breaking news
rajya sabha adjourn
-
పార్లమెంట్లో అదే రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో చెలరేగిన హింస, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా పార్లమెంట్లో ఇదే పరిస్థితి కొనసాగింది. శుక్రవారం వాయిదా పడిన ఉభయసభలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. భారత్-చైనా సరిహద్దు ఒప్పందం పురోగతిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో ప్రకటన చేస్తారని ముందుగా భావించారు. కానీ ఎగువ, దిగువ సభలు ప్రారంభం కాగానే సభలో అదానీ, సంభాల్‌లో హింసాకాండపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.విపక్షాల ఆందోళనలతో సభలను మధ్యాహ్నం 12 గంటల వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు. ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు రేపటికి (డిసెంబర్ 3)కి వాయిదా పడ్డాయి. -
ఉత్తరాఖండ్ సంక్షోభంపై రాజ్యసభలో రగడ
ఢిల్లీ: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం వ్యవహారంపై రాజ్యసభ దద్దరిల్లింది. సోమవారం మలివిడత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాక ఉత్తరాఖండ్ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టగా, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లో సభకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ చైర్మన్ పోడియంను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ కాంగ్రెస్ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు శాంతించలేదు. దీంతో గందరగోళ పరిస్థితుల మధ్య సభను రెండుసార్లు వాయిదా వేశారు.