breaking news
selfie trail
-
బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకుంటూ..
అమెరికాలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జి మీద సెల్ఫీ తీసుకోవాలన్న ప్రయత్నంలో ఓ మహిళ బ్రిడ్జి పైనుంచి కింద పడింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. సాక్రామెంటో ప్రాంతానికి చెందిన ఈ మహిళ కాలిఫోర్నియాలోని అబర్న్ సమీపంలో గల ఫారెస్ట్హిల్ బ్రిడ్జి మీద సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నించింది. నిజానికి 60 అడుగుల ఎత్తున్న ఆ బ్రిడ్జి మీదకు మనుషుల ప్రవేశాన్ని ఎప్పుడో నిషేధించారు. అయితే కింద పడినప్పుడు అదృష్టవశాత్తు నేరుగా నేలమీద పడకుండా మధ్యలో చెట్లు అడ్డుపడటంతో ప్రాణాలతో బతికిపోయింది. ప్రస్తుతం ఆమె స్పృహ కోల్పోయిందని, చేతులు గీరుకుపోయి, ఎముకలు కూడా విరాగాయని.. అందువల్ల శస్త్ర చికిత్సలు అవసరమని మహిళ స్నేహితురాలు పాల్ గాన్చారక్ తెలిపారు. ముందు తామిద్దరం అక్కడ బ్రిడ్జి మీద మామూలుగా ఫొటోలు తీసుకుంటున్నామని, ఆ తర్వాత బీమ్‌లను పట్టి ఉంచే పెద్ద బోల్టుల వద్ద కూడా తీసుకున్నామని, అంతలో ఆమె వాటిమీద కాలు పెట్టి, బ్యాలెన్స్ లేక వెనక్కి పడిపోయిందని చెప్పారు. ఈ ఘటన తర్వాత కాలిఫోర్నియా పోలీసులు తమ ఫేస్బుక్ పేజీలో బ్రిడ్జి ఫొటో పెట్టారు. సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, అలా చేయొద్దని తెలిపారు. బ్రిడ్జి వద్ద ఆ మహిళతో పాటు మరికొందరు స్నేహితులు కలిసి క్యాట్ వాక్ చేశారు. ఆ తర్వాత ఫొటోలు తీసుకునే ప్రయత్నంలో ఆమె పడిపోయింది. ఆమెను చికిత్స కోసం సట్టర్ రోజ్విల్లె మెడకల్ సెంటర్‌కు హెలికాప్టర్లో తీసుకెళ్లారు. బ్రిడ్జి కింద ఉన్న వాక్‌వే మీద ప్రజలు నడవడాన్ని నిషేధించారు. వాటి మీద ఎవరైనా కనపడితే అరెస్టు చేయడానికి కూడా పోలీసులకు అధికారాలున్నాయి. ఆమెకు అదృష్టం బాగుండబట్టి బతికిపోయింది గానీ లేకపోతే ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యుల పరిస్థితి దారుణంగా ఉండేదని పోలీసులు తమ ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. -
అభిమానిపై శాతకర్ణి ఆగ్రహం
వందో చిత్రంగా వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాలకృష్ణ అభిమానులు మంచి సంతోషంగా ఉన్నారు. థియేటర్లలో సందడి చేస్తున్నారు. కొన్ని థియేటర్లకు స్వయంగా బాలకృష్ణ కూడా వెళ్లడంతో ఇక అభిమానుల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. ఎలాగైనా బాలయ్య బాబును దగ్గర నుంచి చూడాలని, ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకోవాలని పలువురు యువకులు ఉత్సాహపడుతున్నారు. కానీ.. సరిగ్గా ఇలాగే సరదా పడిన ఓ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో ఓ థియేటర్ నుంచి బయటకు వస్తున్న బాలకృష్ణతో సెల్ఫీ తీసుకోడానికి ఓ కుర్రాడు ప్రయత్నించగా, ఆయన మాత్రం కోపంగా అతడి చేతిని విసిరికొట్టారు. దాంతో అతడి ఫోన్ కింద పడిపోయింది. ఆ తర్వాత కూడా బాలకృష్ణ అతడిని ఆగ్రహంతో తిడుతున్నట్లు వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా తిరుగుతోంది. -
ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ ప్రయత్నం
-
ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ ప్రయత్నం
రైలు ఎక్కి.. దాని పైన సెల్ఫీ తీసుకోడానికి చేసిన ప్రయత్నం ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్లో జరిగింది. విశాఖపట్నానికి చెందిన సంతోష్ కుమార్ అనే బీటెక్ విద్యార్థి రాజమండ్రిలో రైలు ఎక్కి.. దాని పైకప్పు మీదకు వెళ్లాడు. అక్కడ ఓ సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నం చేస్తుండగా, అక్కడున్న హైటెన్షన్ విద్యుత్ లైను అతడికి తగిలింది. వెంటనే తీవ్ర విద్యుత్ షాక్‌తో అతడి ఒళ్లంతా కాలిపోయింది. అక్కడకు సమీపంలోనే ఉన్న అతడి తల్లిదండ్రులు, బంధువులు వెంటనే సంతోష్ కుమార్‌ను 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతున్నాడు. అయితే సంతోష్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి.