నాయి. అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత చేసిన గొప్ప నిర్మాణాల్లో ఇది ముఖ్యమైనది. ఇది అశోకుని భార్య దేవి పుట్టిన ప్రదేశం, వారి వివాహం జరిగిన ప్రదేశం కూడా ఇక్కడికి పది కిలోమీటర్ల దూరానున్న విదిశ.. రెండు వందల రూపాయల కరెన్సీ నోట్‌ను వెనక్కి తిప్పి చూడండి. సాంచిలోని బౌద్ధస్థూపం కనిపిస్తుంది.భోపాల్ మ్యూజియం – ఆదివాసీల ఆద్యకళ (ఆద్యకళా నిలయం)మధ్యప్రదేశ్‌లో నివసించే ఆదివాసీలు, వారి జీవనశైలికి ఒక మీనియేచర్ రూపమే ఈ ట్రైబల్ మ్యూజియం. ఇందులో స్థానికంగా నివసించే గోంద్, భిల్, భారియా, సహారియా, కోర్కు, కోల్, భైగా ఆదివాసీ జాతుల రోజువారీ వస్తువులు, కళాకృతులు ఉన్నాయి. ఆదిలాబాద్‌లోని ఆదివాసీలు తయారు చేసే ఢోక్రా శైలి ఇత్తడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఆదివాసీలు ధాన్యం నిల్వచేసుకోవడానికి అడవిలోని చెట్ల తీగలతో అల్లిన పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి.భోజ్‌పూర్ ఈశ్వరుడుభోజేశ్వర మందిరం... ఉన్న ప్రదేశం పేరు భోజ్‌పుర్. ఇది చిన్న గ్రామం. పారమార రాజు భోజుడు నిర్మించిన ఆలయం ఇది. అయితే ఇక్కడ ఆలయ నిర్మాణం పూర్తయినట్లు కనిపించదు. అర్ధంతరంగా ఆగి΄ోయిందా లేక నిర్మాణం విధ్వంసానికి గురైందా అనే సందేహం వస్తుంది. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడా శిల్పాల విడిభాగాలు కనిపిస్తాయి. ఆ విడిభాగాలు క్షతగాత్రాలు కాదు. ఒక పెద్ద శిల్పం ఆకారం ఉంటుంది, కానీ మెరుగులు లేక అసంపూర్తిగా కనిపిస్తుంది. బహుశా ఈ ఆలయ నిర్మాణాన్ని తలపెట్టిన తర్వాత అనుకోని కారణాలతో నిర్మాణం ఆగి΄ోయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని నిశితంగా పరిశోధించి మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇం΄ార్టెన్స్గా గుర్తించింది. ఏటా ఇక్కడ శివరాత్రి వేడుక అంబరాన్ని తాకుతుంది.3వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్, ఉజ్జయినికి ప్రయాణం. ఉజ్జయినిలో హోటల్ చెక్ ఇన్. మహాకాలేశ్వర్ ఆలయం, హర్సిద్ధి ఆలయం, మంగళ్‌నాథ్ ఆలయం, నవ్గ్రహ శని మందిర్, శ్రీచింతామన్ గణేశ్ టెంపుల్, రామ్‌ఘాట్, శ్రీగద్కాలిక టెంపుల్ దర్శనం, రాత్రికి ఉజ్జయినిలోనే బస.క్షతగాత్ర ఉజ్జయినిప్రాచీనకాలం నుంచి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇది. పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఉజ్జయిని ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగం కూడా. సతీదేవి దేహంలో పై పెదవి పడిన ప్రదేశం ఉజ్జయిని అని చెబుతారు. మహాకాలేశ్వరుడి ఆలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం లాగానే ఇది కూడా విధ్వంసాల బారిన పడిన ఆలయం. ఢిల్లీ పాలకుడు ఇల్టుట్మిష్ తన రాజ్యవిస్తరణలో భాగంగా ఉజ్జయిని మీద దండెత్తి విజయం సాధించిన సందర్భంగా ఇక్కడి ప్రాచీన ఆలయాన్ని ధ్వంసం చేశాడు. జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేసి సమీపంలోని కోటితీర్థ కుండ్‌లో విసిరివేశాడని చెబుతారు. మరాఠా రాజోద్యోగి రామచంద్ర బాబా సుఖ్తాంకర్ పునర్నిర్మాణం చేశాడు. కానీ అది కూడా జలాలుద్దీన్, అలాఉద్దీన్ ఖిల్జీల దాడికి గురైంది.