breaking news
Rambo Rajkumar
-
ఐటమ్ సాంగ్ లో చార్మి ఇరగదీసిందట!
ఇటీవల కాలంలో టాలీవుడ్ ను వదిలిసి బాలీవుడ్ పై కన్నేసినట్టు కనిపిస్తోంది. టాలీవుడ్ లో అగ్రతారగా రాణించిన చార్మికి టాలీవుడ్ లో సమంత, కాజల్, తమన్నాల నుంచి గట్టి పోటీ ఎదురవ్వడంతో కాస్తా వెనకబడిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'బుడ్డా హోగా తేరా బాప్' చిత్రంలో చార్మి కనిపించింది. అయితే 'బుడ్డా' చిత్రం చార్మికి ఆశించినంత పేరును బాలీవుడ్ తీసుకురాలేకపోయింది. ఎలాగైనా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలను చార్మి తెగ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రభుదేవా రూపొందిస్తున్న రాంబో రాజ్ కుమార్ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో ఇరగదీసినట్టు సమాచారం. హాట్ హాట్ గా తెరకెక్కించిన ఐటమ్ సాంగ్ లో షాహీద్ కపూర్ సరసన కిక్కెంచే శృంగార భంగిమలతో అదరగొట్టినట్టు ఫిల్మ్ నగర్ లో హాట్ టాక్ గా నిలిచింది. ఈ చిత్రంలో షాహీద్ కపూర్ తోపాటు మరో బాలీవుడ్ ముద్దు గుమ్మ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. 2007 లో కన్నడ చిత్రం లవ కుశ ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన చార్మి.. 'నీ తోడు కావాలి' అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత తెలుగులో అగ్రనటుల సరసన నటించి.. టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. -
హైదరాబాద్ చేరిన శ్రీహరి భౌతిక కాయం
-
హైదరాబాద్ చేరిన శ్రీహరి భౌతిక కాయం
హైదరాబాద్ : సినీ నటుడు శ్రీహరి భౌతికకాయం గురువారం ఉదయం ఆయన నివాసానికి చేరింది. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు. శ్రీహరి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం బాచుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. ఆయన కుమార్తె అక్షర అంత్యక్రియలు కూడా అదే వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. హిందీ చిత్రం రాంబో రాజ్‌కుమార్ షూటింగ్లో పాల్గొన్న శ్రీహరి మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను అక్కడే లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీహరి భౌతికకాయాన్ని దర్శించేందుకు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.