breaking news
Realtor attempts suicide
-
కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం
-
కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం
హైదరాబాద్ : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఆర్థిక ఇబ్బందులే కారణమని మొదట అందరూ భావించినా.. ఆత్మహత్యల యత్నానికి మరో కారణం ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాడ్జ్‌లో దొరికిన సూసైడ్‌నోట్‌లో ఆత్మహత్యలకు నలుగురు వ్యక్తులు కారణమని.. తమ కుటుంబాన్ని మోసం చేసి ఆర్ధిక ఇబ్బందులకు గురిచేశారని ఉంది. దీంతో ఎస్ఆర్నగర్ పోలీసులు కుమార్ చౌదరి, మంజీలాల్ గాంధీలతో పాటు రవి, లలిత అనే మరో ఇద్దరు దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్య, ఆమె ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనగర్ కాలనీకి చెందిన అనిల్‌కుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కుటుంబ సభ్యులతో కలిసి లాడ్జిలో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నిద్ర మాత్రలు మింగాడు. ఆయన మృతి చెందగా, భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.