ఈ శని క్షేత్రం త్రివేణీ సంగమంనవగ్రహ శని మందిర్ ఉజ్జయినికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడ క్షిప్ర, గండకి, సరస్వతి నదులు కలుస్తాయి. ఈ ప్రదేశాన్ని త్రివేణీ ఉజ్జయిని అంటారు. సాధారణంగా శివాలయం లేదా ఇతర ఆలయాల్లో నవగ్రహాల వేదిక ఉంటుంది. ఇక్కడ నవగ్రహాల కోసమే ఓ ఆలయం ఉంది.సీతమ్మ కొలిచిన గణేశుడుఈ ఆలయం ఉజ్జయినికి ఏడు కిలోమీటర్ల దూరాన ఫతేహాబాద్లో ఉంది. స్వయంభువుగా వెలిసిన ఈ గణేశుడిని కొలిస్తే మనసులోని చింతలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రామాయణ కాలంలో సీతాదేవి ఈ ప్రదేశంలో కొంతకాలం నివసించిందని, ఆ సమయంలో ఈ గణేశుడిని ప్రార్థించినదని చెబుతారు. ఇక్కడి క్షిప్రానది తీరాన రామ్‌ఘాట్ కూడా ఉంది. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్, మహేశ్వర్‌కు ప్రయాణం. అహిల్యాదేవి కోట, నర్మద ఘాట్ దర్శనం తర్వాత ఓంకారేశ్వర్‌కు ప్రయాణం. ఓంకారేశ్వర్‌లో హోటల్ లో చెక్ ఇన్ అయిన తర్వాత నడకదూరంలో ఉన్న ఆలయాలను దర్శించుకోవచ్చు. నదిలో పడవ ప్రయాణం చేయవచ్చు. రాత్రి బస ఓంకారేశ్వర్‌లో.రాతికి పూచిన పూలురాణి అహిల్యాబాయి కోట మహేశ్వర్ పట్టణంలో ఉంది. దాంతో మహేశ్వర్ కోటగా వ్యవహారంలోకి వచ్చింది. ఇది మొత్తం గ్రానైట్ స్టోన్‌తో చేసిన మరాఠా శైలి నిర్మాణం. నర్మద నది తీరాన శత్రుదుర్భేద్యంగా నిర్మించడమే కాక అత్యంత సునిశితమైన నైపుణ్యంతో నగిషీలు చెక్కారు. కోటలోని ప్యాలెస్‌ల గోడలకు చెక్కిన పూలు అప్పుడే విచ్చుకున్నట్లున్న తాజా పూల తోరణాల్లా ఉంటాయి. రాతికి పూచిన ఈ పూలు నాటి శిల్పకారుల నైపుణ్యాన్ని నేటి తరానికి తెలియచేస్తున్న ప్రతిబింబాలు. ఈ కోట స్త్రీసాధికారతకు ప్రతీక. రాణి అహిల్యాబాయ్ హోల్కర్ క్రీ.శ 1765 నుంచి 1796 వరకు మాల్వా రాజ్యాన్ని పాలించారు. ఈ కోటలో ఉన్న రాణి ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చారు. అందులో ఆమె ఆహార్యం, జీవనశైలితోపాటు పాలన రీతి కూడా కళ్లకు కడుతుంది. ఆమె వారసుడు ప్రిన్స్ రిచర్డ్ హోల్కర్ ఈ కోటలోని అహిల్యాబాయి వాడాను హెరిటేజ్ హోటల్‌గా మార్చారు. మహేశ్వరలో నర్మదాతీరాన విహరిస్తూ అనేక ఆలయాలు, చారిత్రక నిర్మాణాలను దగ్గరగా వీక్షించవచ్చు. 