breaking news
Samikaya Shakaravam
-
అధైర్య పడకండి అండగా ఉంటా
-
సమైక్యమే శరణ్యం
=ఆవిధంగానే అభివృద్ధి సాధ్యం =అందుకే జగన్ మహోన్నత ఉద్యమం =వైఎస్సార్సీపీ కన్వీనర్ చొక్కాకుల స్పష్టీకరణ =పాడేరులో భారీ స్థాయిలో సమైక్య శంఖారావం పాడేరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే నినాదంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహోన్నత ఉద్యమం చేపట్టారని పార్టీ రూరల్ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు చెప్పారు. పాడేరులోని మోదకొండమ్మ ఆలయ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి పార్టీ అధ్యక్షుడు సుదీర్ఘ పోరాటం చేపట్టారని తెలిపారు. సమైక్యాంధ్రకు కట్టుబడిన ఏకైక నేతగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నిరంకుశ విధానాలను గ్రామగ్రామాన తమ పార్టీ ఎండగడుతుందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ రాష్ట్ర విభజనకు ప్రధానంగా కారణమని స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలను రానున్న ఎన్నికల్లో తరమికొట్టి సమైక్యాంధ్ర ఉద్యమానికి కట్టుబడి ఉన్న వైఎస్సార్సీపీకే పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అరకుపార్లమెంటరీ సమన్వయకర్త కొత్తపల్లి గీత మాట్లాడుతూ మహానేత రాజశేఖరరెడ్డి ఆశయాలే ధ్యేయంగా జగన్ పనిచేస్తున్నారని, ఈ కుటుంబాన్ని కాంగ్రెస్ పెద్దలు అష్టకష్టాలు పెడుతున్న తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం కన్వీనర్ అదీప్‌రాజు మాట్లాడుతూ వైఎస్ కన్నుమూసిన నాటి నుంచి రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్రా న్ని అభివృద్ధి చేయకపోగా విభజనకు పూనుకొని సీమాంధ్రకు అన్యాయం చేస్తున్న విషయాన్ని ప్రజలు గ్రహిం చాలని కోరారు. నియోజకవర్గం సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, గిడ్డి ఈశ్వరి, సీకరి సత్యవాణి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని చెప్పారు. భారీ ఎత్తున జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, పార్టీ నేతలు ఎస్.వి.వి.రమణమూర్తి, స్వా ముల సుబ్రమణ్యం, సెర్రెకి గంగయ్యదొర, ఉగ్రంగి కళ్యాణి, మామిడి చంద్రరావు, ఎస్.వెంకయమ్మ తదితరులు పాల్గొన్నారు. శంఖారావం స మావేశం సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీతో పాడేరు హోరెత్తింది. ని యోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులంతా ర్యాలీలో పాల్గొని సమైక్య నినాదాలతో కదం తొక్కారు. నాయకులు ముందుగా అంబేద్కర్, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
దారులన్నీ అటే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జరిగే ‘సమైక్య శంఖారావం’ సభకు ఎల్బీ స్టేడియం ముస్తాబైంది. బషీర్‌బాగ్ చౌరస్తా, అసెంబ్లీ, పబ్లిక్‌గార్డెన్ రోడ్డు, నాంపల్లి ప్రాంతాలలో జగన్మోహన్రెడ్డి చిత్రాలతో కూడిన బ్యానర్లు, కటౌట్లు,తోరణాలు ఆకర్షిస్తున్నాయి. గేటులు, ఎంట్రీలు ఇలా... ఆయకార్ భవన్ వైపున్న ఔటర్ గేట్ ‘జీ’ నుంచి సాధారణ ప్రజల్ని అనుమతిస్తారు. దీని ద్వారా ప్రాంగణంలోకి ప్రవేశించిన వారు ఇన్నర్ గేట్స్ అయిన 10, 15, 17 ద్వారా స్టేడియంలోకి వెళ్లచ్చు. ఇవన్నీ సాధారణ ప్రజలతో పాటు 17వ నెంబర్ గేట్‌ను ప్రధానంగా మహిళల కోసం కేటాయించారు. నిజాం కళాశాల ఎదురుగా ఉన్న ఔటర్ గేట్లు ఎఫ్, ఎఫ్-1 నుంచి ప్రాంగణంలోకి ప్రవేశించిన సాధారణ ప్రజలు 8, 10 ఇన్నర్ గేట్స్ ద్వారా స్టేడియంలోకి వెళ్లవచ్చు. ఇదే ఔటర్ గేట్ నుంచి వచ్చిన వీఐపీలు స్టేడియంలోకి వెళ్లడానికి ఇన్నర్ గేట్ 6ను కేటాయించారు. ఖాన్ లతీఫ్‌ఖాన్ ఎస్టేట్ వైపు ఫతేమైదాన్ క్లబ్ ప్రవేశం పక్కనున్న (టెన్నిస్ కోర్ట్ వైపు వెళ్లే మార్గం) ఔటర్ గేట్ ‘ఎ’ ప్రాంగణంలోకి ప్రవేశించే మహిళలు ఇన్నర్ గేట్ 17 ద్వారా స్టేడియంలోకి వెళ్లచ్చు. ‘ఎ’ సమీపంలో ఉన్న ఔటర్ గేట్ ‘డి’ నుంచి (శాప్ ఆఫీస్ గేట్ నుం చి) కేవలం స్టేజి పైకి వెళ్లే వీవీఐపీలను మాత్రమే అనుమతిస్తారు. వ్యవసాయశాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న ‘సి’ గేట్ (గతంలో క్రికెటర్స్ వెళ్లే గేట్) నుంచి కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబీకుల్ని మాత్రమే అనుమతిస్తారు.