breaking news
senior badminton championship
-
సెమీస్‌లో వృశాలి, ప్రమద
స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ హైదరాబాద్: తెలంగాణ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో వృశాలి, ప్రమద సెమీఫైనల్‌కు చే రుకున్నారు. మంచిర్యాలలో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన క్వార్టర్స్‌లో వృశాలి (రంగారెడ్డి) 21-9, 21-6తో రమిజా ఫైజాన్ (వరంగల్)పై గెలుపొందగా... ప్రమద (మెదక్) 21-16, 21-19తో వంశికను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో పూజ (హైదరాబాద్) 21-16, 21-14తో సుప్రియ (రంగారెడ్డి)పై, వైష్ణవి (రంగారెడ్డి) 21-11, 21-4తో పూర్వి సింగ్ (నిజామాబాద్)పై విజయం సాధించారు. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో పూజ-రమిజా ఫైజాన్ (వరంగల్ ) జోడి 21-12, 21-13తో నితీష (వరంగల్)-వంశిక (రంగారెడ్డి) జంటపై నెగ్గి సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ ఫలితాలు సిరిల్ వర్మ (మెదక్) 21-18, 21012తో ఆదిత్య (ఖమ్మం)పై, విజేత (హైదరాబాద్) 21-12, 21-7తో భార్గవ (రంగారెడ్డి)పై, కిరణ్ కుమార్ (ఆదిలాబాద్) 21-15, 21-15తో గోపాలకృష్ణ (రంగారెడ్డి)పై, రాహుల్ యాదవ్ (హైదరాబాద్) 21-19, 21-12తో సాగర్ (మెదక్)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్ ఫలితాలు తనిష్క్- వినాయక్ (హైదరాబాద్) జోడి 21-11, 21-18తో రితిన్-అనిష్ చంద్ర (వరంగల్) జంటపై, గోపాలకృష్ణ (రంగారెడ్డి)-ఆదిత్య (ఖమ్మం) జోడి 21-19, 21-12తో అన్వేష్-సతీశ్ (హైదరాబాద్) జంటపై, రాహుల్ యాదవ్-గోపి రాజు (హైదరాబాద్) జోడి 21-15, 21-13తో భవదీర్-విఘ్నేశ్ (రంగారెడ్డి) జంటపై, రాహుల్-శ్రవణ్ (రంగారెడ్డి) జోడి 21-13, 22-20తో నవనీత్-తరుణ్ కుమార్ (మెదక్) జంటపై పైచేయి సాధించారు. -
క్వార్టర్స్‌లో వృశాలి, సుప్రియ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో వృశాలి, సుప్రియ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మంచిర్యాలలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో వృశాలి (రంగారెడ్డి) 21-3, 21-4తో బ్రాహ్మిణి (నల్లగొండ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో సుప్రియ (రంగారెడ్డి) 21-18, 21-16తో నితిష (వరంగల్)పై గెలుపొందింది. పరుషుల డబుల్స్‌లో భవదీర్ (హైదరాబాద్)-విఘ్నేష్ రామన్ (రంగారెడ్డి) జోడి 21-15, 21-10తో క్రాంతికుమార్- అరుణ్ (వరంగల్) జంటపై నెగ్గి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ ఫలితాలు సతీశ్ (హైదరాబాద్) 21-9, 21-11తో రాహుల్ (రంగారెడ్డి)పై, అఖిలేశ్వర్ (ఆదిలాబాద్) 21-11, 21-10తో శ్రీనివాస్ (నల్లగొండ)పై, ఆదిత్య (ఖమ్మం)21-6,21-2తో వంశీకృష్ణ (నిజామాబాద్)పై, విజేత (హైదరాబాద్0 21-11, 21-10తో అనిష్ (వరంగల్)పై, క్రాంతికుమార్ (వరంగల్) 21-14, 21-5తో శ్రీకాంత్ (ఖమ్మం)పై, భార్గవ (రంగారెడ్డి) 21-11, 21-16తో సాయి కుమార్( ఆదిలాబాద్)పై, సాయం బోత్రా (హైదరాబాద్) 21-19, 16-21, 21-12తో ఖాజా జలీమ్ (నల్లగొండ)పై, అనురాగ్ (రంగారెడ్డి) 21-6, 21-6తో శివ (నల్గొండ)పై, గోపాలకృష్ణ (రంగారెడ్డి) 21-5, 21-10తో శ్రవణ్ (మహబూబ్‌నగర్)పై, భవదీర్ (హైదరాబాద్) 21-5, 21-8తో నాగరాజ్ (ఖమ్మం)పై, సాగర్ (మెదక్ 21-8, 21-5తో కార్తీక్ (నిజామాబాద్)పై, ఆదిత్య (హైదరాబాద్) 21-10, 11-21, 21-10తో అనిల్ (వరంగల్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు ప్రమద (మెదక్) 21-1, 21-0తో దుర్గా భవాని (ఆదిలాబాద్)పై, వంశిక (రంగారెడ్డి) 9-21, 21-18, 21-14తో ప్రణాలికర్ని (హైదరాబాద్)పై, పూజ (హైదరాబాద్) 21-3, 21-2తో మోహన సాయి ప్రియ (ఆదిలాబాద్)పై, పూర్వి సింగ్ (నిజామాబాద్) 18-21, 21-18, 21-15తో ఆఫ్రిన్ (హైదరాబాద్)పై, వైష్ణవి (రంగారెడ్డి) 21-8, 21-9తో పూజపై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు రాహుల్- గోపి రాజు (హైదరాబాద్) జోడి 21-11, 21-12తో రఫిక్-రవి (ఆదిలాబాద్) జంటపై, రితిన్-అనిష్ (వరంగల్) జోడి 21-17, 21-16తో సాయి కుమార్- విన్సెంట్ (ఆదిలాబాద్) జంటపై, గోపాలకృష్ణ (రంగారెడ్డి)-ఆదిత్య (ఖమ్మం) జోడి 21-12, 21-10తో నాగరాజు-రామకృష్ణ (ఖమ్మం) జంటపై, రాహుల్ - శ్రవ ణ్ (రంగారెడ్డి) జోడి 21-16, 21-10తో అజయ్-జితేందర్ (కరీంనగర్) జంటపై నెగ్గింది.