breaking news
Rotation of the Earth
-
రోజుకు 25 గంటలు..ఎందుకో తెలుసా?
రోజుకు ఎన్ని గంటలు అనగానే ఠక్కున వచ్చే సమాధానం 24 గంటలు. అయితే ఈ రోజుకు 24 గంటల రోజు నెమ్మదిగా మారుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మార్పు నిజం. కచ్చితంగా.. ఇప్పటికే జరుగుతోంది. ఈ మార్పు చాలా క్రమంగా జరుగుతుందని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. భూమి భ్రమణం నెమ్మదిగా నెమ్మదిస్తోందని శాస్త్రవేత్తల మాట. అంటే రోజు ఎక్కువుతోంది. కాలం, జీవితం , గ్రహం నిశ్శబ్దంగా ఎలా పరిణామం చెందుతాయనే దానిపై ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఆగండి ఆగండి..అయితే ఇప్పటికిప్పుడు దైనందిన జీవితానికి తక్షణ అంతరాయం లేదంటున్నారు. ఈ మార్పుకు మిలియన్ల సంవత్సరాలు పడుతుంది, అసలు ఏం జరుగుతోంది. దేని ఆధారంగా సైంటిస్టులు ఈ విషయాన్ని అంచనా వేస్తున్నారు.భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు సమయం పడుతుంది. సాధారణంగా భూమి తన అక్షంపై తిరిగే వేగాన్ని ఆధారంగా చేసుకుని ఒక రోజు ఎంత సమయం అనేది నిర్ణయిస్తారు. ఇపుడు ఈ వేగం క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా రోజులకు 24 గంటలకు బదులు 25 గంటలు పడుతుందంటున్నారు. ఇది ఆ రోజు రావడానికి ఇంకా చాలా సమయం ఉందని చెబుతున్నారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాలు పట్టే అవకాశం ఉందట.భూమి భ్రమణం నెమ్మదిస్తోందిభూమి భ్రమణం క్రమంగా వేగాన్ని తగ్గిస్తోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ మందగమనంతో మానవులపై చాలా నెమ్మదిగా ఉంటుందనీ, ప్రస్తుత గడియారాలు , క్యాలెండర్లు పూర్తిగా ప్రభావితం కావు. ఈ ధోరణి వందల మిలియన్ల వరకు విస్తరించి ఉందని పరిశోధకులు అంటున్నారు.ఈ ప్రక్రియ ఇదే విధంగా కొనసాగితే, భవిష్యత్తులో ఒక రోజు వ్యవధి 25 గంటలకు చేరుకునే అవకాశం ఉందని జర్మనీలోని మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సిటీతో పాటు అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్శిటీ పరిశోధకులువెల్లడించారు. ఈ మార్పుకు ప్రధాన కారణం భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు ప్రతి ఏడాది సుమారు 3.8 సెంటీమీటర్ల మేర భూమి నుంచి క్రమంగా దూరమవుతున్నాడు భూ భ్రమణం దాదాపు 1.7 మిల్లీసెకన్ల పాటు ఉంటుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఈ మార్పు దాదాపు ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చంద్రుడి వల్ల కలిగే టైడల్ ఘర్షణ. చంద్రుని గురుత్వాకర్షణ భూమి, మహాసముద్రాలను నిరంతరం ఆకర్షిస్తుంది. దీంతో