breaking news
Rohit law
-
రోహిత్ చట్టం తేవాలి: కన్హయ్య కుమార్
- మోదీ క్రసీ నడుస్తోంది - విద్యావిధానంలో సమూల మార్పులు రావాలి - లౌకిక విద్య కోసం రోహిత్ చట్టం తేవాలి - బీఫ్ తినొద్దని పశువుల కోసం మనుషులను చంపుతున్నారు - మీడియా సమావేశంలో జెఎన్‌ఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ సాక్షి, హైదరాబాద్ ప్రజాస్వామ్యం పతనమై(డెమోక్రాష్) మోడీక్రసీ నడుస్తోందని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ, ఢిల్లీ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ధ్వజమెత్తారు. దేశంలో మహిళ, దళిత, ముస్లిం అణిచివేత విధానాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఒక సెమినార్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఖాద్రీ, రాష్ట్ర అధ్యక్షుడు వేణు, ఇతర విద్యార్థి నాయకులు శంకర్, రాజారాంలతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న జాతి, మనువాద విధానాలు దేశంలోని ప్రధాన యూనివర్సిటీల్లో ఉన్నాయని, విద్యావ్యవస్థలో మార్పు తెచ్చేందుకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రోహిత్ చట్టం తీసుకురావడం ద్వారా అందరికీ విద్య, సమసమాజ స్థాపనకు కషి చే యాలన్నారు. హైదరాబాద్ యూనివర్సిటీలోకి మీడియాను కూడా అడ్డుకుంటున్నారని, రోహిత్ మరణం తరువాత కూడా పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. ప్రధానమంత్రి, విద్యా మంత్రుల డిగ్రీల విషయంలో ప్రశ్నలు తలెత్తే పరిస్థితి దేశంలో నెలకొందన్నారు. విద్యావ్యవస్థ పునాదుల నుంచే బలంగా ఉంటే ఎంసెట్ లీకేజీ వంటి దుష్పరిణామాలు పునరావతం కావన్నారు. -
రోహిత్ చట్టం తేవాలి
- పౌర సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం - రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు హైదరాబాద్: బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ శక్తుల కుట్రలో భాగంగానే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య జరిగిందని పలువురు వక్తలు ఆరోపించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా నాటకాలాడుతూ దళిత విద్యార్థులను ఎదగనివ్వకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. నిర్భయ చట్టం తరహాలో రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్, బండారు దత్తాత్రేయ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ తెలంగాణ డెమోక్రటిక్, సెక్యులర్ అలయెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘రోహిత్ ఆత్మహత్య-జరుగుతున్న పరిణామాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అలయెన్స్ కన్వీనర్ డాక్టర్ కొల్లూరి చిరంజీవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్, తామీరే మిల్లత్ ఉపాధ్యక్షుడు జియా ఉద్దీన్ నయ్యర్, ప్రొఫెసర్ నాగేశ్వర రావు, జమాతే ఇస్లామీ ప్రతినిధి అజారుద్దీన్, న్యాయవాది కె.ఎం.రాందాస్, ఏఐసీసీ సభ్యులు ఖలీ ఖుర్ రెహ్మాన్, జూపాక సుభద్రలతో పాటు మరో 40 సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. రోహిత్ ఆత్మహత్యపై ఢిల్లీ, ముంబై, కేరళలోని నగరాల్లోనే ఆందోళనలు జరుగుతున్నాయని,హైదరాబాద్‌లో కేవలం హెచ్‌సీయూ క్యాంపస్‌కే పరిమితమయ్యాయని కొల్లూరి చిరంజీవి అన్నారు. పౌరసంస్థలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధం కావాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు పేర్కొన్నారు.