5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్, ప్రయాణం ఇందోర్ వైపు సాగుతుంది. ఇందోర్‌లో లాల్బాగ్ ప్యాలెస్, ఖజ్రన గణేశ్ మందిర్ దర్శనం తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు ఇందోర్ రైల్వేస్టేషన్‌కు వచ్చి ట్రైన్ నంబర్ 19301 అంబేద్కర్ నగర్– యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. ఎనిమిది గంటలకు రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.లాల్బాగ్ గులాబీల తోటఇందోర్లోని లాల్బాగ్ ప్యాలెస్ కూడా హోల్కర్ రాజవంశ నిర్మాణమే. యాభై ఏళ్ల కిందటి వరకు ఆ రాజవంశమే ఇందులో నివసించింది. ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని మ్యూజియంగా మార్చింది. ఈ ప్యాలెస్‌లోకి వెళ్లే ముందు మెయిన్ గేట్ నిశితంగా పరిశీలించాలి. యూరోపియన్ శైలిలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను తలపిస్తుంది. ఇక భవనంలోపలి గదులు కూడా ప్రాచ్య ప్రాచాత్య కలబోతగా ఉంటాయి. 76 ఎకరాల్లో విస్తరించిన ప్యాలెస్ ప్రాంగణమంతటినీ చూడడం కష్టమే. కానీ ఇరవై ఎకరాల రోజ్ గార్డెన్‌ను మిస్ కాకూడదు. అహిల్యాబాయి వాడాను ఆమె వారసుడు హోటల్‌గా మార్చాడని చెప్పుకున్నప్పుడు అతడి పేరు ప్రిన్స్ రిచర్డ్ హోల్కర్ అని చెప్పుకున్నాం. అప్పుడు కలిగిన సందేహానికి సమాధానం ఈ ప్యాలెస్‌లో లభిస్తుంది. హోల్కర్ రాజవంశానికి చెందిన తుకోజీరావ్ హోల్కర్ మూడవ భార్య అమెరికన్. పేరు నాన్సీ అన్నే మిల్లర్. తుకోజీ మరణం తర్వాత ఆమె అమెరికాకి వెళ్లిపోయారు. మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ్ దర్శన్ (ఎస్హెచ్ఆర్ 097). ఇది ఆరు రోజుల యాత్ర. భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇందోర్ ప్రదేశాలను సందర్శించవచ్చు. హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ నుంచి ట్రైన్ నంబరు 12707, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ బుధవారం సాయంత్రం నాలుగన్నరకు బయలుదేరుతుంది. ఇది వీక్లీ టూర్. కంఫర్ట్ (థర్డ్ ఏసీ)లో సింగిల్ షేరింగ్‌కి 36 వేలకు పైగా అవుతుంది. ట్విన్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 20వేలు దాటుతుంది. ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపుగా 16 వేలవుతుంది. నలుగురు నుంచి ఆరుగురు వరకు బృందంగా ప్రయాణం చేస్తే మరికొంత తగ్గుతుంది.స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో సింగిల్ షేరింగ్ సుమారు 34 వేలు, ట్విన్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి సుమారు 18 వేలవుతుంది. ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి సుమారు 14 వేలవుతుంది.టూర్ కోడ్:https://www.irctctourism.com/pacakage_descriptionpackageCode=SHR097(చదవండి: పర్యాటకుల తాకిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యే టాప్ 10 ప్రదేశాలివే..!) -
డయాబెటిస్‌ని చిటికెలో నయం చేసే గుడి.. ఎక్కడుందంటే?
భారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా. మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం. ప్రస్తుతం చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్తో బాధపడుతున్నారు. అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ దర్శనంతోనే మాయమై పోతుందట. అందుకోసం నిత్యం వేలాది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు. శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట. ఇంతకీ అది ఏ దేవుడు ఆలయం?. ఎక్కడ కొలువై ఉంది?..ఇదంతా నిజమేనా..? వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం..!.తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని నీడమంగళం సమీపంలోని కోవిల్ వెన్ని అనే గ్రామంలో ఉంది. తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి 26 కి.మీ. మీ. అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది. చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్ని అనిపిలుస్తారు. ఈ ఆలయంలో లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబేశ్వరర్‌గా, పార్వతి దేవి సౌందర నాయగిగా పూజలందుకుంటున్నారు. ఇది స్వయంభూ దేవాలయం. ఈ శివుడు చూడటానికి చెరకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు. ఒకప్పుడూ ఈ ప్రదేశం చెరకు (కరుంబు), వెన్ని(నందివర్ధనం చెట్టు) చెట్లతో కప్పబడి ఉండేదని చెబుతారు. అందుకే ఈ స్వామిని వెన్ని కరుంభేశ్వరర్ అని పిలుస్తారు.మధుమేహం ఎలా నయం అవుతుందంటే..ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు. అక్కడ చీమలు గనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయం కొలువై ఉన్న శివలింగం దాదాపు ఐదు వేల ఏళ్లనాటి పురాతనమైన లింగం. దీనిని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. నిజమేనా అంటే..?ఈ ఆలయానికి కేవలం భారతదేశం నుంచే గాక, విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడకి వచ్చి ఈ స్వామిని దర్శించుకుని మధుమేహం వ్యాధిని నయం చేసుకున్నారని కథలు కథలుగా చెబుతుంటారు. అది నిజమేనా కాదా అని పరీక్షించి మరీ తెలుసుకున్న శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడుతున్న కొందరు భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అది నిజమని నిరూపితమవ్వడంతో ఇదేలా జరుగుతుందని విస్తుపోతున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆలయాన్ని దర్శించి..మధుమేహం వ్యాధి నుంచి బయటపడండి.గమనిక: ఇది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయం. దానినే మేము ఇక్కడ వార్తగా ఇచ్చాము. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం (చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర) -
హిందువులకు అప్పగించండి: వీహెచ్‌పీ
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదును అంతకుముందున్న ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించినట్లు ఏఎస్ఐ సర్వే మరోసారి రూఢీ చేసినందున ఆ ప్రాంతాన్ని హిందువులకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కోరింది. శివలింగం లభించిన వజూ ఖానాగా చెబుతున్న చోట హిందువులకు పూజలకు అనుమతులివ్వాలని డిమాండ్ చేసింది. మసీదును హిందూ ఆలయంగా ప్రకటించాలని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. -
అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ.. భక్తులకు ఈసారి కొత్త రూల్..!