చంద్రుడిని దూరంగా నెట్టివేస్తూ భూమి నెమ్మదిస్తుంది. కాలక్రమేణా, ఈ శక్తులు కొలవగల ప్రభావాలను కూడగట్టుకుంటాయి. అణు గడియారాలను ఉపయోగించి ఈ మార్పులను శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తారు. భూమి భ్రమణ స్థిరమైన వేగంతో నెమ్మదించదు. స్వల్పకాలిక మార్పులు భ్రమణాన్ని కొద్దిగా వేగవంతం చేస్తాయి లేదా నెమ్మదిస్తాయి. వాతావరణ పీడన మార్పులు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యరాశి పంపిణీని ప్రభావితం చేస్తాయి. కరిగే హిమానీనదాలు భూమి, మహాసముద్రాల మధ్య బరువును కదిలిస్తాయి. ఈ పునఃపంపిణీలు తాత్కాలికంగా భ్రమణ వేగాన్ని సూక్ష్మంగా ప్రభావితం చేస్తాయి.శాస్త్రవేత్తలు 25 గంటల రోజు సుదూరమని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులను దాదాపు 200 మిలియన్ (20 కోట్ల )సంవత్సరాలు పట్టవచ్చు. అంతేకాదు సుమారు 140 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్న సమయంలో భూ భ్రమణ వేగంఎక్కువగా ఉండేదని, అప్పట్లో ఒక రోజు పూర్తవడానికి కేవలం 18 గంటలే పట్టేదట. డైనోసార్ కాలంలో, రోజులు దాదాపు 23 గంటలు ఉండేవి. భూమిపై జీవితం క్రమంగా ఆ మార్పులకు అనుగుణంగా మారింది. పరిణామం తరతరాలుగా జీవ లయలను నెమ్మదిగా సర్దుబాటు చేసుకుంటుంది.ప్రస్తుతానికి, భూమి మునుపటిలాగే తిరుగుతోంది. అయితే నెమ్మదించే భ్రమణం శాస్త్రీయంగా మనోహరంగా ఉంది. ఈ పరివర్తన నెమ్మదిగా ఉంటుంది, విపత్తు కాదు,ఎలాంటి ఆందోళన అవసరం శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు.త ప్పుదారి పట్టించే వైరల్ వాదనలకు వ్యతిరేకంగా నిపుణులు జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. సహస్రాబ్దాలలో కొలిచిన మార్పును శాస్త్రం సూచిస్తుంది. -
ఒక రోజు.. ‘ముందుగా’ ముగిసింది
న్యూయార్క్: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 24 గంటల్లో ఒక రోజును పూర్తిచేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే గత నెల 29వ తేదీన 24 గంటలకు 1.59 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. అంటే కాస్త వేగంగా తిరిగి పుడమి కొత్త రికార్డును సృష్టించిందన్నమాట. దీంతో అతి తక్కువ రోజు( వన్ డే)గా జూన్ 29వ తేదీ నిలిచిపోనుంది. ఇలాంటి ఘటన మళ్లీ కొద్దిరోజుల వ్యవధిలోనే పునరావృతమవడం గమనార్హ ఈ నెల 26వ తేదీ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఆ రోజున భూమి 1.50 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. సెకన్లో వెయ్యో వంతు కాలాన్ని మిల్లీ సెకన్‌గా లెక్కిస్తారు. భూమి తన భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్పంగా