Second capital of hyderabad
-
అంబేద్కర్ మదిలో ‘హైదరాబాద్’.. కలకత్తా, ముంబైలను కాదంటూ..
నేడు (ఏప్రిల్ 14) అంబేద్కర్ జయంతి. దేశంలోని దళితుల అభ్యన్నతికి పాటు పడిన అంబేద్కర్(Ambedkar)కు హైదరాబాద్‌పై ప్రత్యేక అభిప్రాయం ఉంది. అప్పట్లో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ సూచించారు. కొంతకాలం దీనిపై చర్చ జరిగింది. అయితే మారిన కాలంతో పాటు చోటుచేసుకున్న పరిణామాలతో ఈ అంశం కొంతమేరకు మరుగున పడింది.భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి రెండో రాజధాని(Second capital) అవసరమనే ఆలోచనను 1950వ దశకంలో తన పుస్తకం 'థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్'లో ప్రతిపాదించారు. ఈ పుస్తకంలో ఆయన దేశానికి రెండో రాజధాని అవసమని పేర్కొన్నారు. తద్వారా ఉత్తర-దక్షిణ ఉద్రిక్తతలను తొలగించేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు. ఒక్క రాజధాని భారతదేశానికి సరిపోతుందా? అని అంబేద్కర్ ప్రశ్నించారు. దేశ రెండో రాజధానిగా కలకత్తాను ఎంచుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కలకత్తా టిబెట్‌కు సమీపంలో ఉందని, అలాగే ముంబై సముద్ర తీరంలో ఉండటం వల్ల అది కూడా రెండో రాజధానిగా సురక్షితం కాదని అంబేద్కర్ భావించారు. ఈ దశలో చివరగా ఆయన హైదరాబాద్(Hyderabad)ను ఎంచుకున్నారు. ఈ ప్రాంతపు భౌగోళిక స్థానం దేశంలోని అన్ని దిశల నుంచి సమాన దూరంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని అంబేద్కర్ పేర్కొన్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్- బొలారం ప్రాంతాలను చీఫ్ కమిషనర్ ప్రావిన్స్‌గా ఏర్పాటు చేసి, భారతదేశ రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ నాడు సిఫారసు చేశారు.అంబేద్కర్ ఈ సూచనను భాషాపరమైన రాష్ట్రాలు ఏర్పడకముందే, అంటే 1960కి ముందు చేశారు. అయితే నేడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో రెండో రాజధాని వాదన వినిపించింది. కాగా అంబేద్కర్ నాగ్‌పూర్‌ను రెండో రాజధానిగా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని పలువురు విశేషంగా చెబుతుంటారు. అంబేద్కర్ 1956లో నాగపూర్‌లో బౌద్ధమతాన్ని స్వీకరించి, లక్షలాది మందిని కుల వివక్ష నుంచి విముక్తి చేసే చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.ఇది కూడా చదవండి: నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం -
దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావాలి: సీహెచ్ విద్యాసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావాలి అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా ఇదే చెప్పారు అని అన్నారు. కాగా, సీహెచ్ విద్యాసాగర్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండో రాజధానిపై పార్టీలన్నీ నిర్ణయం తీసుకోవాలి. బంగారు తెలంగాణ ఆకాంక్షకు రెండో రాజధాని తోడ్పడుతుంది. భారతదేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయ్యే అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే నమ్మకం ఉందని.. రాజ్యాంగంలో కూడా ఈ అంశం ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు, బేగంపేట్, రాజ్‌భవన్ రూట్లలో.. -
రెండో రాజధాని హైదరాబాద్
హైదరాబాద్ నగరం దేశంలోని పలు రాష్ట్రాలకు సమీపంగా ఉండి రైల్వే, విమాన, బస్సు మార్గాలను కూడా కలిగి ఉంది. అల నాటి నైజాం నవాబుల కాలంలోనే ఇది అంతర్జాతీయ నగరాలలో ఒకటిగా పేరుగాంచింది. అలాంటి దీనిని దక్షిణ భారతీయులకు కేంద్రపరంగా దేశము యొక్క రెండవ రాజధానిగా హైదరాబాద్ అని ప్రకటిస్తే దేశ వాసులందరికీ ప్రయోజన కరం. అదీగాక ఈ నగరంలో మరాఠీ, బెంగాలీ, తమిళ, కన్నడిగ, ఆంధ్రసీమ వారలకే గాక ఉత్తర భారతం నుండి వలస వచ్చిన యూపీ, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ లాంటి వారికి ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకొన్నది. సింధీలు, ముస్లింలు, పార్శీలు, కిరస్తానీలు, జైనులు, సిక్కులను సైతం తనలో కలుపు కొని సాహితీ సంగమ క్షేత్రంగా విరాజిల్లుతున్నది కదా! మరి అలాంటి దీనిని మన భారతదేశానికి ఉపరాజధానిని చేస్తే రాజ ధాని కూడా సురక్షిత కేంద్రంగా భాసిల్లుతుందన్న విషయాన్ని విజ్ఞులు, మేధావులు రాజకీయ నాయకులు మరియు కేంద్ర మంత్రివర్యులు (తెలుగు ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహి స్తున్న వారు) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనేలా ఆలోచిస్తే బావుంటుందని అనిపిస్తుంది. - కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్