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో పాల్గొనే భక్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ ట్రాక్‌లకు ఇవాళే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ లైన్, ఆన్లైన్ ద్వారా భక్తులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 542 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే అధికారులు ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌లో కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. యాత్రలో పాల్గొనబోయే భక్తులు కచ్చితంగా ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించి వేలిముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు.. ► 13-70 ఏళ్ల భక్తులే ఈ యాత్రలో పాల్గొనేందుకు అర్హులు ► అందరూ కచ్చితంగా ఆరోగ్య ధ్రువపత్రాన్ని పొందుపర్చాలి ► ఆరు వారాలకు పైబడిన గర్భిణీలు యాత్రలో పాల్గొనడానికి అనుమతి లేదు అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలివెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: సీఎం మమత మేనల్లుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. సీబీఐ, ఈడీ విచారణపై స్టే.. -
బ్యాంకు లాకర్లో రూ.500 కోట్లు విలువ చేసే మరకత లింగం
సాక్షి, చెన్నై: తంజావూరులోని ఓ వ్యక్తి బ్యాంకు లాకర్లో రూ.500 కోట్లు విలువ చేసే పచ్చవర్ణ మరకత(ఎమరాల్డ్) లింగం బయట పడింది. తిరుక్కువలై ఆలయంలో అపహరణకు గురైన ఆ విగ్రహం లాకర్లోకి ఎలా వచ్చిందనే విషయాన్ని తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తంజావూరు అరులానందనగర్‌లోని ఓ ఇంట్లో పురాతన విగ్రహం ఉన్నట్టు చెన్నైలోని విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగానికి సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందం శుక్రవారం ఆ ఇంట్లోని అరుణా భాస్కర్‌ను ప్రశ్నించారు. తమ ఇంట్లో ఏమీ లేవని, తన తండ్రి స్వామియప్పన్ మరణించారని, అంతకుముందు ఆయన వద్ద ఉన్న మరకత లింగం బ్యాంక్ లాకర్లో ఉండొచ్చని చెప్పారు. దీంతో బృందం లాకర్‌ను తెరిచి చూశారు. అందులో పచ్చవర్ణ మరకత లింగం బయట పడింది. దీని విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. ఆ విగ్రహం మైలాడుతురై జిల్లా శీర్గాలి సమీపంలోని తిరుక్కువలై శివాలయంలో మూడేళ్ల క్రితం చోరీకి గురైనట్టు తేలింది. దీంతో అధికారులు శనివారం ఆ విగ్రహాన్ని చెన్నైలోని కార్యాలయంలో భద్రపరిచారు. -
అపురూప దృశ్యం.. ఆవిష్కృతం
నగరి (చిత్తూరు జిల్లా): నగరి మున్సిపల్ పరిధి కీళపట్టు పురాతన శ్రీచంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలోని అరుణోదయ వేళ శివలింగాన్ని సూర్యకిరణాలు తాకిన అపురూప దృశ్యం మంగళవారం సాక్షాత్కరించింది. ఉదయం 6.30 నుంచి 6.45 గంటల వరకు భానుడు తన కిరణాలతో స్వామివారిని స్పృశించాయి. ఎన్నడూ లేని విధంగా ఆలయంలోకి సూర్యకిరణాలు శివలింగం వరకు ప్రసరించడం ప్రత్యకతను సంతరించుకుంది. ఈ విషయం