breaking news
The second Test
-
పిచ్ ఎవరి వైపు..?
-
పిచ్ ఎవరి వైపు..?
► బెంగళూరు వికెట్‌పై తీవ్ర చర్చ ►రెండు రోజుల ముందు పచ్చిక తొలగింపు ► బ్యాటింగ్‌పైనే భారత్ దృష్టి బెంగళూరు: భారత గడ్డపై టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆటకు ముందే పిచ్ ఎలా ఉండబోతోందో అనే చర్చ మరో సారి మొదలైంది. అయితే ఈ సారి సీన్ కాస్త రివర్స్‌గా ఉంది. ఎప్పుడైనా ప్రత్యర్థి జట్లు పిచ్ గురించి ఆందోళన చెందేవి. భారత్‌కు మాత్రం అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే రాలేదు. కానీ పుణే టెస్టు మ్యాచ్ దెబ్బకు టీమిండియా కూడా వికెట్‌పై దృష్టి పెడుతోంది. ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ 4–0తో గెలిచినా పిచ్‌ల ఏర్పాటు విషయంలో ఎలాంటి వివాదం రేకెత్తలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పిచ్ ఎవరికి అనుకూలిస్తుందనేది ఆసక్తికరం. శనివారం ప్రారంభం కానున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టుకు మూడు రోజుల ముందు ప్రధాన వికెట్‌పై చాలా ఎక్కువగా పచ్చిక కనిపించింది. అదే సమయంలో ఒక ఎండ్‌లో ఆఫ్ స్టంప్‌కు చేరువలో (ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు) వికెట్ కాస్త ఎత్తుపల్లాలతో ఉంది. ఇది భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు అనుకూలంగా మారవచ్చని భావిస్తున్నారు. అయితే మరో వైపు అదనపు పేస్‌తో ఇది ఆసీస్ స్టార్ మిషెల్ స్టార్క్‌కు కూడా కలిసి వచ్చే ప్రమాదం కనిపించింది. దాంతో గురువారంనాటికి పిచ్ మారిపోయింది. పిచ్‌పైనున్న పచ్చికను దాదాపు పూర్తిగా తొలగించేశారు. ఇప్పుడు ఇది సాధారణ ఉపఖండపు వికెట్లా కనిపించడం విశేషం. అంటే తొలి రెండు రోజుల్లో బ్యాటిం గ్‌కు బాగా అనుకూలించి ఆ తర్వాత మెల్లగా స్పిన్‌కు సహకరించవచ్చు. ఈ సీజన్లో భారత జట్టు ఇంగ్లండ్‌తో ఆడిన ఐదు టెస్టులు, బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో ఇలాంటి పిచ్‌లపైనే ముందుగా భారీ స్కోరు సాధించి ఆ తర్వాత ప్రత్యర్థిని చుట్టేసింది. ఈ ఆరు టెస్టుల తొలి ఇన్నింగ్స్‌లలో భారత్ వరుసగా 488, 455, 417, 631, 759/7, 687/6 పరుగులు చేయడం విశేషం. కాబట్టి ఈ సారి కూడా టాస్ కీలకం కానుంది. పూర్తి స్పిన్ పిచ్ లేదా పేస్ వికెట్ ఉపయోగించి సాహసం చేసే పరిస్థితిలో భారత్ ప్రస్తుతం లేదు. కాబట్టి ముందుగా తమ బలమైన బ్యాటింగ్‌నే నమ్ముకోవాలని జట్టు భావిస్తున్నట్లుంది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు గనుక చేయగలిగితే జట్టుకు టెస్టుపై పట్టు చిక్కవచ్చు. స్టార్క్ మా బలం: మార్ష్ భారత గడ్డపై స్టార్క్‌లాంటి పేస్ బౌలర్ ప్రభావం చూపించడం మంచి పరిణామమని అతని సహచరుడు, ఆసీస్ ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ అభిప్రాయ పడ్డాడు. భారత ఆటగాళ్లలో ఒక రకమైన ఆందోళనను స్టార్క్ పెంచాడని అతను అన్నాడు. ‘స్టార్క్ ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. స్పిన్నర్ల గురించి చర్చ జరిగే భారత్‌లో స్టార్క్ మా ప్రధాన ఆయుధం. భారత బ్యాట్స్‌మెన్‌లో భయం పుట్టించి అతను మరిన్ని వికెట్లు తీస్తాడని నమ్ముతున్నా. స్టార్క్‌తో పాటుహాజల్‌వుడ్ రివర్స్ స్వింగ్ కలిస్తే మాకు తిరుగుండదు’ అని మార్ష్ విశ్వాసం వ్యక్తం చేశాడు. గురువారం భారత జట్టుకు ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో ప్రధాన ఆటగాళ్లంతా సెషన్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు మాత్రం పూర్తిస్థాయిలో సాధన చేసింది. -
అశ్విన్ జిగేల్... ఇంగ్లండ్ ఢమాల్
-
అశ్విన్ జిగేల్... ఇంగ్లండ్ ఢమాల్