పెంచిందని పరిశోధకులు వాదిస్తున్నారు. వారి వాదనకు బలం చేకూర్చే ఘటన 2021 ఏడాదిలో జరిగింది. ఆ ఏడాది ఒక నెల తక్కువ సమయంలో ముగిసిందని తేలింది. ఇలా జరగడం 1960ల దశకం తర్వాత ఇదే తొలిసారి కావడం ప్రస్తావనార్హం. అత్యంత తక్కువ సమయంలో రోజు ముగిసిన తేదీ కూడా అదే ఏడాదిలో నమోదవడం విశేషం. అదే ఏడాది జులై 19వ తేదీన 1.47 మిల్లీ సెకన్ల ముందుగానే భూమి ఒక చుట్టు చుట్టేసింది. -
నా భూభ్రమణ కాంక్ష
∙ముందుమాట ఎన్ని దేశాలు తిరిగినా కొత్త ప్రదేశం అని ఎక్కడా అనిపించలేదు. విదేశం అంటూ ఏదీ లేదు. దూరంగా ఉన్న స్వదేశాలే అన్నీ! ప్రపంచమంతా ఒక గుండ్రని గ్రామం. ‘మనసుకి నచ్చిన ప్రదేశాల్లోకి వెళ్లి అక్కడి ప్రజలతో కలిసిపోయి, వారి జీవన విధానంలో పాల్గొనాలి’ అనేదే నా భ్రమణ కాంక్షకి మూలం. లోకాన్ని తిరగటంలో నిజమైన ఆనందం ఉంది. తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది. మా తాతయ్య వైకుంఠ పెరుమాళ్లు మాదిరిగా పాటలు పాడుకొంటూ, ప్రకృతిని పూజిస్తూ, ‘పూర్తిస్థాయి దేశ దిమ్మరిగా మారిపోదాం’ అని డిగ్రీ చదివే రోజుల్లో అనుకొనే వాడిని. అలాంటి భావాలు నాకు చిన్నప్పటినుంచీ కొద్దో గొప్పో ఉండబట్టేనేమో, మా అమ్మమ్మ నన్ను ఎప్పుడూ ‘‘ఒరే, చిన్నగాలోడా! దేశమంతా తిరుగుతూ ఉంటావు. ఒక చోట కుదురుగా ఉండవు కదరా!’’ అంటూ నా భవిష్యత్ ప్రయాణాల ప్రభంజనం గురించి, ఒక ప్రవక్త మాదరిగా ప్రవచించింది. నా జీవిత చక్రాన్ని నాకు ఇష్టమైన బాటల్లో తిప్పుకొంటూ ఆనందించే పిల్లాడిని నేను. రసాత్మకమైన ఒక వాక్యానికి కావ్యంతో సరితూగ గలిగిన శక్తి ఉన్నప్పుడు, ప్రజల మధ్యకి చేసిన ఒక చిన్న ప్రయాణానికి కూడా సంవత్సరాలపాటు సాగిన పెద్ద అన్వేషణకి సమానమైన శక్తి ఉంటుందని నమ్ముతాను. ఈ పురాతన సత్రంలో ‘మనం ఉండేది కాసేపే’ అనే సత్యాన్ని తెలుసుకొన్న ఉమర్ ఖయ్యాం, దారి పొడవునా బుల్బుల్ పిట్టల సంగీతం వింటూ పచ్చిక మైదానాల్లోకి ప్రయాణాలు చేస్తూ, తన జీవన పాత్రని నిత్యం మధువుతో నింపుకొనేవాడు. మరణానికి భయపడటం మానేసి దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ, సుదూర ప్రాంతాలకి ప్రయాణాలు తలపెట్టారు మానవులు. దానిలో భాగమే భారతీయులు చేసిన కాశీ–రామేశ్వర తీర్థయాత్రలు, కైలాస పర్వతానికి చేసిన సాహస యాత్రలు. ఇదే విధంగా బ్రిటిషువారు ‘కాంటర్బరీ’కీ, ఇటలీవారు ‘మెడోనా దే గిసోల్’కీ, ఫ్రాన్సు దేశస్థులు ‘సెయింట్ జేమ్స్ వే’కీ ప్రయాణాలు చేశారు. దక్షిణ అమెరికాలోని పెరూ దేశస్థులు ‘మాఛు పీఛు’కి సాహస యాత్రలు చేశారు. ఇండియాకి ప్రయాణం చేసిన మధ్యయుగాల నాటి యాత్రికుల్లో గొప్ప వ్యక్తి తుడేలా బెంజిమీన్(క్రీ.