breaking news
September 8
-
8న తెరపైకి ఇరుమురుగన్
ఇరుమురుగన్.. ప్రస్తుతం భారీ అంచనాలను సంతరించుకున్న చిత్రం ఇదేనని చెప్పవచ్చు. కారణం వైవిధ్యం కోసం తపించే నటుడు సియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్. ఈయన పలు చిత్రాల్లో పలు గెటప్‌లలో కనిపించి అలరించినా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇదే అవుతుంది. ఐ చిత్రం అందరిని ఆశ్చర్య పరచినా, ఆ తరువాత నటి0చిన 10 ఎండ్రదుకుళ్ చిత్రం విక్రమ్‌ను నిరాశపరచిందనే చెప్పాలి. దీంతో చాలా కసిగా చేసిన చిత్రం ఇరుముగన్. ఇక లేడీ సూపర్‌స్టార్ నయనతారతో కలిసి నటించిన మొదటి చిత్రం ఇదే. ఇందులో మరో నాయకిగా నిత్యామీనన్ నటించారు. నాజర్, తంబిరామయ్య, బాలా, మనో, ప్రతాప్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అరిమనంబి చిత్రం ఫేమ్ ఆనంద్‌శంకర్ దర్శకుడు. కాగా ఇంతకు ముందు విజయ్ హీరోగా రూపొందిన పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిబు తమీన్స్ నిర్మించిన భారీ చిత్రం ఇరుముగన్. హారీష్ జయరాజ్ సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రంలో మరో ప్రత్కేక అంశం నటుడు విక్రమ్ హిజ్రా తరహా పాత్రలో విలనీయం ప్రదకర్శించడం. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సోమవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఇరుముగన్ చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. దీంతో చిత్రానిన్ని సెప్టెంబర్ 8వ తేదీన విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. -
8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
8 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 8న ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ సమావేశ మందిరంలో సమావేశాలు జరుగుతాయి. సమావేశాలకు సంబంధించి శుక్రవారం శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ నోటిఫికేషన్ జారీ చేశారు. జీఎస్టీ బిల్లును మెజారిటీ రాష్ట్రాలు ఆమోదిస్తేనే అమలుచేసేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా వర్షాకాల సమావేశాలను కూడా పూర్తిచేస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీని కనీసం నాలుగు వారాల పాటు నిర్వహించాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పటికే డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, కృష్ణా పుష్కరాలు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, దళితులపై దాడులు, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మండలి సమావేశాలు 8వ తేదీ ఉదయం ప్రారంభమవుతాయి.