breaking news
secratariot
-
కొత్త సచివాలయానికి మరో మెలిక
► మైదానం ఇవ్వొద్దంటూ పీఎంవోకు ఫిర్యాదులు ► దాంతో రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన వైనం ► ప్రత్యామ్నాయంగా 543 ఎకరాలివ్వాలని షరతు ► రూ. 1,100 కోట్లు, ► ఏటా నిర్వహణ చార్జీలూ ► చెల్లించాలని కొర్రీ సాక్షి, హైదరాబాద్ : కొత్త సచివాలయ నిర్మాణానికి మరో మెలిక పడింది. సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్‌ను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోంది. మైదానం ఇవ్వొద్దంటూ ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం గ్రీవెన్స్ సెల్‌కు కొంతకాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాటిలో 13 ఫిర్యాదులకు వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పీఎంవో తాజాగా లేఖ రాసింది. దీంతో కేంద్రానికి వివరణ ఇచ్చేందుకు రహదారులు, భవనాల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలూ రక్షణ శాఖ భూములివ్వాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు భూములిస్తే.. మిగిలిన రెండు రాష్ట్రాలకూ ఇవ్వాల్సి ఉంటుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగానే కేంద్రం పెండింగ్‌లో పెడుతోందని ప్రభుత్వ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త షరతులు, రకరకాల కొర్రీలు తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. భూములిచ్చేందుకు గతేడాది ఓకే బైసన్ పోలోతో పాటు జింఖానా గ్రౌండ్‌కు చెందిన 60.87 ఎకరాలు.. జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణ, గఫ్ రోడ్డుకు ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి 200.58 ఎకరాల భూమి అప్పగించాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది. ప్రత్యామ్నాయంగా జవహర్‌నగర్‌లో 500 ఎకరాల భూమి కేటాయించడంతోపాటు మౌలిక సౌకర్యాలు కల్పించే ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలపై రక్షణ శాఖ ఇప్పటికే రాష్ట్ర అధికారులతో ఢిల్లీలో ఓసారి సమావేశమైంది. హైదరాబాద్‌కు వచ్చి భూములను సైతం పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు భూములు అప్పగించేందుకు గతేడాది నవంబర్లోనే సంసిద్ధత వ్యక్తం చేసింది. వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలుగా నాన్చివేత «ధోరణి అనుసరించిన రక్షణ శాఖ.. ఇటీవలే కొన్ని షరతులు విధించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 500 ఎకరాలు సరిపోదని, 543 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని, దాదాపు రూ. 1,100 కోట్లు చెల్లించాలని షరతు విధించినట్లు తెలిసింది. వీటితో పాటు నిర్వహణ పేరుతో ఏటా చార్జీలు చెల్లించాలని మరో మెలిక పెట్టినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అంత మొత్తం చెల్లించి భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అంచనాలు వేసుకుంటోంది. నిధులు చెల్లించేందుకు సిద్ధపడినా ఏటా నిర్వహణ చార్జీలు చెల్లించాలంటూ రక్షణ శాఖ పెట్టిన షరతులు అనుచితంగా ఉన్నాయని వెనుకడుగేసింది. అందుకే కొత్త సచివాలయం నిర్మాణాన్ని కొంతకాలం వాయిదా వేయాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. కేంద్రం నుంచి సానుకూలత వచ్చే వరకు తొందరేమీలేదని ఈ విషయాన్ని అధికారులు తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. -
‘సీఎం ఫొటోపై చెత్త’.. వారిపై నెపం వేసేలా విచారణ!
సాక్షి, అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోమీద చెత్త వేసిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఎంబీసీ ఎండీ నాగభూషణం మంగళవారం సచివాలయంలోని నాలుగో బ్లాక్‌కు వెళ్లి.. సిబ్బంది, కార్మికుల నుంచి వివరాలు సేకరించారు. నాలుగో బ్లాక్ పారిశుధ్య సిబ్బందిపై నెపం వేసేలా విచారణ సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో సోమవారం ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జేఎన్‌టీసీ సమీక్షా సమావేశం సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది అల్పాహారం తిన్నారు. తిన్న తర్వాత మిగిలిన పేట్లను నాలుగో బ్లాక్ లోని సమావేశ మందిరం వద్ద టేబుల్ మీదున్న సీఎం చంద్రబాబు ఫొటోపైనే వేసేశారు. ప్రభుత్వాధినేత ఫొటోను సైతం పట్టించుకోకుండా డస్ట్‌బిన్‌గా వాడుకోవటం విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పాలనా కేంద్రంలోనే ఆయన ఫొటోపై చెత్త వేయడం సచివాలయంలో ఇపుడు చర్చనీయాంశమైంది. దీంతో సంచలనం కలిగించిన ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
సచివాలయ ఉద్యోగులకు ఘన స్వాగతం
నగరంపాలెం( గుంటూరు): వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పరిపాలన విధులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ శాఖల ఉద్యోగులు హైదరాబాద్ నుంచి తరలివచ్చారు. సికింద్రాబాద్–విజయవాడ రైలులో ఉదయం 10.35 గంటలకు వారంతా గుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకోగా స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు, ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి గులబీ పూలతో స్వాగతం పలికారు. ‘రాజధానికి తరలివస్తున్న ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు స్వాగతం.. అవినీతి రహితమైన పరిపాలనను అందించాలని కోరుతున్నాం..’ అంటూ అవగాహన సంస్థ బ్యానర్లు ప్రదర్శించింది. సచివాలయ మహిళాlఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుమారు 100 మంది బ్యానర్లు ప్రదర్శించుకుంటూ రైల్వే స్టేషన్ నుంచి వెలుపలికి వచ్చారు. అక్కడి నుంచి నేరుగా వెలగపూడిలోని సచివాలయంకు వెళ్లేందుకు ఆర్టీసీ పది బస్సులను రైల్వేస్టేషన్ వద్ద సిద్ధంగా ఉంచింది. వారంతా ఆ బస్సుల్లో సచివాలయానికి చేరుకున్నారు. చిన్నచిన్న సమస్యలున్నా స్వంతరాష్ట్ర అభివద్ధి దష్ట్యా సర్దుకుపోయి పనిచేసుకుంటామని ఈ సందర్భంగా వారు విలేకరులకు తెలిపారు.