శ. 1130–1173). ఆ తరువాత గొప్ప వ్యక్తి ఇబన్ బతూతా (క్రీ.శ. 1304–1377). ఇలాంటి గొప్పవారి రచనలు భారతదేశ చరిత్రకి ఆధారాలైనాయి. భౌతిక ప్రపంచపు బురద నుండి త్వరగా విముక్తి పొంది, ఆనందలోకాల్లో విహరించాలనే ఆశాభావంతో ఆనాడు బాణభట్టు (క్రీ.శ. 7వ శతాబ్దం) సర్వాంతర సంచారీ పాదలేపనాన్ని ఊహించాడు. 16వ శతాబ్దంలో అల్లసాని పెద్దన గారి ప్రవరుడు, సిద్ధుణ్ణి ‘‘ఏయే దేశములన్ చరించితిరి?’’ అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా ‘‘ఈ యా దేశంబననేల చూచితి, సమస్తాశావకాశంబులన్’’ అని చెప్పి గృహస్థునిలో యాత్రాభిలాషని రగిలించాడు. 1952వ సంవత్సరంలో చే గువేరా తొమ్మిది నెలల పాటు లాటిన్ అమెరికా మీదుగా ఉత్తర అమెరికాకి మోటార్ సైకిల్ మీద ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తన దేశ ప్రజల జీవన స్థితిగతుల్ని తెలుసుకున్నాడు. ఇలాంటి ప్రయాణాలన్నీ సమాజం మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపి, యాత్రల పట్ల స్పృహని పెంచాయి. అడివి బాపిరాజు(1895–1952) నవల ‘తుపాన్’లోని నాయకుడు తన ప్రపంచ యాత్రలో భాగంగా ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు తిరిగి కళాసాధన చేసి చాలామందితో పరిచయాలు పెంచుకుంటాడు. అది చదివినప్పుడు అలాంటి అవకాశం నిజంగా నాకు వస్తే బాగుంటుందని అనుకునేవాడిని. నేను ఒంటరివాణ్ణి. నా వాళ్లందరూ నాకు దూరమైపోయారు. చెట్టూ పిట్టలతో సహా నాకు అందరి స్నేహమూ కావాలి. ప్రయాణం అంటేనే ప్రేమ కోసం చేసే ఒక అన్వేషణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కళాకారులతో ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొన్నాను. ఎస్పరాంతో భాష నేర్చుకోవటం వలన మరికొందరు తోడయ్యారు. 2002వ సంవత్సరంలో నేను రాసిన ‘జిప్సీలు’ (ప్రపంచవ్యాప్త సంచారులు) కోసం ఆరు ఖండాల్లో చెల్లాచెదురుగా జీవిస్తున్న మనదేశపు ‘రొమానీ జిప్సీ’ల గురించి తెలుసుకోవటానికి ప్రపంచ యాత్రా సాహిత్యం అంతా అధ్యయనం చేయాల్సి వచ్చింది. తరువాత రాసిన ‘స్త్రీ యాత్రికులు’(2005) కోసం ఆరు ఖండాల్లో ఉన్న వివిధ దేశాల్లోని ‘స్త్రీ యాత్రా సాహిత్యాన్ని’ చదవటం వలన, ప్రపంచం గురించి రెండోసారి అవగాహన పెరిగింది. ‘మహా యాత్రికులు’ (2008) పుస్తకం కోసం మరొక్కసారి ‘ప్రపంచ యాత్రా సాహిత్య విజ్ఞాన సర్వస్వాన్ని’ తెలుసుకొన్నాను. అప్పటికే నేను ఇండియాలో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్రలు పూర్తి చేశాను. యాత్రా ప్రపంచాన్ని అధ్యయనం చేయటం వలన, ప్రపంచం అంతా ఒంటరిగా తిరగ్గలను అనే నమ్మకం కుదిరింది. నేను ప్రపంచయాత్ర చేయగలిగితే నా పాదయాత్రా జీవితానికి, ఒక