breaking news
Revenant
-
'ఆస్కార్' బరిలో 12 నామినేషన్లతో
-
'ఆస్కార్' బరిలో 12 నామినేషన్లతో 'ది రెవనాంట్'
న్యూయార్క్: ఆస్కార్ అవార్డుల సీజన్ మొదలైంది. 88వ ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్ పొందిన చిత్రాల జాబితా విడుదలైంది. గురువారం ఈ జాబితాను విడుదల చేశారు. ఈసారి ఆస్కార్ అవార్డుల్లో సింహభాగం టైటానిక్ చిత్ర హీరో లియోనార్డో డికాప్రియో నటించిన ది రెవనాంట్ తన్నుకుపోయే అవకాశం ఉంది. ఈ చిత్రం మొత్తం 12 కేటగిరిల్లో ఆస్కార్ నామినేషన్ సాధించింది. 19వ శతాబ్దానికి చెందిన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడువంటి 12 విభాగాల్లో నామినేషన్ పొందింది. ఇంకా నామినేషన్ పొందిన ఉత్తమ చిత్రాలను పరిశీలిస్తే.. ది రెవనాంట్ స్పాట్ లైట్ ది బిగ్ షార్ట్ మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ ది మార్టీయన్ బ్రూక్లిన్ బ్రిడ్జి ఆఫ్ స్పైస్ రూమ్ ఉత్తర దర్వకత్వ విభాగంలో.. అలెజాండ్రో జీ ఇనార్రిటు- ది రెవనాంట్ టామ్ మెక్ కార్తి-స్పాట్ లైట్ జార్జ్ మిల్లర్-మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ లెన్నీ అబ్రహాంసన్-రూమ్ అడామ్ మెక్ కే-ది బిగ్ షార్ట్ ఉత్తమ నటి విభాగంలో కేట్ బ్లాంకెట్-కెరోల్ బ్రియే లార్సన్-రూమ్ చార్లోటి ర్యాంప్లింగ్-45 ఇయర్స్ సావోయిర్స్ రోనాన్-బ్రూక్లిన్ జెన్నిఫర్ లారెన్స్-జాయ్ లీడింగ్ యాక్టర్ విభాగంలో.. బ్రియాన్ క్రాంస్టన్ మట్ డామన్ లియోనార్డో డికాప్రియో మైఖెల్ ఫాస్ బెండర్ ఎడ్డీ రెడ్ మైనే