breaking news
recovery suit
-
స్టార్ కమెడియన్ మళ్లీ జైలుకు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు న్యూఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి కోర్టు వారికి వివరాలు అందించని కారణంగా గతంలో 10 రోజుల జైలు శిక్షను విధించింది. అయితే కమెడియన్ 4 రోజుల జైలుశిక్ష తర్వాత ఆయన విడుదలయ్యారు. 10 రోజుల జైలు శిక్షను డిసెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అనుభవించిన రాజ్‌పాల్ యాదవ్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. జస్టిస్ బీడీ అహ్మద్, విభు బక్రూలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలును విచారణకు స్వీకరించి శిక్షను నిలుపుదల చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ విడిచి ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్లరాదనే షరతును కూడా రద్దు చేసింది. రాజ్ పాల్ కేసు శుక్రవారం విచారణకు రాగా, మిగిలిన ఆరు రోజుల జైలు శిక్షను ఆయన అనుభవించాలని తీర్పులో పేర్కొంది. తీహార్ జైలులో జూలై 15 లోగా ఆయన లొంగిపోవాలని జస్టిస్ ఎస్ రవింద్ర భట్, జస్టిస్ దీపా శర్మ ధర్మాసనం సూచించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారి మురళి ప్రాజెక్ట్స్ యజమాని ఏంజీ అగర్వాల్ రాజ్‌పాల్ తన వద్ద 2010లో తీసుకున్న ఐదు కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదని కోర్టులో కేసు దాఖలు చేశారు. సొమ్ము చెల్లింపునకు సంబంధించి దంపతులు ప్రకటించిన అంగీకారాన్ని పలుమార్లు ఉల్లంఘించారని 2013లో రాజ్ పాల్ కు పది రోజుల జైలు శిక్ష విధించింది. -
బాలీవుడ్ నటుడికి 10 రోజుల పోలీస్ కస్టడీ
బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్ కు పది రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్ పాల్ యాదవ్, ఆయన భార్యపై ఓ వ్యాపారవేత్త దాఖలు చేసిన కేసులో వివరాలను గుప్తంగా ఉంచినందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్ పాల్ యాదవ్ పై 5 కోట్ల రికవరీ దావా ను నమోదు చేశారు. రాజ్ పాల్ యాదవ్ తరపు న్యాయవాదులిద్దరికి కోర్టు ఉల్లంఘన నోటీసులను కోర్టు జారీ చేసింది. కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రాజ్ పాల్ యాదవ్ భార్యను రిజిస్త్రార్ జనరల్ కార్యాలయంలోనే ఉండాలని జస్టిస్ ఎస్ మురళీధర్ సూచించారు.