► ఒక్క రోజులో 11 వికెట్లు ► ఫాలోఆన్ దిశగా ఇంగ్లండ్ ► అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ► రెండో టెస్టుపై పట్టు బిగించిన భారత్ టెస్టుల్లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్ ర్యాంక్‌కు అసలైన అర్హత తనకే ఉందని భారత క్రికెటర్ అశ్విన్ నిరూపించాడు. బ్యాటింగ్ చేయడానికి కష్టంగా ఉన్న పిచ్‌పై అద్భుత ఇన్నింగ్స ఆడి అర్ధసెంచరీ చేయడంతో పాటు... తనకు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ప్రతి బంతికీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండో రోజుకే భారత్ పూర్తిగా పట్టు సాధించింది. తొలి టెస్టు తర్వాత అంతులేని ఆత్మవిశ్వాసంతో కనిపించిన ఇంగ్లండ్ జట్టు వైజాగ్‌లో డీలా పడింది. భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరించలేక బౌలర్లు చేతులెత్తేస్తే... స్పిన్‌ను ఆడటానికి ఆ జట్టు బ్యాట్స్‌మెన్ బ్రేక్ డ్యాన్సే చేయాల్సి వస్తోంది. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోరుున పర్యాటక జట్టు ఇక ఫాలోఆన్ తప్పించుకోవాలంటే అద్భుతం జరగాల్సిందే. విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ఊహించినట్లే జరుగుతోంది.... అరంగేట్ర టెస్టు ద్వారా విశాఖపట్నం భారత జట్టుకు శుభారంభాన్ని ఇవ్వబోతోంది. రెండో రోజు సాయంత్రం నుంచే బంతి తిరుగుతుండటంతో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్ విజయంపై ఆశలు పెంచుకుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఏకంగా 11 వికెట్లు నేలకూలారుు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్సలో 49 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసింది. జో రూట్ (98 బంతుల్లో 53; 6 ఫోర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. స్టోక్స్ (12 బ్యాటింగ్), బెరుుర్‌స్టో (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీసుకోగా... షమీ, జయంత్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్సలో 129.4 ఓవర్లలో 455 పరుగులకు ఆలౌటరుుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (267 బంతుల్లో 167; 18 ఫోర్లు) రెండోరోజు ఎక్కువసేపు నిలబడకపోరుునా... అశ్విన్ (95 బంతుల్లో 58; 6 ఫోర్లు) నాణ్యమైన ఇన్నింగ్స ఆడాడు. తొలి టెస్టు ఆడుతోన్న జయంత్ యాదవ్ (84 బంతుల్లో 35; 3 ఫోర్లు) కూడా రాణించాడు. అశ్విన్, జయంత్ ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు జోడించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో మొరుున్ అలీ, అండర్సన్ మూడేసి వికెట్లు తీసుకోగా... రషీద్‌కు రెండు వికెట్లు దక్కారుు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్సలో 352 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలోఆన్ తప్పిం చుకోవాలంటే కుక్ బృందం మరో 153 పరుగులు చేయాలి. సెషన్ 1: అశ్విన్ నిలకడ రెండో రోజును అశ్విన్, కోహ్లి ధాటిగానే ప్రారంభించారు. ఇద్దరూ అడపాదడపా బౌండరీలతో నిలకడగా ఆడారు. అశ్విన్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను స్టోక్స్ వదిలేశాడు. అరుుతే మొరుున్ బౌలింగ్‌లో తర్వాతి బంతికే కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో స్టోక్స్ అద్భుతంగా అందుకున్నాడు. మరో మూడు ఓవర్ల తర్వాత భారత్‌కు మరో షాక్ తగిలింది. మొరుున్ బౌలింగ్‌లో సాహా, జడేజా మూడు బంతుల వ్యవధిలో ఎల్బీగా అవుటయ్యారు. సాహా అవుట్ నిర్ణయాన్ని భారత్ రివ్యూ చేసినా ఫలితం లేకపోరుుంది. తొలి టెస్టు ఆడుతున్న జయంత్ యాదవ్ రూపంలో అశ్విన్‌కు మంచి సహకారం లభించింది. వీళ్లిదరూ జాగ్రత్తగా ఆడుతూనే మధ్యలో బౌండరీలతో పరుగులు రాబట్టారు. మూడు వికెట్లు పడ్డా... ఈ సెషన్లో అశ్విన్ నిలకడ, పరుగులు వేగంగా రావడం వల్ల భారత్‌దే పైచేరుుగా కనిపించింది. ఓవర్లు: 29 పరుగులు: 98 వికెట్లు: 3 సెషన్ 2: భారత్ ఆలౌట్ లంచ్ తర్వాత మొరుున్ బౌలింగ్‌లో బౌండరీతో అశ్విన్ 86 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో మరో బౌండరీ కొట్టిన అశ్విన్.. స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో ఎండ్‌లో నాణ్యమైన ఇన్నింగ్స ఆడిన జయంత్ యాదవ్ భారీ షాట్ కొట్టబోరుు క్యాచ్ ఇచ్చాడు. ఉమేశ్ యాదవ్ రెండు ఫోర్లు, షమీ ఒక సిక్సర్‌తో వేగంగా ఆడారు. రషీద్ బౌలింగ్‌లో ఉమేశ్ అవుట్ కావడంతో భారత ఇన్నింగ్‌సకు తెరపడింది. అనంతరం ఇన్నింగ్స ప్రారంభించిన ఇంగ్లండ్‌కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. షమీ కళ్లు చెదిరే బంతితో కుక్‌ను బౌల్డ్ చేశాడు. హమీద్, రూట్ ఆచితూచి ఆడారు. దీంతో ఏడో ఓవర్లో గానీ ఇంగ్లండ్‌కు బౌండరీ రాలేదు. రూట్ అడపాదడపా బౌండరీలు కొట్టినా హమీద్ పూర్తిగా ఆత్మరక్షణలో ఆడాడు. ఈ ఇద్దరూ జాగ్రత్తగా ఆడటంతో మరో వికెట్ పడకుండా సెషన్ ముగిసింది. ఓవర్లు: 26.4 పరుగులు: 74 వికెట్లు: 4 భారత్: 10.4 ఓవర్లు, 40 పరుగులు, 3 వికెట్లు ఇంగ్లండ్: 16 ఓవర్లు, 34 పరుగులు, 1 వికెట్ సెషన్ 3: భారత బౌలర్ల హవా టీ తర్వాత కొద్దిసేపటికే రూట్‌తో సమన్వయ లోపంతో హమీద్ రనౌట్ అయ్యాడు. ధోని స్టరుుల్లో సాహా బంతిని వెనకకు విసిరి రనౌట్ చేశాడు. భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న రూట్ బౌండరీలతో వేగం పెంచాడు. కానీ అశ్విన్ బౌలింగ్‌లో డకెట్ బౌల్డ్ కావడంతో మరోసారి ఇంగ్లండ్ తడబడింది. 91 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రూట్... అశ్విన్ బౌలింగ్‌లో ఎదురుదాడి ప్రయత్నం చేసి అవుటయ్యాడు. కొత్త బౌలర్ జయంత్ యాదవ్ తన రెండో ఓవర్లోనే మొరుున్ అలీని అవుట్ చేశాడు. తొలుత అంపైర్ అవుట్ ఇవ్వకపోరుునా రివ్యూ అడిగి భారత జట్టు వికెట్ సాధించింది. స్టోక్స్, బెరుుర్‌స్టో కలిసి జాగ్రత్తగా ఆడి భారత్‌కు మరో వికెట్ ఇవ్వకుండా సెషన్‌ను ముగించారు. ఓవర్లు: 33 పరుగులు: 69 వికెట్లు: 4 నేడా..? రేపా..? విశాఖ టెస్టులో రెండో రోజు ముగిసేసరికి భారత జట్టు విజయం దాదాపుగా ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్‌ను ఇంగ్లండ్ జట్టు ఆఖరి రోజు వరకు తీసుకెళ్లడం కూడా కష్టమే. ప్రస్తుతం ఇంగ్లండ్ ఫాలోఆన్ తప్పించుకోవాలంటే మరో 153 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న ఇద్దరు తప్ప స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు. ప్రస్తుతం బంతి తిరుగుతున్న విధానం చూస్తే మూడోరోజు మరింత స్పిన్ తిరిగే అవకాశం కనిపిస్తోంది. అశ్విన్‌తో పాటు కొత్త స్పిన్నర్ జయంత్ కూడా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మూడో రోజు ఉదయం సెషన్లోనే ఇంగ్లండ్ ఆలౌటయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ భారత్‌కు 250 పైచిలుకు ఆధిక్యం లభిస్తే ఇంగ్లండ్‌ను ఫాలోఆన్ ఆడించవచ్చు. అంతకంటే తక్కువ ఆధిక్యం వస్తే భారత్ రెండో ఇన్నింగ్స ఆడే అవకాశం లేకపోలేదు. ఫాలోఆన్ ఆడిస్తే ఒకవేళ ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్సలో పోరాడి భారత్‌కు ఏ 150 పరుగుల లక్ష్యం నిర్దేశించినా ఆఖరి రోజు వరకూ ఆట వెళుతుంది. అప్పుడు స్పిన్ పిచ్‌పై అది ఛేదించడానికి కష్టపడాలి. అరుుతే అశ్విన్ జోరు చూస్తుంటే భారత్‌కు మంచి ఆధిక్యం లభించి ఫాలోఆన్ ఆడించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నారుు. అదే జరిగితే