తెలియడంతో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చేసి ఈ దృశ్యాన్ని తిలకించి పరవశించారు. కిరణాలు ఒక మార్గంలా వెళ్లి శివలింగంపై పడుతుండడంతో ఇది మహత్యమే అంటూ దర్శించేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. ఆలయ నిర్వాహకుడు సుబ్రమణ్యంస్వామి మాట్లాడుతూ శతాబ్దాల కిందటే సూర్యకిరణాలు స్పృశించేలా తూర్పు ముఖంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోందని, పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దృశ్యాన్ని గమనించేవారు లేకపోయారన్నారు. కొన్నేళ్లుగా భక్తుల చొరవతో ఆలయం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటోందని, నిత్యపూజా కైంకర్యాలు బాగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సూర్యోదయ సమయాన్నే కిరణాలు శివలింగాన్ని స్పృశించడాన్ని వీక్షించి తరించామని వివరించారు. వారం రోజుల పాటు శివలింగాన్ని సూర్యకిరణాలు స్పృశించవచ్చని భావిస్తున్నామని తెలిపారు. శివలింగాన్ని స్పృశిస్తున్న సూర్యకిరణాలు.. చదవండి: ‘మనకు మొహమాటం ఉన్నా.. కరోనాకు లేదు’ రెచ్చిపోతున్న ఆన్లైన్ మోసగాళ్లు.. -
శివ స్రవంతి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో నివాసం ఉంటున్న రుద్ర స్రవంతి అనే శివభక్తురాలు కార్తీకమాసం ప్రారంభం రోజు నుంచి నేటి వరకు 11 వేలకు పైగా శివలింగ ప్రతిమలను తయారు చేయడం శివభక్తులకు కనువిందైన ఒక విశేషం అయింది. ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన రుద్ర స్రవంతి.. భర్త వ్యాపారం రీత్యా నాయుడుపేటలో ఉంటున్నారు. ఆమె శివభక్తురాలు. ప్రత్యేకించి శివలింగ ప్రతిమలను తయారుచేయడం కోసమే ఆమె నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు సమీపంలో బాలాజీ ఎనక్లేవ్లో నివాసం ఉంటూ గత ఐదేళ్లుగా ప్రతిమల తయారీతో శివారాధన చేస్తున్నారు. తండ్రి ప్రమాదంలో గాయపడి కోలుకున్న తరువాత ఆయన క్షేమం కోసం మరింత భక్తిభావంతో పరమశివుడిని ఆరాధిస్తున్నారు. అష్టగంధంతో శివలింగ ప్రతిమలు ఈసారి కాశీకి చెందిన ఓ ఆశ్రమ పీఠాధిపతి ఇచ్చిన అష్టగంధంతో గత నెల రోజులుగా శివలింగ ప్రతిమలను తయారు చేస్తున్నట్లు రుద్ర స్రవంతి తెలిపారు. గంధంతోపాటు పసుపు, విబూది, బంకమట్టి, పుట్టమట్టి మేళవింపుతో ప్రతిమలకు ఆమె రూపునిస్తున్నారు. ఎవరి సహాయమూ తీసుకోకుండా ఇంట్లోనే ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు రోజుకు 300 నుంచి 350 శివలింగ ప్రతిమలను తయారు చేస్తున్నారు. కార్తీక మాసమంతా ఉపవాసం ఉంటూ కేవలం ద్రవ పదార్థాలనే ఆహారంగా తీసుకుంటూ రోజుకు 12 గంటలకు పైగా శ్రమించి ప్రతిమల్ని చేస్తున్నారు. దాంతో ఇంట్లో ఎక్కడ చూసినా శివలింగ ప్రతిమలే దర్శనమిస్తున్నాయి. అంతేకాదు, ఇంటి ముఖద్వారం తెరుచుకున్న వెంటనే అనేక రుద్రాక్షలు ధరించి ఉన్న శివుడి ప్రతిమ కనిపిస్తుంది. ఆమె పూజ గదిలోనూ ఎక్కువగా శివుడు, శివలింగాల ప్రతిమలే ఉంటాయి. నేడు ప్రాణ ప్రతిష్ట ఇప్పటి వరకు పూర్తి చేసిన 11,111 శివలింగాల