rahuketu puja
-
Rahu Ketu రాహుకేతువుల కథ
భారతీయ సంస్కృతిలో సూర్య, చంద్రగ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందుకు ఈ కథ ఒక కారణం: విష్ణువు జగన్మోహినిగా దేవతలకు అమృతాన్ని పంచిపెడుతుంటాడు. రాక్షసులకు సుర మాత్రం ఇచ్చి తాగిస్తుంటాడు. దీనిని దక్షప్రజాపతి శాపవశంతో రాహువు తెలుసుకునిఅసురుల వైపు నుంచి లేచొచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటాడు. ఈ విషయాన్ని సూర్య చంద్రులు కను సైగలతో విష్ణువుకి తెలియ జేస్తారు. అయితే అప్పటికే రాహువుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు.తర్వాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు కంఠాన్ని ఖండిస్తాడు. కానీ అప్పటికే రాహువు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల, మొండెం కూడా సజీవాలై ఉంటాయి. తల విష్ణువుతో ‘మహాత్మా! అకారణంగా నా కంఠాన్ని తెగగొట్టావు. నువ్వు ఇస్తేనే కదా నేను అమృతం తాగాను. నువ్వే ఇలా చేయడం మంచిదా’అని అడుగుతాడు.రాహువు మాటలు విన్న విష్ణువు మనసు కరుగుతుంది. ‘సరే జరిగిపోయిన దానినే తలచి బాధ పడడం తగదు. అది విధివిధానం. నీకేం కావాలో కోరుకో’ అంటాడు విష్ణువు. అప్పుడు రాహువు ‘దేవా! సూర్యచంద్రులు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు. కనుక వారిద్దరిని మింగడానికి నాకు అనుమతి ఇవ్వు’ అంటాడు.ఇదీ చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీఅందుకు విష్ణువు ‘నువ్వు సూర్యచంద్రులను మింగితే లోకాలన్నీ సంక్షోభంలో చిక్కుకుంటాయి. ఏడాదిలో ఏదైనా ఓ అమావాస్యనాడు సూర్యుడిని, పౌర్ణమినాడు చంద్రుడిని మింగి వెంటనే విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టకపోతే నీ తల వెయ్యి ముక్కలయి చనిపోతావు. సూర్యచంద్రులు నీకు చేసిన తప్పుకు వారికీ శిక్ష చాలు’ అంటాడు.రాహువుకు తల, మొండెం వేర్వేరు అయినప్పటికీ అమృతం సేవించిన కారణంగా ఒకరిద్దరయ్యారు. తల కేతువుగా సూర్యుడిని మింగడానికి, మొండెం రాహువుగా చంద్రుని మింగడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ విధంగా సూర్యచంద్రులు రాహుకేతువుల పాల్పడి గ్రహణాలు మొద లయ్యాయని పురాణ కథ. అయితే గ్రహణాలు ఏర్పడడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయన్నది గమనించాలి. – యామిజాల జగదీశ్ -
పేదోడికి పూజలూ భారమే
శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. ఆలయ ఆదాయంలో 85శాతం కేవలం ఈ పూజల ద్వారానే వస్తుంది. అంతటి ప్రాశస్త్యం ఉన్న పూజలు పేదలకు అందుబాటులో లేకుండా టిక్కెట్ ధరలు పెంచడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై పునరాలోచించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేయిస్తే సర్వ దోషాలు నివారణ అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పూజలు పెద్దలకు మాత్రమే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో పేదల కోసం రూ.250 టికెట్ ఏర్పాటు చేశారు. అలాగే రూ.750, రూ.1,500, రూ.2,500, రూ.5000 టికెట్లు కూడా ఉన్నాయి. భక్తులు వారివారి స్థోమతను బట్టి పూజలు చేయించుకుంటున్నారు. పెద్దలు ఎక్కువగా చేయించే టికెట్ల జోలికిపోని అధికారులు పదేళ్ల క్రితం రూ.250 టికెట్‌ను రూ.300కు పెంచారు. ఇకపై దాని ధర పెంచబోమని అప్పటి అధికారులు వెల్ల డించారు. ఆ మాటను పక్కనబెట్టి ప్రస్తుతం రూ.300 టికెట్‌ను రూ.500లు చేశారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానాన్ని పూర్తిగా వ్యాపార కేంద్రం చేసేశారంటూ మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.కోట్లలో ఖర్చు చేయాలి.. భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న మాస్టర్‌ప్లాన్ పూర్తి చేయడానికి కొన్ని కోట్ల రూపాయిలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇక పూజా సామగ్రి ధరలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. విధిలేని పరిస్థితుల్లో రూ.300 టికెట్‌ను రూ.500 చేయాల్సి వచ్చింది. – భ్రమరాంబ, ఆలయ ఈఓ ముందస్తు సమాచారం లేకుండా పెంచేశారు దేవస్థానం వారు ధరలు పెంచాలంటే పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా ఒక్కసారిగా పెంచడం సరికాదు. చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మాలాంటి వారికి ఇది భారమవుతుంది. రూ.200 అదనంగా ఖర్చు కావడంవల్ల శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించుకో కుండా వెళ్లిపోతున్నాం. –రామయ్యగౌడ్, మహేశ్వరి ఒక్కసారిగా రూ.200 పెంచడం సరికాదు రూ.300 టికెట్ ధరను ఒక్కసారిగా రూ.200 పెంచడం సరికాదు. పేద వారికి అందుబాటులో ఉండే టికెట్ ఇదొక్కటే. దాన్నే పెంచేశారు. నేను ఆరు నెలలకొకసారి సికింద్రాబాద్ నుంచి వచ్చి పూజ చేయిస్తుంటాను. దేవాదాయ శాఖ మరోసారి ధర పెంపుపై ఆలోచన చేయాల్సి ఉంది. – నివేద్‌వర్మ, ఆశ, దంపతులు -
కాళహస్తిలో నటి శ్రీదేవి పూజలు
అలనాటి అందాల నటి శ్రీదేవి.. శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేయించారు. ఆమె తన స్నేహితురాలుతో కలిసి విచ్చేశారు. రూ.2500 టికెట్ ద్వారా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద ఆలయ అధవికారులు శ్రీదేవిని శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆమెను చూడడానికి పలువురు ఆసక్తి చూపారు. దాంతో శ్రీదేవి మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. ఫోటోలు తీయరాదంటూ అసహనం వ్యక్తం చేశారు.