పరిపూర్ణత, నిండుదనం కూడా వస్తాయి అనుకొన్నాను. ‘భూగోళం అంతా సంచారం చెయ్యాలి’ అనే ఆలోచనకు నాంది పలికిన మొదటి భారతీయ యాత్రికుడు ఏనుగుల వీరాస్వామి. ఆయన తన కాశీయాత్ర (1830–31)ని ముగించుకొని, తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం పట్టణానికి దగ్గరలో ఉన్న ‘అలమండ’ అనే గ్రామంలో ఆగినప్పుడు, పల్లకీలు మోయటంలో ఉప్పాడ బోయీల గొప్పతనాన్ని వర్ణిస్తూ ‘‘ఉప్పాడ బోయీలతో భూగోళ సంచారం యావత్తూ చేయవచ్చునని తోచుచున్నది’’ అనే నిర్ణయానికి వస్తాడు. భారతదేశంలో విపరీతంగా ప్రయాణాలు చేసిన వారిలో రాహుల్ సాంకృత్యాయన్(1893–1963) ప్రథమ స్థానాన్ని ఆక్రమించినా, ఆ తరువాత వచ్చిన ఎ.కె.చెట్టియార్ (1911–1983) విదేశీ యాత్రల గురించి పదిహేడు పుస్తకాలు రాసి, తమిళ యాత్రా సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. ఇలాంటి నేపథ్యంలో నా అంతర్జాతీయ ప్రయాణాలకు 2009వ సంవత్సరం మార్చి నెలలో అంకురార్పణ జరిగింది. అప్పటినుండి నిర్విరామంగా, ఆరు ఖండాల్లోని పద్నాలుగు దేశాల్లో ప్రయాణాలు చేశాను. ఆయా దేశాల్లోని అనుభవాలతో నేను రాసుకొన్న పుస్తకమే ఈ ‘భూభ్రమణ కాంక్ష’. ఈ యాత్రలో నేను అత్యంత ఆనందాన్ని పొందిన సంఘటనలు మూడు. ఇటలీలోని వెనిస్ నగరంలో మార్కోపోలో ఇంటికి వెళ్లటం, ఆ దేశంలోని విసెంజా అనే మరో నగరంలో యాంటానియో ఫిగటెట్టా ఇంటికి దగ్గరలో ఎనిమిది రోజుల పాటు నివాసం ఉండటం, హుయాన్ త్సాంగ్ నివసించిన దాయంతా పగోడాని దర్శించటం. నిరంతర ప్రయాణాలతో అలసిన నా పాదాలు సప్త సముద్రాల (ఇండియాలో బంగాళాఖాతం, అరేబియా సముద్రం; స్వీడన్లో బాల్టిక్ సముద్రం; నైజీరియా, బ్రెజిల్ దేశాల్లో అట్లాంటిక్ సముద్రం; ఇటలీలో అడ్రియాటిక్ సముద్రం; స్కాట్లాండ్లో నార్త్ సముద్రం; తాస్మానియా దీవిలో తాస్మానియా సముద్రం) తీరాల్లోని అలల వొడిలో అలసట తీర్చుకొన్నాయి. ఇన్ని దేశాలు తిరిగాక, ప్రపంచం అంతా నాదేననీ, అందరూ నా వాళ్లేననీ తెలుసుకొన్నాను. ఆ ప్రయాణాలు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించి, ఐశ్వర్యవంతుణ్ణి చేశాయి. ‘నాకు ఎవరూ లేరు’ అనే బెంగ తీరిపోయి, ‘ప్రపంచం అంతా నావాళ్లు ఉన్నారు’ అనే ధైర్యం ఏర్పడింది. ఎన్ని దేశాలు తిరిగినా కొత్త ప్రదేశం అని ఎక్కడా అనిపించలేదు. విదేశం అంటూ ఏదీ లేదు. దూరంగా ఉన్న స్వదేశాలే అన్నీ! ప్రపంచమంతా ఒక గుండ్రని గ్రామం. (బ్రెజిల్‌లోని రియో డీ జనీరో నగరంలోని క్రైస్ట్ ద రిడీమర్ విగ్రహం ముందు వ్యాసకర్త ఎం.ఆదినారాయణ 9849883570 ) (ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ తన ‘భూభ్రమణ కాంక్ష’కు రాసుకున్న ముందుమాటలోంచి; ప్రచురణ: బాటసారి బుక్స్)