ప్రతిమలకు నేడు (కార్తీకమాసం చివరి సోమవారం) వేదపండితులతో ప్రత్యేక పూజలు చేయిస్తున్నట్లు రుద్ర స్రవంతి తెలిపారు. ఈ శివలింగాలను ఎవరికీ ఇచ్చేది ఉండదని, మొత్తం శివలింగాలను కలిపి మహా శివలింగం తయారు చేసి పూజలు చేసిన అనంతరం మూడు రోజుల తరువాత నవంబరు 28వ తేదీన నెల్లూరు జిల్లా పరిధిలోని మల్లాం గ్రామ సమీపంలో సముద్రతీరంలో నిమజ్జనం చేస్తామని ఆమె చెప్పారు. రుద్ర స్రవంతి తయారు చేస్తున్న ఈ శివలింగాలను రోజూ అనేక మంది భక్తులు ఇంటికి వచ్చి మరీ ఆసక్తిగా తిలకిస్తున్నారు. – ఎస్.కె.రియాజ్బాబు, సాక్షి నాయుడుపేట -
దేవరాజ సేవ్యమానం... కాలభైరవం
‘కాలుడు’ అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి మృత్యుదేవతను సైతం భయపెట్టగల మహిమాన్వితుడు శ్రీ కాలభైరవుడు. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం. తిరుమలలో ఏవిధంగా అయితే ముందుగా వరాహస్వామిని సందర్శించుకున్న తర్వాతే వేంకటేశ్వరుని పూజిస్తారో, కాశీనగరంలో కూడా అదేవిధంగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని సేవించకుండా చేసిన కాశీయాత్ర నిష్ఫలమని సాక్షాత్తూ శివుడే కాలభైరవుడికి వరమిచ్చినట్లు పురాణోక్తి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమి. ఈ సందర్భంగా కాలభైరవుడి విగ్రహం లేదా చిత్రపటానికి షోడశోపచార పూజలు చేసి, మినప గారెలను, కల్లును (మిరియాల పొడి వేయని బెల్లం పానకం కల్లుతో సమానమని శాస్త్రోక్తి) నివేదిస్తే కాలభైరవుడు ప్రసన్నుడై, గ్రహదోషాలను రూపుమాపుతాడని, కోరిన వరాలనిస్తాడని ప్రతీతి. కాలభైరవుడి పటం లభించకపోతే శివలింగం ముందు కూర్చుని, కాలభైరవ అష్టకం పఠించవచ్చు. (నేడు కాలాష్టమి) మానవాళికి గీతాధార మనిషికి మార్పు చాలా అవసరం. ఆ మార్పు బాహ్యమైనది కాదు – లోపలి మనిషికి సంబంధించినది. ముఖ్యంగా తన ప్రవర్తనలోని ఎన్నో లోపాలను చక్కదిద్దుకోవడం, ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం, సమాజానికి పనికొచ్చే విధంగా తనను తాను కొత్తగా రూపొందించుకోవడం అత్యంతావశ్యకం. ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడం, ఆలోచనలో అభివృద్ధికరమైనవాటికి ఎక్కువగా చోటుకల్పించడం, సానుకూల దృక్పథాన్ని సాధించడం, ఆత్మన్యూనతాభావాన్ని జయించడం వంటి ఎన్నో అంశాలలో పట్టు సాధించాలి. ఈ అంశాలన్నీ గీతలో కృష్ణుడు ఏనాడో అర్జునుడికి చెప్పాడు. గీతోపదేశం సందర్భంలో కృష్ణుడు అర్జునుణ్ని యుద్ధానికి సంసిద్ధుణ్ని చేశాడు. ‘‘నువ్వు గొప్ప పరాక్రమవంతుడవని లోకం కీర్తిస్తున్నది. లోకం దృష్టిలో నువ్వు చులకన కాకుండా ఉండాలంటే యుద్ధానికి సిద్ధపడాలి. నా మిత్రులు, నా బంధువులు, నా గురువులు అంటూ యుద్ధం మానేశావనుకోరు – భయం వల్ల పారిపోయావంటారు. ఈ లోకం నిన్ను చులకన చేస్తుంది. శత్రుసైన్యంలోని యోధులంతా నీలోని పరాక్రమాన్ని శంకిస్తారు. నిందిస్తారు. నీకు యుద్ధమే కర్తవ్యం’’ అంటూ అవసరమైనంత మేరకు అర్జునుణ్ణి రెచ్చగొట్టాడు శ్రీకృష్ణుడు. స్వధర్మం పేరుతో అర్జునుడి చేత