మ్యాచ్ శనివారమే ముగిసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ ఇంగ్లండ్ పోరాడినా నాలుగో రోజు ఆదివారం నాటికి మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం ఉంది. కోహ్లి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రస్తుతం భారత్ విజయం ఖాయమే అనిపిస్తోంది. అరుుతే ఇది నేడే పూర్తవుతుందా? లేక రేపా అనేదే తేలాలి. ► 2 ఆసియా ఖండంలో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ పేస్ బౌలర్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడం ఇది రెండోసారి మాత్రమే. 2006లో భారత్‌పై తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో తొలిసారి అతను ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ► 8 భారత్‌పై ఆడిన 12 ఇన్నింగ్సలో రూట్ ఎనిమిదిసార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఏ జట్టుపై కూడా రూట్ ఈస్థారుులో నిలకడగా రాణించలేదు. -
వైజాగ్ టెస్టు టిక్కెట్ల అమ్మకం మొదలు
హైదరాబాద్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖపట్నంలో ఈ నెల 17 నుంచి జరిగే రెండో టెస్టుకు ఆన్లైన్లో టిక్కెట్ల అమ్మకం మొదలైంది. టిక్కెట్ ధర రోజుకు కనిష్టం రూ.100 కాగా... గరిష్టం రూ.500. వెరుు్య, రెండు వేల రూపాయలకు సీజన్ టిక్కెట్లు కూడా అందుబాటులో ఉన్నారుు. ఆంధ్ర క్రికెట్ చరిత్రలో ఇది తొలి టెస్టు మ్యాచ్ కావడంతో... టెస్టు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి వైజాగ్ అభిమానులకు ఇది మంచి అవకాశం. -
ఆసీస్, కివీస్ రెండో టెస్టు డ్రా
పెర్త్: ఇరు జట్లు బ్యాటింగ్‌లో దుమ్మురేపడంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య మంగళవారం ముగిసిన రెండో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మిత్ సేన 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో ట్రాన్స్-టాస్మాన్ ట్రోఫీని ఆసీస్ నిలబెట్టుకుంది. 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లలో 2 వికెట్లకు 104 పరుగులు చేసింది. ఈ టెస్టుతో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన జాన్సన్‌కు ఈ రెండు వికెట్లు దక్కా యి. అంతకుముందు 258/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 385 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రాస్ టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు (డే నైట్) ఈనెల 27 నుంచి అడిలైడ్‌లో జరుగుతుంది. -
రెండో రోజు ఆట వర్షార్పణం
భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు బెంగళూరు: భారీ వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట రద్దయ్యింది. చిన్నస్వామి స్టేడియం చిత్తడిగా మారడంతో కనీసం ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. ఉదయం 10 గంటలకు వర్షం కాస్త తెరిపినివ్వడంతో పదిన్నరకు మ్యాచ్‌ను మొదలుపెట్టాలని ప్రయత్నించారు. అయితే వెంటనే మొదలైన వాన మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆగకుండా కురిసింది. దీంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు గౌల్డ్, కెటిల్‌బరో ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం కూడా వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ నివేదిక. ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే ఉదయం 9.15 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి రోజు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌట్ కాగా...భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 80 పరుగులు చేసింది.