కర్తవ్యాన్ని నిర్వహింపజేసిన మానసిక నిపుణుడు శ్రీకృష్ణుడు. కౌరవులను నిర్వీర్యులను చేయడంలోను శ్రీకృష్ణుడు అంతే చాతుర్యం చూపాడు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం. ముందుచూపుతో వ్యవహరించడం – వ్యూహాత్మకంగా ముందుకువెళ్లడం, ఎత్తులు వేయడం – వంటి అంశాలలో శిక్షణ ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. కోణాన్ని దృష్టిలో పెట్టుకుని గీతా జయంతి సందర్భంగా శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం ఏ స్థాయిదో, వ్యూహరచన ఎంతటిదో, ఆయన నుండి పాండవులకు అందిన స్ఫూర్తిని గ్రహించాలి. వాటి నుండి మనమూ ప్రభావితం కావాలి. మార్గశిర శుద్ధ ఏకాదశికి మోక్షదైకాదశి అని, గీతాజయంతి అనీ పేరు. ఈ వేళ గీతలో కనీసం కొన్ని శ్లోకాలనైనా పఠించి, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఫలదాయకం. (30, గురువారం గీతాజయంతి) -
శివలింగాన్ని తాకిన సూర్య కిరణాలు
జి.సిగడాం : కార్తీక శోభనాడు సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించడంతో భక్తులు పరవశించిపోయారు. ఈ అరుదైన దృశ్యం శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకయ్యపేట పంచాయతీలో ఉమారుద్ర కోటీశ్వర దేవాలయంలో దర్శనమిచ్చింది. ఆదివారం ఉదయం 6.15 గంటల నుంచి 6.45 గంటల వరకు సూర్యకిరణాలు శివలింగాన్ని స్పర్శించాయి. ఇలాంటి దృశ్యమే శ్రీకాకుళం పట్టణంలోని అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే సంగతి తెలిసిందే. ఉమారుద్ర కోటీశ్వర దేవాలయంలో సూర్యకిరణాలు ముందుగా సూర్యదేవుడు ఆలయం మీదుగా నందీశ్వర కొమ్ముల మధ్యలో అమ్మవారి, విఘ్నేశ్వర విగ్రహాన్ని తాకి అనంతరం శివలింగానికి పూర్తిస్థాయిలో స్పర్శించడం.. అద్భుతమైన దృశ్యమని భక్తులు చెప్తున్నారు. సూర్యనారాయణమూర్తి తన కిరణ స్పర్శను ఆదిదేవుడిపై ప్రసరింపచేయడం చాలా అద్భుతంగా ఉందని వేదపండితులు తెలిపారు. ఏటా కార్తీకమాసం రెండో సోమవారం, అలాగే కార్తీ మాసం ఆఖరి నాలుగు రోజల వ్యవధిలో ఈ ఆలయంలోని శివలింగాన్ని సూర్య కిరణాలు స్పర్శిస్తాయి. ఆలయం నిర్మించి పదేళ్లు అవుతున్నదని, ఏటా కార్తీక మాసంలో ఇలా సూర్యకిరణాలు పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. -
పంచమఠాల్లో రుద్రాభిషేకాలు
శ్రీశైలం: పంచమఠాల్లోని శివలింగ స్వరూపాలకు లోక కల్యాణార్థం బుధవారం శాస్త్రోక్తంగా రుద్రాభిషేకాలను నిర్వహించారు. జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య స్వామీజీ సూచనల మేరకు వీరశైవ గురుకుల పాఠశాల వ్యవస్థాపకులు దానయ్యస్వామి చిత్రపటానికి ప్రత్యేకç ³Nజలు చేసి ఊరేగింపుగా పంచమఠాలకు చేరుకున్నారు. అక్కడి శివలింగాలకు నమకచమకాలతో శాస్త్రోక్తంగా ఆగమ పాఠశాల విద్యార్థులు అభిషేకాలను నిర్వహించారు. శ్రావణమాస అనుస్థానంలో భాగంగా ప్రతి ఏడాది చివరి బుధవారాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా జగద్గురు స్వామీజీ ఆదేశించినట్లు గురుకులపాఠశాల నిర్వాహకులు మల్లికార్జునస్వామి తెలిపారు.